మెరిసిన వజ్రం

    1
    5

    [box type=’note’ fontsize=’16’] రాజ్యాంగ నిర్మాత, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని కవితాత్మకంగా స్మరించుకుంటున్నారు కుంచె చింతాలక్ష్మీనారాయణ. [/box]

    చిక్కుముడుల జీవితాలకు
    నీ జీవితాన్నే నిదర్శనంగా నిలిపిన
    ఓ ఆదర్శమూర్తీ…

    దీపపు వెలుగు నీడ భాగాన
    చీకటి బతుకులను చైతన్య పరిచిన
    ఓ చైతన్య కారకుడా…

    గొంతు దాటని ప్రశ్నల మాటలకు
    ధైర్యరసాన్ని నూరిపోపిన
    ఓ వైద్యుడా…

    శాపంగా మారిన బ్రతుకులకు
    మోక్షాన్ని ప్రసాదించిన
    ఓ మునీశ్వరా…

    ముళ్ళ బాటను కాస్తా
    రాచబాటగా మార్చిన
    ఓ సమాజ నిర్మాతా…

    దేవాలయపు గోపురపు నీడ తాకలేని
    దళితజాతికి రక్షగా గ్రంథాన్ని నడిపిన
    ఓ మహారథ సారధీ…

    మానవజాతిని మలినం చేసి
    దళిత జాతిగా విడగొట్టినా…
    అణగారినవర్గ దర్మశాస్త్ర పండితుడుగా ఎదిగి
    దళితజాతి వనంలో దళిత పుష్పమై
    సుగంధ పరిమళంతో
    తన అక్షరాలతో మలినం కడిగిన
    ఓ మహాగ్రంథకర్తా…

    రామరాజ్యాన్ని
    రాజ్యాంగ రాజ్యంగా మార్చి
    పరిపాలనలో దిశానిర్దేశాన్ని చూపి
    ఓ గొప్ప సంఘ సంస్కర్తవై
    భారతరాజ్యాంగ రూపకర్తవై
    దళిత జాతి రత్నమై
    నలువైపులా కాంతులీనుతున్నావు!!

    -కుంచె చింతాలక్ష్మీనారాయణ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here