మిణుగురులు-7

0
12

[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]

[dropcap]91[/dropcap]
నువ్వొక్కడివే జీవిస్తావు పరిహారం లేకుండా
ఎందుకంటే, నీ గొప్ప మూల్యానికి వాళ్లంతా భయపడ్డారు,

92
అంతులేని అరుణోదయాల వలయంలో
అదే సూర్యుడు కొత్త ప్రదేశాల్లో కొత్తగా పుడతాడు

93
మరణంతో దేవుడి ప్రపంచం నిత్యం కొత్తగా పుడుతుంది
తన ఉనికితోనే రాక్షసుడు నిత్యం అణచబడతాడు

94
మిణుగురుబూచి మట్టిలోనే అన్వేషిస్తుంటే
నక్షత్రాలు ఆకాశంలోనే ఉన్నాయని
ఎన్నడూ తెలియదు

95
చెట్టు ఇవాళటిది, పూవు పాతది
అనాది విత్తనపు సందేశాన్ని
దానితో అది తెస్తుంది

96
నిత్య వసంతపు గులాబీనుండి
వచ్చే ప్రతీ గులాబీ
నాకు అభినందనలు తెస్తుంది

97
నేను శ్రమిస్తే దేవుడు గౌరవిస్తాడు నన్ను
నేను పాడితే నన్ను ప్రేమిస్తాడు అతను

98
నిన్నటి వదిలేసిన ప్రేమ గూడులో
నేటి నా ప్రేమకు ఏ చోటూ దొరకదు

99
బాధాగ్ని దేదీప్యమానమైన దారిగుండా
దాని దుఃఖంలో నా ఆత్మ కోసం వెతుకుతుంది

100
పచ్చిక దాని అసంఖ్యాక మరణాల నుండి పునర్జీవిస్తూ
కొండని బతికిస్తుటుంది

101
నువు నాకు అందకుండా పోయినా
నీలాకాశంలో స్పర్శతెలీని స్పర్శ వదిలి
గాలిలో నీడల్లో ఒక అదృశ్య రూపం సంచరిస్తోంది

102
ఒంటరైన కొమ్మ కోసం జాలిపడి
అల్లల్లాడుతున్న ఏకాకి ఆకుని ముద్దాడుతుంది వసంతం

103
తోటలో సిగ్గుపడుతున్న నీడ
సూర్యుని నిశ్శబ్దంగా ప్రేమిస్తుంది
అకులు గుసగుసలాడుకుంటుంటే
పూలు రహస్యాన్ని పసిగట్టి నవ్వుకుంటాయి

104
గాలిలో రెక్కల జాడలేవీ నేను వదలను
కానీ నేనూ ఎగిరాను అన్నదే నాకు సంతోషం

105
ఆకుల్లో మిణుకుమిణుకుమంటున్న మిణుగురులు
నక్షత్రాల్ని ఆశ్చర్యపరుస్తాయి

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here