మరచిపోను – మరవనివ్వను

0
19

[అలెగ్జాండర్ కిమెల్ రచించిన ‘The action in the ghetto of Rohatyn, March 1942’ అనే కవితకి స్వేచ్ఛానువాదం అందిస్తున్నాము]

[dropcap]దా[/dropcap]డి కన్నా ముందరి ఘెట్టో(*) ప్రశాంతతను;
సుడిగాలికి ఆకుల్లా వణికే పిల్లలను
తిండి కోసం వెతికే తల్లులను
భయంతో కదిలే వాళ్ళ నీడలను
గుర్తుంచుకోవాలని నాకు లేదు
కానీ ఎలా మరిచిపోగలను?
వాటిని గుర్తుంచుకోవాలని అనుకుంటానా?

భూమిపైన సృజించిన నరకాన్ని
ఆనందంతో వేటాడుతున్న వేటగాడి రంకెలను
ప్రాణభిక్ష కోసం ప్రాధేయపడుతున్న వారి కేకలను
బాధ చెక్కిన తల్లుల వదనాలను
భయంతో దాగిన పిల్లలను
గుర్తుంచుకోవాలని నాకు లేదు
కానీ ఎలా మరిచిపోగలను?
భయంగా నేను తిరిగి రావటాన్ని
మరచిపోగలనా?

హఠాత్తుగా అదృశ్యమైన కుటుంబాలను
రక్తపు ఆవిర్లు చిమ్మే సామూహిక సమాధులను
పిల్లల కోసం నిష్పలంగా వెతికే తల్లులను
కత్తిలా కోసే విధ్వంసపు వేదనను
గుర్తుంచుకోవాలని నాకు లేదు
కానీ ఎలా మరచిపోగలను?
ఇవి గుర్తుంచుకోవాలని అనుకుంటానా?

అర్ధరాత్రిలో వినిపించే ఆక్రందనలను
తన్ని విరగ్గొట్టిన తలుపులను
ముక్కలయి గాలిలో ఎగిరే దుస్తులను
కరిగిన మంచులో కలిసే రక్తపు వాసనల రాత్రుళ్ళను
జాలిగా చంద్రుడు చూపే దారులను
తమ వారి కోసం వెతికే ముఖం లేని మనుషుల నీడలను
గుర్తుంచుకోవాలని నాకు లేదు
కాని ఎలా మరచిపోగలను?
తల్లక్రిందులయిన ప్రపంచాన్ని గుర్తుంచుకుంటానా?

క్షణాల్లో మరణించినవారు అదృష్టవంతులు
ప్రాణాలతో ఉన్నవారు శాపోపహతులు
గమ్యం తెలీని దీర్ఘ ప్రయాణం చేస్తారు
జీవులను నిర్జీవపు బూడిదగా, వాయువుగా
మార్చే ఆ ప్రాంతాలను
నేను ఎన్నటికీ మరిచిపోను
మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోనివ్వను

ఆంగ్లమూలం: Alexander Kimel
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్

*ఘెట్టోలు అంటే నాజీలు యూదులను హింసించిన ప్రాంతాలు


THE ACTION IN THE GHETTO OF ROHATYN, MARCH 1942.
by Alexander Kimel- Holocaust Survivor.

Do I want to remember?
The peaceful ghetto, before the raid:
Children shaking like leaves in the wind.
Mothers searching for a piece of bread.
Shadows, on swollen legs, moving with fear.
No, I don’t want to remember, but how can I forget?
Do I want to remember, the creation of hell?
The shouts of the Raiders, enjoying the hunt.
Cries of the wounded, begging for life.
Faces of mothers carved with pain.
Hiding Children, dripping with fear.
No, I don’t want to remember, but how can I forget?
Do I want to remember, my fearful return?
Families vanished in the midst of the day.
The mass grave steaming with vapor of blood.
Mothers searching for children in vain.
The pain of the ghetto, cuts like a knife.
No, I don’t want to remember, but how can I forget?
Do I want to remember, the wailing of the night?
The doors kicked ajar, ripped feathers floating the air.
The night scented with snow-melting blood.
While the compassionate moon, is showing the way.
For the faceless shadows, searching for kin.
No, I don’t want to remember, but I cannot forget.
Do I want to remember this world upside down?
Where the departed are blessed with an instant death.
While the living condemned to a short wretched life,
And a long tortuous journey into unnamed place,
Converting Living Souls, into ashes and gas.
No. I Have to Remember and Never Let You Forget.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here