స్వాతి కవితలు-6- మరోసారి మళ్ళీ

0
9

[dropcap]ఎ[/dropcap]న్నో ఊహల మేడలు కట్టుకుని
ఎన్నో ఆశల బాసలు చేసుకుని
ఎన్నో అర్థంలేని మాటల మూటలు మోస్తూ
ఎన్నో మలుపుల సుడిలో అడుగులు వేస్తూ –
ఎన్నిసార్లు మనని మనం వెదుక్కున్నామో!
ఎన్నిసార్లు ఒకరినొకరు కనబడలేదని విసుక్కున్నామో.
ఇదిగో… అక్కడే వుండు…
నీ చూపుల దారుల్లో నేనడిచి వస్తా
పోనీ…
నా చూపై నువ్వు రా… నా కోసం… నీ కోసం…
మన కోసం… మరోసారి మళ్ళీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here