మిర్రర్ మిర్రర్

1
9

[box type=’note’ fontsize=’16’] “అద్దాన్ని ఆసరా చేసుకుని ఎన్ని కథలో… ఎన్ని సినిమాలో… సాహిత్యానికీ అద్దానికీ చాలా అవినాభావ సంబంధం ఉంది” అంటున్నారు సలీంమిర్రర్ మిర్రర్‘ కల్పికలో. [/box]

[dropcap]వె[/dropcap]న్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. రవికి వెన్నెలంటే చాలా ఇష్టం. స్నేహితుడి పెళ్ళికి వెళ్ళి, పెళ్ళి తర్వాత భోజనాలు ముగించి, వీడ్కోలు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యేటప్పటికి రాత్రి పదకొండు దాటింది. రెండున్నర గంటల ప్రయాణం… రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నాయి. కారు సర్రున దూసుకుపోతోంది. రవికి పాత సినిమా పాటలంటే చాలా ఇష్టం. డ్యాష్ బోర్డ్ వెతికి ఘంటసాల సుశీల గార్లు పాడిన హిట్ సాంగ్స్ ఉన్న క్యాసెట్‌ని సీడీ ప్లేయర్లో పెట్టాడు. జలపాతంలా కురుస్తున్న వెన్నెల… చెవుల్లో అమృత ధారల్లా కమనీయమైన పాటలు… చల్లగా వీస్తున్న గాలి… రవి మెల్లగా ఈల వేయసాగాడు… బాగా సంతోషంగా ఉన్నప్పుడు అనాయాసంగానే అతనికి ఈల వేయాలనిపిస్తుంది.

రోడ్డుకి కుడి వైపున స్మశానం కన్పించగానే అప్రయత్నంగానే ఈల వేయటం ఆగిపోయింది. అతనికి స్మశానాలంటే భయం. దయ్యాలు, ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయని చిన్నప్పుడు నానమ్మ చెప్పిన విషయం అతని మనసులో బలంగా నాటుకుపోయింది. ఏదో కమురు వాసన… శవం కాలుతున్నట్టు… కారు అద్దాల్ని పైకి లేపాడు. నిజంగా ఆ వాసన వచ్చిందా? భ్రమేమో… అక్కడేమీ మంట కన్పించలేదుగా. అది దాటేసిన పావు గంటకు గానీ అతని మనసు స్థిమితపడలేదు.

మరి కొంత దూరం ప్రయాణించాక రోడ్డుకి ఎడం వైపున ఉన్న చెట్టుకింద ఎవరో స్త్రీ నిలబడి ఉండటం గమనించాడు. ఆమె కొద్దిగా ముందుకు కదిలి కుడిచేతి బొటన వేలితో లిఫ్ట్ కావాలన్నట్టు సైగ చేయడంతో ఆమె పక్కగా కారాపి అద్దం కిందికి దింపాడు. మత్తుగొలిపే మల్లెల వాసన ఒక్కుమ్మడిగా అతని ముక్కుపుటాల్ని తాకి ఉక్కిరిబిక్కిరి చేసింది.

“లిఫ్ట్ ప్లీజ్” మనోహరంగా నవ్వుతూ అడిగిందామె. గొంతు కూడా ఎంత తీయగా ఉందో.. పాట పాడుతున్నట్టు… హిందీ సినిమా హీరోయిన్గా నాజూగ్గా ఉంది. వయసు ఇరవైకి మించి ఉండవనుకున్నాడు.

“ఎందాకా వెళ్ళాలి?”

తను వెళ్తున్న వూరి పేరే చెప్పింది.

అర్ధరాత్రి, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఓ అందమైన ఆడపిల్ల ఎందుకుంది? అనే అనుమానం పీకుతున్నా అతను వివశత్వానికి లోనై డోర్ తీసి “ఎక్కండి” అన్నాడు. ఆమె అతని పక్క సీట్లో సర్దుకుని కూచున్నాక అతనివైపు తిరిగి నవ్వుతూ “థ్యాంక్స్” అంది. ఆమె జడలో తురుముకున్న మల్లె పూల సువాసనతో పాటు ఆమె వొంట్లోంచి వస్తున్న సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ “లగేజేమీ లేదా?” అని అడి గాడు.

