మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా శాస్త్రజ్ఞుల నిరంతర కృషి

0
11

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా శాస్త్రజ్ఞుల నిరంతర కృషి’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

EMRI, EEG వంటి పరికరాలు మెదడులో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో/ఏ చర్యలు జరుగుతున్నాయో తెలుపగలుగుతున్నాయి కాని, అన్నిటినీ సమన్వయ పరచి సమగ్ర సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. జెరూసలెంకు చెందిన హిబ్రూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పుర్రెలో ఎలక్ట్రోడ్స్‌ను అమర్చటం ద్వారా ఆ వెలితిని పూరించగలిగారు. మెదడు కార్యకలాపాలకు సంబంధించిన అధిక ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవటానికి తద్వారా అవకాశం దొరికింది.

మెదడులో విజువల్ ఏరియాలు దృశ్య సంబంధిత సమాచారాన్ని ఎక్కువసేపు నిల్వ చేయలేవు. ‘యూనిలేటరల్ నెగ్లెక్ట్’ అన్నది ఎప్పటి నుండో శాస్త్రజ్ఞులను వేధిస్తున్న ప్రశ్న. కారణం- బ్రెయిన్ స్ట్రోక్ నుండి కోలుకున్న వారిలో విషయగ్రహణ సామర్థ్యం పాక్షికంగానే ఉంటోంది. వాళ్ళు చూచిన విషయాన్ని మొత్తంగా గ్రహించలేకపోతున్నారని తేలింది. సమాచారం అందినప్పటికీ దాన్ని అనుభూతి చెందలేక పోవటానికి లేదా గుర్తించలేకపోవటానికి కారణం ఏమిటి? మిగిలిన అనుభవాల వలె అన్నిటిలోనూ ప్రతిస్పందించిలేకపోవటానికి కారణం! మెదడు సమాచారాన్ని గ్రహించడంతో బాటుగా అది వారి అనుభవంలోకి రావాలంటే ఏం చేయాలి?

గత ఆరేడు సంవత్సరాలుగా మెదడులో స్పందనలకు సంబంధించిన వివరాల కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ Rose Faghih ఎలెక్ట్రో థర్మల్ యాక్టివిటీతో మైండ్‌లో జరిగే కార్యకలాపాలను అధ్యయనం చేస్తున్నారు. ‘మైండ్ వాచ్ అల్గారిథమ్స్’ సహాయంతో స్కిన్‍ని రిస్ట్‌బ్యాండ్స్, మైండ్‍ని మానిటర్ చేసే హెడ్ బ్యాండ్స్ వంటి పరికరాలను వినియోగించి పనితో ప్రభావితం అయ్యే మెదడు స్థితిగతులను అధ్యయనం చేస్తూ వస్తున్నారు.

క్లాస్ట్రమ్ – మెదడులోని ఈ భాగం సెరిబ్రల్ కార్టెక్ట్స్‌తో విస్తృతమైన అనుసంధానాలను కలిగి ఉంటుంది. మెదడులో క్రమానుగతంగా జరిగే చర్యలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

‘మైండ్ వాచ్’ ప్రకారం స్టిమ్యులెంట్స్ బీటాబాండ్ యాక్టివిటీని పెంచుతున్నాయి. ఈ బీటా తరంగాలకీ జ్ఞాపకకశక్తి సామర్థ్యానికీ సంబంధం ఉంది. సంగీతం వింటున్నప్పుడు, సువాసలను ఆస్వాదిస్తున్నప్పుడు, కాఫీ వంటి పానీయాలను ఆస్వాదిస్తున్నపుడు వారి వారి అభిరుచులను, స్పందనలను, జ్ఞాపకశక్తి సామర్థ్యాలను పరీక్షించారు. సాధారణ స్థితిలో – స్టిమ్యులెంట్స్ లేకుండానూ అవే పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు బీటా బాండ్ కార్యకలాపాలకు, స్టిమ్యులెంట్స్‌కు సంంధం ఉందని తేల్చాయి. దృశ్య సమాచారానికీ శరీరం కదలికలకూ సంబంధం ఉన్నట్టూ పరిశోధనలు చెప్తున్నాయి. అంటే శరీరంలోని మోటార్ స్కిల్స్‌కూ దృశ్య సమాచారానికి సంబంధం ఉందన్న మాట. కొత్త మోటార్ స్కిల్స్ నేర్చుకోవటంలో ‘విజువల్ కార్టెక్స్’ ప్రమేయం ఉంది.

