మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-32

1
8

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

శ్రీ కొవ్వలి లక్ష్మీ నారాయణ గారితో ముఖాముఖి:

రచయిత్రి: నమస్తే అండి. ప్రపంచ భాషల్లోనే 1001 నవలలు రాసిన వారు మీ నాన్నగారే కదా. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి వారి పేరు నమోదు కాకపోవడానికి కారణం ఏమిటి?

కొ.ల.నా.: తెలుగు నవలా చరిత్రలో నాన్నగారి పేరు చిరస్మరణీయం అండి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి నాన్నగారి పేరు నమోదు చేయించడానికి కొంత ప్రయత్నం చేసామండి. కానీ వారు 1001 నవలలను చూపాలన్న నిబంధన ఉంది అన్నారు.

రచయిత్రి: మరి అన్నీ లేవా! మీరేమీ ప్రయత్నం చేయలేదా?

కొ.ల.నా.: మా ఇళ్ళల్లో ఉన్న పుస్తకాలన్నీ భద్రపరచామండి. నేను పదవీవిరమణ చేసాక ఈ ప్రయత్నం ముమ్మరం చేశాను. గ్రంధాలయాలు వెంట తిరిగాను. ఎక్కడ ఎవరు పుస్తకాలు ఉన్నాయని తెలిపినా బయలుదేరి వెళ్ళాను. కనీసం జిరాక్స్ కాపీలైనా సంపాదించాను. కానీ 600 పుస్తకాలు కంటే ఎక్కువ సేకరించలేక పోవడం మా కుటుంబాన్ని బాధించే విషయం.

రచయిత్రి: కానీ పుస్తకాల పేర్లు ఉన్నాయని విన్నాను. మాకోసం ఆ లిస్ట్ అయినా ఇస్తారా!

కొ.ల.నా.: తప్పక ఇస్తానండి..

 

(మిగిలిన నవలల వివరాలు వచ్చేవారం..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here