మన్యు సూక్తం ప్రాశస్త్యం

0
10

(శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మన్యు సూక్తం ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.)

వేదాలలో సూక్తాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఈ సకల విశ్వంలో, సమస్తాన్ని సర్వాన్నీ సృష్టించి, నిర్వహించే భగవంతుని దర్శించడానికి ఋషులు తపించారు. తీవ్ర వైరాగ్యంతో, సర్వ శక్తులను కేంద్రీకరించి తపస్సు చేస్తే, ఆ తపస్సులోనే వారు దర్శించిన వేద భాగాలే సూక్తాలయ్యాయి.

మానవాళికి వేదాంత సూత్రాలయ్యాయి. సూక్తం అంటే మంచిమాట. ‘బాగా చెప్పింది’ అనే అర్థం కూడా ఈ పదానికి ఉంది. మానవాళికి దిక్సూచి ఈ సూక్తాలు అంటే అతిశయోక్తి కాదు. ప్రకృతి పరిణామ క్రమం, దానిపై మనిషికి ఉండాల్సిన అవగాహన, ప్రకృతిని, భగవంతుడిని ఎలా ఆరాధించాలి, చేయాల్సిన పనులు, చేయకూడని చర్యలు, సాధించాల్సిన అద్వైత భావన, సర్వజీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం మొదలైన విషయాలన్నిటినీ వేదాల్లోని సూక్తాలు వివరిస్తాయి.

భక్తుడి మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండడానికి, పరమాత్మ మీద లగ్నం కావటానికి భారతీయ ఋషులు ప్రతిపాదించిన ప్రాథమిక సూచన వేద సూక్త పఠనం.

అయితే మనకు ఋషులు లభించిన సూక్తాలలో అతి ముఖ్యమైనది మన్యు సూక్తం.

సంస్కృతంలో మన్యు అంటే కోపం లేదా అభిరుచి. మన ఋషులు మనకు అందించిన అనేక సూక్తాలలో ఈ సూక్తం బహుళ ప్రాచుర్యం పొందింది మరియు ఎంతో ప్రభావవంతమైనది. ఈ సూక్తంలో పూజించబడే దేవత   కోపము మొదలైనవాటిపై విజయం సాధించిన నరసింహ భగవానుడు.

ఇతర దేవతలు వరుణుడు, ఇంద్రుడు మరియు రుద్రుడు  కూడా ఈ సూక్తంలో ప్రస్తావించబడ్డారు. మధ్వాచార్య మహాభారతంలో భీముడు దుశ్శాసనుని చంపిన సందర్భంగా మన్యు సూక్తాన్ని ఉటంకించారు. యుద్ధం చేసి, దుశ్శాసనుని చంపిన తర్వాత భీముడు ఈ శ్లోకం ద్వారా నరసింహ స్వామిని పిలిచాడని శాస్త్రాలలో వుంది. వైష్ణవ సన్యాసి ధీరేంద్ర తీర్థ నారసింహునికి అంకితం చేస్తూ మన్యు సూక్త వ్యాఖ్యానాన్ని రచించాడు. దీనిని రోజుకొకసారి వింటే చాలు మన ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనా నయం చేయబడతాయని ఋగ్వేదంలో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here