మీకు తెలుసా?

0
10

[box type=’note’ fontsize=’16’] మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో పోరు జరిగిన 18 రోజులలో వైరి వర్గాలు పన్నిన వివిధ వ్యూహాల గురించి సంక్షిప్తంగా వివరిస్తున్నారు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు. [/box]

[dropcap]‘కు[/dropcap]రుక్షేత్రం’ – పాండవ, కౌరవ వీరుల యుద్ధ ధర్మక్షేత్రంగా పిలువబడుతుంది. సింహము వలె గర్జించి శంఖమును పూరించినవాడు అమిత ప్రతాపవంతుడైన భీష్మపితామహుడు.

సైనికుల శంఖములు, నగారాలు, డోళ్ళు, మృదంగాలు, గోముఖ వాద్యాలు, మోతల హోరు. ఇటు పాండవులలో, శ్రీకృష్ణుడు ‘పాంచజన్యాన్ని’, ఆర్జనుడు ‘దేవదత్తమును’ భీముడు ‘కౌండ్రము’ని పూరించారు. యుధిష్టరుడు ‘అనంతవిజయా’న్ని, నకులుడు ‘సుఘోషము’ను, సహదేవుడు ‘మణిపుష్పకము’ను యుద్ధరంగంలో పూరించారు.

ఇంకా ఇతరులు కాశిరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపది ఐదుగురు కుమారులు సుభద్ర తనయుడు అభిమన్యుడు వేరు వేరు శంఖాలను పూరించినారు.

అసలు ధర్మము అంటే మరియొక అర్థము “కర్మము”.

భారత యుద్ధ కురుక్షేత్రంలో యుద్ధ పర్వములు ఐదు. భీష్మ పర్వము మొదటి యుద్ధ పర్వము.

భారత యుద్ధ కాలం 18 దినములలో భీష్ముడు 10 దినములు తానే సర్వసైన్యాధికారిగా వ్యవహరించి యుద్ధమును నిర్వహించినాడు.

యుద్ధ భూమిలో ఇరుసేనలు వ్యూహా రచనతో యుద్ధాన్ని కొనసాగించారు. వ్యూహరచన చేసిన దినములు 1,3,5,6,7,8,11,12,16. వ్యూహములు లేని సాదారణ యుద్ధములు 4,10,15 దినములు. 2,17 దినములలో ఒక పాండవులే వ్యూహాన్ని పన్నారు. 9,13,14,18 దినాలలో కౌరవులు వ్యూహాము పన్నారు.

1వ రోజున – మానుష వ్యూహం

2వ రోజున – అచల వ్యూహం

3వ రోజున- క్రౌంచ వ్యూహం

4 రోజున – గరుడ వ్యూహం

5వ రోజున – అర్థేందు వ్యూహం

6వ రోజున – మకర వ్యూహం

7వ రోజున – శ్యేన వ్వూహం

8వ రోజున – మండల వ్యూహం

9వ రోజున – వజ్ర వ్యూహం

10వ రోజున – కూర్మ వ్యూహం

భీష్మవ్యూహాలు సమాప్తం.

11వ రోజున – శృంగాటక వ్యూహం

12వ రోజున – సర్వకోభధ్ర వ్యూహం

13వ రోజున – శకలు వ్యూహం

14వ రోజున – మండలార్థ వ్యూహం

15వ రోజున – చక్ర వ్యూహం

16వ రోజున – సూచి వ్యూహం

17వ రోజున – దుర్జయ వ్యూహం

18వ రోజున – నామక వ్యూహం

చివరికి కౌరవల ఓటమి పాండవుల గెలుపు ఈ కురుక్షేత్ర రణరంగ ఫలితం. 18 లక్షల అక్షోణీల సైన్యం హతమొందింది. ఇదే యుద్ధ రాజనీతి – యుద్ధనీతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here