మేరే దిల్ మె ఆజ్ క్యా హై-11

0
11

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]

వీరుడి పిలుపు! {ఆవాజ్ – ఏ – ఆదాం!}

[dropcap]ఎం[/dropcap]త కాలం.. ఇంకెంత కాలం..
ప్రశ్నించే వీరుల గొంతులను…
అగ్గివలె చెలరేగే మా ఆకాంక్షలను నలిచివేస్తావో మేమూ చూస్తాం!
మేమూ చూస్తాం.. మేము కూడా చూస్తాం!
ఎంత కాలం..ఇంకెంత కాలం ఈ దమనకాండను.. అణిచివేతను కొనసాగిస్తావో
మేమూ చూసి తీరతాం!
ఉరికొయ్యలమీద నుంచి.., చెరశాలల నుంచి
ఖచ్చితంగా చూసే తీరతాం!
లోకపు బాజారులో నువ్వూ నీలాం అవడం.. మేమూ చూస్తాం
కొద్దిగా ఊపిరి బిగపెట్టుకుని విను..
వైభవోపేతమైన నియంత పతనాన్ని మేము కూడా చూడబోతున్నాం!
నువ్వూ ఈ రాజ్యాధికారపు నిరంకుసత్వాన్ని అలా చూస్తుండు!
మేమూ ఈ పతనాన్ని మహోద్వేగంతో చూస్తాం!
దుమ్ము పట్టిన రాజుల సొగసైన తలపాగాలు
ఒరిగి ఒరిగి పోయి నేల రాలడాన్ని మేమూ చూస్తాం!

మానవచరిత్రలో తిరుగుబాటు ఒక సంప్రదాయమని.. స్వేచ్ఛ అనివార్యమని
నీకు తెలియదా?
అయితే ఇప్పుడు తెలుసుకో!
ఎప్పటిదాకా మా మీద గురి పెట్టటానికి బాణాలు పోగు చేస్తావో మేమూ చూస్తాం!
మేమూ చూస్తాం ..ఎంత కాలం దౌర్జన్యం చేస్తావో మేము కూడా చూస్తాం!

ఓ చీకటి పుత్రులారా వినండి..
ఇది ఇక విడిపోయే సమయం..!
చీకటి వెలుతురు లోకి విచ్చుకునే శుభ దినం!
ఈ ఉదయం.. అరుణ పతాకం మహోజ్వలంగా రెప రెప లాడడాన్ని మేమూ చూస్తాం!
ఈ ఉదయమే ఉవ్వెత్తున ఎగిసే నిరశన జ్వాలల్ని మీరూ చూస్తారు ..
వీరుల పిలుపు అందుకున్న ..
మేము కూడా చూస్తాం!

మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

(ఈ ‘ఆవాజ్ -ఎ–ఆదం’ అనే కవితని సాహిర్ లుథియాన్వి 1949లో లాహోర్‌లో రాసారు. ఈ కవితలో ‘హమ్ భీ దేఖేంగే’ అనే వాక్యాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఎప్పటికైనా కమ్యూనిజమే గెలిచి తీరుతుందని, అరుణ పతాకం ఎగురుతుందని ఈ కవితలో సాహిర్ ఆశావహంగా రాశాడు. సాహిర్ అప్పుడు యువకుడు. పాకిస్థాన్ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయాలపై, దేశసమస్యలపై అసంతృప్తితో రగిలిపోతున్నవాడు. విద్యార్ధి ఉద్యమాల్లో.. ర్యాలీల్లో చురుకుగా పాల్గొంటూనే అనేక బహిరంగ సభల్లో ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చేవాడు. 1943లో తను పుట్టి పెరిగిన పంజాబ్ లోని లూథియానాని వదిలి పెట్టి, లాహోర్‌లో దయాల్ సింగ్ కాలేజిలో చేరి అక్కడ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కి అధ్యక్ష్యుడిగా ఎన్నిక అయినాడు. ఆ తరువాత ఆదాబ్-ఎ-లతీఫ్, షాహ్కార్, సవేరా అనే ఉర్దూ పత్రికలకు సంపాదకుడిగా చేసాడు. 1949 లో సాహిర్ రాసిన ఈ ‘అవాజ్-ఎ-ఆదాం’ {The voice of Man}… అప్పటి దేశవిభజన పూర్వ పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా యాంటీ కమ్యూనిజం పాలసీ అమలు కోసం చేస్తున్న పోరాటంలో తానూ తోడుగా నిలవాలనుకున్నది పాకిస్థాన్. కానీ సాహిర్ రాసిన ఈ కవిత పబ్లిష్ అయ్యాక, సాహిర్‌కి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి చాలా బెదిరింపులు రావడం వలన సాహిర్ లూథియానా వదిలి భారత దేశానికి వలస వచ్చేసాడు. ఈ కవిత ఒక రకంగా నియంతృత్వ పాకిస్థాన్‌కి వీడ్కోలు లాంటిది అని అనుకోవచ్చు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత ‘హమ్ భీ దేఖేంగే’ సాహిర్ లూథియాన్వి ‘ఆవాజ్-ఎ –ఆదాం’ లోంచి తీసుకున్నా ఫైజ్ కవిత పూర్తిగా భిన్నంగా ఉంది. సాహిర్ కవితలో ఆ వాక్యాలు ఫైజ్‌ని అంతగా ఆకర్షించాయి, ఉత్తేజ పరిచాయి. ఈ కవిత వల్ల ఫైజ్ మీద యాంటి-హిందూ ముద్ర పడిపోయింది.. ఫైజ్‌కి ఆ ఉద్దేశం లేకపోయినా కానీ. ఈ వాక్యాలు భారతదేశంలో స్వాతంత్ర్యం అనంతరం జరిగిన విద్యార్ధి ఉద్యమాల్లో విరివిగా వాడబడ్డాయి. సాహిర్ మాత్రం చాలా రాజకీయ స్పష్టతతో ఈ కవితను రాయడమే కాదు..1949 లో లాహోర్ లో ఒక బహిరంగ సభలో చదివాడు కూడా. ఆ తరువాత వారం రోజులకే ఇక మళ్ళీ పాకిస్థాన్ వెళ్ళ కూడదు అన్న దృఢ నిశ్చయంతో ఇండియాకి బయలు దేరాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు వామపక్ష భావాలున్న, మేధావులను, కవులను అందరిని కుట్ర కేసులు మోపి అరెస్ట్ చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. జియా నియంతృత్వ పోకడలకు నిరసనగా 1979 లో ‘హమ్ భి దేఖేంగే’ అన్న విప్లవ కవిత రాసినందుకు ఫైజ్‌ని కూడా అరెస్ట్ చేసి కొన్నేళ్ళు జైల్లో పెట్టింది. అయితే రష్యాలో జరిగిన బోల్షివిక్ విప్లవానికి 103 ఏళ్ళైన సందర్భంలో.. ఈ 2021 సంవత్సరంలో సాహిర్ లుథియాన్వికి వందేళ్ల సందర్భంలో ఆయన కమ్యూనిజంపై విశ్వాసంతో రాసిన ఈ కవితకు ఎంతో ప్రాశస్త్యం ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here