మేరే దిల్ మె ఆజ్ క్యా హై-14

0
10

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]

నిన్ను మరిచి ఎలా బతకాలో చెప్పు!

[dropcap]నా[/dropcap] చేతులతో నే స్వయంగా ప్రణయపు దీపాలు వెలిగించానా…?
ఎంత దౌర్భాగ్యమో చూడు..
ఇంతలో నేనే వాటిని ఆర్పేయాల్సి వచ్చింది.
నేను పరుచుకున్న నా ఆశల వీధులలోకి వెళ్లకుండా… నన్ను నేనే ఆపుకోవాల్సి వచ్చింది.
ప్రియా.. నిన్ను మరిచిపోవాలన్న నిర్ణయం ఎంత నిర్దయగా తీసేసుకున్నా కానీ…
నా హృదయానికీ.. నాకూ తెలియాల్సింది ఏమిటంటే…
అసలు నిన్ను మరిచి ఎలా బతక గల నన్నదే…!
ఇప్పుడెలా ఉండాలి నీతో నేను?

బహుశా.. రహదారుల్లో ఎప్పుడైనా నువ్వు కనిపిస్తే మొఖం తిప్పుకుని పోవాల్సిందేనా ఇక?
ఎవరైనా నీ పేరు తీసుకుంటే.. వినీ విననట్లు మౌనంగా చూపులు నేల వాల్చాల్సిందేనా ఇక..?
ఎంత దురదృష్టమో నాది చూసావా.. అర్థం అవుతుందా నీకు ఏమైనా?
ఇక ఈ జీవితానికి ఇంకేం మిగిలిందన్న దిగుల్లోనే రోజులు గడిచి పోతాయేమో…?
ఇంతకీ మరిక.. నేను చేయాల్సింది ఏమిటి…
నీ ఆలోచనల్లోంచి దూరంగా వెళ్ళిపోయి..
నీ మీది ఆశను భూమిలో పాతేసి..
ఎలా ఉంటానో ఏమో ఇక..
నిన్ను మరిచిపోవాలన్న నిర్ణయం తీసేసుకున్నా కానీ .,
నా ప్రియతమా
నా హృదయానికీ… నాకూ తెలియనిది ఏమంటే..
అసలు నిన్ను మరిచిపోయి ఎలా జీవించాలన్నదే!
నువ్వైనా చెప్పు!

 

మూలం: సాహిర్ లుథియాన్వి

స్వేచ్ఛానువాదం: గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here