త్వరగా నేర్చుకునేవారిలో మెదడులో కండరాల కదలికలను ప్రేరేపించి, నిర్దేశించే, సరిదిద్దే భాగాలు చాలా చురుకుగా ఉన్నాయి.

సినాప్టిక్ ప్లాస్టిసిటీ:

ఆస్ట్రోసైట్స్ లోని నాడీ అనుసంధానాలను సమయానుకూలంగా మారుస్తూ పోగల సామర్థ్యం Ca2+ గా నామకరణం చేయబడిన అంతర్ కణ సంకేత విధానం/ప్రక్రియ (Intra Cellular Signaling) – ఆస్ట్రోసైట్స్ కేవలం మెదడులోని వివిధ భాగాలను పట్టి ఉంచే ఆవరణ/అనుసంధానం మాత్రమే కాదనీ – మెదడులో వివిధ కార్యకలాపాల నిర్వహణ ప్రక్రియలో వీటి పాత్ర చాలా కీలకమని ఇటీవలి పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. న్యూరో ట్రాన్స్‌మీటర్ D-సెరైన్‌ను క్రమబద్ధం చేయడంలో ఆస్ట్రోసైట్స్‌దే కీలక పాత్ర. నక్షత్ర ఆకారంలో ఉండే ఈ గ్లయల్ కణాలు – సినాస్టిక్ ప్లాస్టిసిటీని క్రమబద్ధీకరిస్తూ క్రొత్త విషయాలను నేర్చుకోవడం, జ్ఞాపకం పెట్టకోవడం వంటి ప్రక్రియలలో నాడీ కణాలతో కలిసి పని చేస్తూ క్రొత్త సమాచారాన్ని చురుకుగా గ్రహించడంలో తోడ్పడతాయి. వీటి పనితీరు తేడాలతో జ్ఞాపకశక్తి, అది రూపొందడం వంటి ప్రక్రియల్లో తేడాలు వస్తాయి.

మెదడులో 6 సర్క్యూట్స్ -1) ప్రాముఖ్యత కలిగిన, సాధారణ 2) సతర్కతకు సంబంధించిన, 3) వ్యతిరేక 4) సానుకూల పరిణామాలకు కారణమయ్యే, 5) డిఫాల్డ్ మోడ్ 6) జ్ఞాపక సామర్థ్యాల నియంత్రణ ఉంటాయనీ, నేర్చుకునే ప్రకియలో కణాల నడుమ ప్రతి చర్యలు సైతం కీలకమనీ బయోమెడికల్ నమూనా మెదడుతో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో స్పష్టంగా తెలిసింది.

ఇప్పటి వరకు జ్ఞాపకశక్తికి సంబంధించి న్యూరాన్లదే ముఖ్యమైన పాత్ర అని ఉన్న అభిప్రాయం పొరపాటు అని ఈ పరిశోధనలతో తేలిపోయింది.

ఆహారం:

ఒమెగా-3 ఫాట్ ఏసిడ్స్, ఫోలేట్, విటమిన్ K, మరికొన్ని పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని – వాపు నుండి, ఆమ్లీకరణ కారణంగా తలెత్తే ఒత్తిడి నుంచి – కాపాడతాయని పరిశోధనల ఫలితాలు చెప్తున్నాయి. అంటే మన తిండి మన మెడదును నేరుగా ప్రభావితం చేస్తుందన్న మాట. మెడిటరేనియన్ డయట్ మెదడు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

పోషకాల లోపాలు మన మూడ్‌ని సైతం ప్రభావితం చేస్తాయి. జింక్ లోపిస్తే పెరిఫెరల్ కార్థిక్స్. హిప్పోకాంపస్ ప్రభావితం అవుతాయి. B-6 న్యూరో ట్రాన్స్‌మిషన్‍ని ప్రభావితం చేస్తుంది. కాపర్ ఎక్కుడైతే డోపమైన్ స్థాయి తగ్గి బ్రెయిన్ పనితీరు ప్రభావితం అవుతుంది. మెదడు కార్యకలాపాలలో వేగం పెరిగిపోయి అలసట, చికాకు వంటివి పెరిగిపోతాయి. సమతులాహారం చేసే మేలును ఈ విషయాలన్ని నొక్కి చెప్తున్నాయి.

విస్తృతంగా జరుగుతున్న ఇటువంటి పరిశోధనల ఫలితాల ఆధారంగా కేంద్ర నాడీమండల సంబంధిత వ్యాధులలో చికిత్స మరింత స్పష్టతతో, సమర్థవంతంగా నిర్వహించే అవకాశం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here