మనసునేలే వయ్యారమా

0
9

[box type=’note’ fontsize=’16’] మనసు మమతలకి నీడనిచ్చీ తోడుండే తరువే ప్రేమ అనీ; ధైర్యము ప్రేరణలకి తావిచ్చి ఎదను మీటే రాగమే ప్రేమ అనీ అంటున్నారు విసురజ ‘మనసునేలే వయ్యారమా’ అనే ఈ కవితలో. [/box]

[dropcap]వి[/dropcap]వశత్వపు వలపులలో
సహకారమే మైత్రివనం
తన్మయత్వపు పలుకులలో
మమకారమే బంధుజనం

తపించే తమకానికి
మైమరచే తపనలకి
కుదిరి నప్పితే సరిజోడీ
అదుపు తప్పితే హడావిడీ

మనసు మమతలకి నీడనిచ్చీ
తోడుండే తరువే -ప్రేమ
ధైర్యము ప్రేరణలకి తావిచ్చి
ఎదనుమీటే రాగమే – ప్రేమ

ఆత్మమోహాలనేలే వలపురాజ్యాలకు
ప్రియభాష్యాలే పరిచారికలు
చిరుచెమటలే వంధిమాగాధులు
ప్రణయసీమలే పహారాభటులు
తబ్బిబ్బూహలే పల్లకీమోతలు

సొగసులే సైగచేసి
మదేదోచి పోయేనాడు
శ్రుతిలయలే నవరాగతాళాలు
మదికోరికలే సరాగగేయాలు

వయసుకే అల్లరొచ్చి
గిచ్చి గుచ్చి గట్టిగా
నానాయాగీ చేసేనాడు
మధురిమలే పులకరింపులు
సరిగమలే నవగీతమల్లికలు

చూడబోవ పలవరమే కలవరమవ్వే
వినిపోవా మనసునేలే వయ్యారమా
మదిలోన తలవడమే ప్రమోదమయ్యే
తెలుసుకోవా మదినిదోచే ప్రియరాగమా

నిలవవా సఖీ
తలపే తాంబూలమివ్వ
తెలపవా ప్రియా
నాప్రేమే విశ్వవిజేతని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here