‘మనవడి పెళ్ళి’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన

0
12

శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే సాంఘిక నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.

ఈ సందేశాత్మక నవలలో ఆధునిక సమాజపు జీవన విధానం, వెనుకటి తరం వారి ఆలోచనా విధానాలు, గత సమాజంలోని, ప్రస్తుత సమాజంలోని సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన అత్తగారితో ఇబ్బందులెదుర్కున్న ఓ కోడలు – తాను అత్తగారయ్యాకా, కోడలితో సామరస్యంగా మసలుకుని మార్గదర్శకంగా నిలుస్తుంది.

ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు గాని, మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు అవడం ఎంత కష్టంగా ఉంటుందో, అందుకు గల కారణాలను ఈ నవలలో రచయిత్రి చర్చించారు.

నవల లోని బామ్మగారు తన మనవడికి పెళ్ళి చేయాలని పడిన తపన పాఠకులని ఆలోచింపజేస్తుంది.

బాల్యం నుంచి మితాహరం తింటూ, జంక్ ఫుడ్‍కి దూరంగా ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‍గా ఉంచుకోవాల్సిన అవసరాన్ని చర్చించారు రచయిత్రి.

చదువుకున్న మహిళలు ఏదో ఒక వృత్తిలో స్థిరపడాలని, ప్రతీ వ్యక్తికి ఏదో ఒక వ్యాపకం ఉండాలని రచయిత్రి సూచించారు.

దైనందిన జీవితంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిశీలించి, విశ్లేషించి స్త్రీలను ప్రోత్సహించేలా సాగుతుందీ నవల..

~

‘మనవడి పెళ్ళి’ ధారావాహిక 17 డిసెంబరు 2023 సంచిక నుంచి ప్రారంభం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here