మేలుకొలుపు

2
11

[dropcap]ఏ[/dropcap]ది నీతి
ఏది అవినీతి
ఏది మంచి
ఏది చెడు
ఏది తప్పు
ఏది ఒప్పు
మనిషిని కేంద్రంగా
నిలిపి మాట్లాడు
………….
ఏ మత సమాజం
ఏ జాతీయ సమాజం
ఏ కుల సమాజం
ఏ వర్గ సమాజం
ఏ ముఠా సమాజం
ప్రాచీన భావాల
దాస్యం నుండి
తన్ను తాను విపులీకరించుకొందో
వివరించు..
ఏ రాజు
ఏ చక్రవర్తి
ఏ మతవాది
హింస, హత్య, దోపిడి
ధంధాలపై అందలం ఎక్కలేదో..
ఏ కత్తి ఏ శక్తి
రక్తపు మడుగుల
శవాల దిబ్బల
శౌర్యాల సాక్ష్యం కాదో..
గత చరితల చూడు
ఏ కాలం
ఏ దేశం
ఏ నాగరికత
ఏ మానవ సమాజం
మనిషిని మనిషిగా
నిలబెట్టిందో.. చెప్పు..
నిజం చెప్పు.
ఓ ఆధునికుడా
ఓ వివేకవంతుడా
ఓ నాయకుడా
ఓ కళాకారుడా..
ఏ కవి
ఏ బుద్ధిజీవి
ఏ మానవతావాది
ఏ.. ఏ.. మేలుకొనరా
మనిషిని మేలుకొలపరా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here