మిర్చీ తో చర్చ-29: ప్రేమ – మిర్చీ… ఒకటే-11

0
7

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

ఓ గంట తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది.

“యస్”

“ఛార్జింగ్ అయింది సార్. సిగ్నల్ కూడా బాగుంది”

“ఏది? ప్రేమ సిగ్నలా?”

“మీరు భలేవారు సార్”

“చెప్పండి నరసింహం గారూ, మీ ప్రేమ కథ చాలా బాగుంది”

“సార్ ప్రేమ చిత్రమైనది”

“నూటికి నూరు పాళ్ళు”

“ముందరకీ వెళ్ళలేము, వెనక్కీ వెళ్ళలేము”

“అక్కడే ఉండాలనిపిస్తుంది”

“కరెక్ట్. కానీ ఉండలేము”

“ఎందుకలాగ?”

“తెలియదు”

“నేను చెబుతాను”

“చెప్పండి సార్”

“ఏం లేదు. మిర్చీ నములుతుంటే అలా మరి కొద్ది సేపు అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ అది అయిపోతుంది”

“అంటే ఏదీ శాశ్వతం కాదంటారు”

“అవును”

“అంటే ప్రేమ కూడానా?”

“అయ్యో, అలా అనకూడదు”

“అంటే?”

“ప్రేమ ఒక్కటే జీవితంలో శాశ్వతమైనది”

“కరెక్ట్”

“ఇంతకీ తర్వాత ఏమైంది?”

“చెబుతాను. అసలు ఈ ప్రేమ నిజమా కాదా అనే ఆలోచన కూడా ఉంది”

“ఎందుకలాగ?”

“వైద్యుడు అన్ని పరీక్షలు చేసి రిపోర్టులు పట్టుకుని ఏదీ తేల్చనట్టుంది”

“మంచి పోలిక”

“అంటే?”

“ఏదీ తేల్చనప్పుడు అది ప్రేమ కింద జమ అవుతుంది”

“అర్థం కాలేదు”

“రోగం గురించి తెలియనప్పుడు మామూలుగా దాన్ని ఏమంటారు?”

“సార్, న్యాయం పట్టి పిండితే, దానిని మాయరోగం అంటారు”

“సూపర్. ప్రేమ కూడా అంతే”

“ఓ. ఇది మాయరోగమా?”

“అవును. రోగాలను నయం చేసే మాయ”

“ఇది బాగుంది”

“దోషాలన్నీ ఈ మాయలో పడి మాయమైపోతాయి”

“ద్వేషాలు కూడానా?”

“తప్పకుండా. మిర్చీ కూడా ఒక మాయ”

“కరెక్ట్”

“ఇంతకీ ఏమైంది?”

’ఇందాక చెప్పాను”

“ఏంటది?”

“ముందుకూ వెళ్ళలేము, వెనక్కీ రాలేము”

“మంచిదని ఓ మాటనుకుందాం”

“మంచిదే. మేము ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాం!”

“శుభం”

“అంటే?”

“ఇరుక్కుంటేనే ప్రేమ. తప్పించుకోలేని పరిస్థితి ఉండాలి”

“అలా ఒక బైక్ పిల్లియన్ మీద నేను, మరో బైక్ పిల్లియన్ మీద అమ్మాయి”

“సూపర్. పిల్లియన్ మీద ప్రేమ – టైటిల్ అదుర్స్!”

“బళ్ళన్నీ ఆగిపోయాయి”

“మరి?”

“అంటే?”

“ఒకరిని ప్రేమించినప్పుడు లేదా ఒకరిచేత ప్రేమింపబడినప్పుడు బళ్ళు ఏమిటి? నవగ్రహాలు కూడా ఆగిపోయినట్లుంది”

“కరెక్ట్”

“ఏం చేసారు?”

“నేను అమ్మాయిని అలా చూస్తూనే ఉన్నాను”

“గుడ్, పట్టు వదలకూడదు. మరి అమ్మాయి?”

“కొద్దిసేపు తల వంచుకుంది”

“ఓ! అసలు సిసలు జాతిరత్నం!”

“ఇంతలోనే తల పైకి లేపింది”

“సింహంగారూ!”

“సార్”

“అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎలా స్పందించారు?”

“మొదటి ప్రశ్న – ఎలా అనిపించింది అంటే త్రాచుపాము బుట్టలోంచి టక్కున ఒక్కసారిగా లేచి పొజిషన్ తీసుకుంటున్నట్లుంది”

“రెండవ ప్రశ్న….”

“కరెక్ట్. నా స్పందన – నేను సూటిగా చూడలేకపోయాను”

“ఆ తరువాత ఏం జరిగింది?”

“ఆ బైక్ నడుపుతున్న వాడి చెవిలో ఏదో చెప్పింది.

“సింపుల్. తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఇదిగో నువ్వే అని చెప్పి ఉంటుంది”

“ఏమో. అతను సైడ్ స్టాండ్ వేసి దిగాడు”

“కొట్టడానికా?”

“కాదు. మమ్మల్ని దాటి పేవ్‌మెంట్ మీదున్న మిర్చీ బజ్జీలు తీసుకొచ్చాడు”

“ఓ”

“ట్రాఫిక్ జామ్ ప్రేమ జామ్‌లా ఉంది”

“తరువాత?”

“ఇద్దరూ వాటిని కమ్మగా సేవించారు”

“గుడ్”

“ఆ మిర్చీ వాడు డబ్బుల కోసం వాహనాలను తప్పించుకుంటూ ఇటే వచ్చాడు”

“ఓ”

“బళ్లు కదిలాయి. వాళ్ళ బైక్ ముందరకెళ్ళిపోయింది”

“అయ్యో”

“అమ్మాయి నాకు సైగ చేసింది”

“శభాష్. ప్రేమ పండింది”

“అతనికి డబ్బులివ్వమని సైగ చేసింది”

“ఓ”

“ఇచ్చాను. ఇందుకు పనికొచ్చింది మా ప్రేమ. ఏంటి సార్! మా బ్రతుకు?”

“బాధపడకండి. ఇది ఒక పరీక్ష. ప్రేమలో పరీక్షలు తప్పవు. ఇది మంచి మిర్చీ పరీక్ష!”

“అంటే అంటారా?”

“ముమ్మాటికీ అంతే!”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here