“లేదు. భుజానికో బ్యాగ్ చేతిలో సూట్‌కేసో ఉండాలా ఏమిటి? అది లేకపోతే లిఫ్ట్ ఇవ్వరా?” అంటూ నవ్వింది.

అతను తొట్రుపడుతూ “అలాగని కాదు. వేరే వూరికి ప్రయాణమైతే తప్పకుండా రెండు జతల బట్టలైనా సర్దుకుంటాం కదా. అందుకని…” అంటూ నసిగాడు.

“డొంక తిరుగుడు దేనికి? సూటిగానే అడగండి. మీ అనుమానం ఏమిటో చెప్పనా? ఇంత అర్ధరాత్రి పూట, ఒంటరిగా చేతిలో బ్యాగ్ కూడా లేకుండా ఎందుకు నిలబడి ఉంది? అనేగా. ఇక్కడినుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది మా వూరు… చిన్న పల్లెటూరు… నాకిష్టంలేని పెళ్ళి నిర్ణయించారు. ఈ రోజు నిశ్చితార్థం అయింది. అందరూ అలసిపోయి పడుకున్నాక, ఇంటినుంచి పారిపోయి వచ్చేశాను. బట్టలు సర్దుకునేంత వెసులుబాటు దొరకలేదు”

“అలాగా… మరి మిమ్మల్ని డ్రాప్ చేశాక ఎక్కడికి పోతారు? మీకక్కడ ఎవరైనా బంధువులో, స్నేహితులో ఉన్నారా?”

“లేరు. ఎక్కడ తల దాచుకోవాలో నాకూ అర్థం కావడం లేదు. ఎవ్వరూ చూడకుండా బైట పడాలనే కంగారులో డబ్బులు కూడా తెచ్చుకోలేదు. ఏదైనా లాడ్జిలో రూం తీసుకుని ఉందామన్నా వీలు కాదు” ఆమె సన్నగా ఏడుస్తోంది.

అతనికి చప్పున జాలేసింది. అందమైన అమ్మాయిల కళ్ళలో కన్నీళ్ళుండకూడదనేది అతని అభిప్రాయం. అతనికింకా పెళ్ళి కాలేదు. సంబంధాలు చూస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం… ఒక్కడే ఓ ఫ్లాట్‌లో అద్దెకుంటున్నాడు. అందమైన, వయసులో ఉన్న అమ్మాయిని నిరాశ్రయురాలిగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళడానికి అతనికి మనసొప్పలేదు.

“మా ఇంటికి వెళ్లాం వస్తారా?” అన్నాడు.

“ఇంట్లో ఎవరెవరుంటారు?”

“నేనొక్కణ్ణి”

“అమ్మో… నాకు భయం”

అతను పెద్దగా నవ్వాడు. “నేనేమీ మిమ్మల్ని తినేయనులెండి.”

ఆమె కూడా మల్లెల దొంతరలా నవ్వింది. వారం తిరక్కుండానే ఓ వర్షపు రాత్రి అతని కౌగిట్లో ఆమె…

రవి రోజురోజుకూ చిక్కిపోతున్నాడు. ఎన్ని పరీక్షలు చేయించుకున్నా అనారోగ్యమేమిటో తెలియడం లేదు.

ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో హఠాత్తుగా కారు ముందుకి ఓ కాషాయ వస్త్రాలంకృత జటాజూటధారి వచ్చాడు. నుదుటిమీద ఎర్రటి కుంకుమ బొట్టు. రవి సడన్ బ్రేక్ వేసి కారు ఆపి “చావడానికి నా కారే దొరికిందా?” అని తిట్టాడు.

“మూర్ఖుడా… చావు నీ యింట్లోనే ఉందిరా. ఆమె స్త్రీ రూపంలో ఉన్న ప్రేతాత్మ. జాగ్రత్త పడకపోతే దాని చేతిలో నీ చావు మూడిందిరా” క్రోధంగా చూస్తూ అన్నాడా సన్యాసి.

“ఏం వాగుతున్నావు? పిచ్చా నీకేమైనా? ఆమె నా కాబోయే భార్య” అన్నాడు.

“నా మాటల మీద నమ్మకం లేదా? దాన్ని అద్దం ముందు నిలబెట్టి చూడు. నీ కళ్ళు తెర్చుకుంటాయి” అతను వేగంగా నడుస్తూ ఎటుకో వెళ్ళిపోయాడు.

రవిలో సన్నగా మొదలైన అనుమాన బీజం బలపడసాగింది. యింట్లో నిలువెత్తు అద్దం ఉన్నా తనెప్పుడూ ఆమెను దాని ముందు సింగారించుకుంటూ ఉండగా చూళ్ళేదు. ఓసారి అద్దంలో చూస్కుంటూ సెల్ఫీ దిగుదామని ఎంత బతిమాలినా రాలేదన్న విషయం గుర్తొచ్చింది. ఆమె వచ్చాక అద్దాన్ని ఓ మూలకు జరిపి పెట్టేయటం కూడా గుర్తొచ్చింది..

సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా యిల్లు చేరుకున్నాడు. “ఈ రోజు తొందరగా వచ్చేశారే” అంది నవ్వుతూ ఆమె.

ఇంతందమైన అమ్మాయి దెయ్యం కావడానికి అవకాశమే లేదనుకున్నాడు. అయినా అనుమాన నివృత్తి కోసం గదిలోని అద్దాన్ని ద్వారం కన్పించేలా తిప్పి పెట్టాడు. ఆమెను లోపలికి రమ్మని పిలిచాడు.

“పొయ్యి మీద కాఫీ డికాక్షన్ మరుగుతోంది. ఏంటో తొందరగా చెప్పండి” గుమ్మంలో నిలబడి అడిగింది. అద్దంలో చూశాడు. గుమ్మం స్పష్టంగా కన్పిస్తోంది. ఆమె కన్పించడం లేదు. తల తిప్పి చూశాడు. ద్వారం మధ్యలో నవ్వుతూ నిలబడి ఉందామె.

భయంతో వణికిపోయాడు. ఏదో పనుందంటూ బైటపడి తనకు కన్పించి హెచ్చరించిన జటాజూటధారి కోసం వెతుకులాటలో పడ్డాడు…

***

ఇది చదువుతుంటే ఎన్నో హారర్ కథలు, చూసిన హారర్ సినిమాలు గుర్తొస్తున్నాయి కదూ. దయ్యాలు, ప్రేతాత్మల ప్రతిబింబం అద్దంలో కన్పించదనే మూఢనమ్మకం వీటికి ఆధారం. అద్దంలో వాటి ప్రతిబింబం కన్పించకపోవడానికి కారణం వాటికి ఆత్మ లేకపోవడం అట.

అద్దం, ఆత్మ, దయ్యాలూ… వీటిని అల్లుకుని ఎన్ని అపోహలో… ఎన్ని మూఢనమ్మకాలో… చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే యింట్లో ఉన్న అద్దాల్ని తెరలతో మూసి ఉంచే ఆచారం కొన్ని దేశాల్లో ఉండేది. అద్దాలు ఆత్మల్ని ఆకర్షిస్తాయట. చనిపోయిన వ్యక్తి ఆత్మని అద్దం లాగేసుకుంటే ప్రమాదమని వాటిని కప్పి ఉంచే వాళ్ళు. జనవరి ఒకటిన రాత్రి వెలుగుతున్న మూడు కొవ్వొత్తులతో అద్దం ముందు నిలబడి చనిపోయిన ఆత్మీయుల పేరు ఉచ్ఛరిస్తే వాళ్ళు దాన్లో కన్పిస్తారనే మరో నమ్మకం కూడా ఉంది. జనవరి ఒకటికి ఆత్మలకూ ఉన్న లింకేమిటో మరి. బహుశా ఆత్మలు కూడా కొత్త సంవత్సరారంభాన్ని సంబరంలా జరుపుకుంటాయేమో.

***

అర్ధరాత్రి… ఆశ్లేష గాఢ నిద్రలో ఉంది. కిటికీలకున్న గులాబీ రంగు కర్టెన్లు నీలిరంగు బెడ్ లైట్ వెలుగులో మెల్లగా కదుల్తూ కన్పిస్తున్నాయి. ఆశ్లేష నిద్రలోనే మరోపక్కకు ఒత్తిగిలి పడుకుని దుప్పటిని మెడవరకూ లాక్కుంది. గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ లోంచి సన్నటి పొగలా వచ్చి మంచాన్ని సమీపించింది. దుప్పటిలోంచి ఓ ఆకారం మెల్లగా పైకి లేస్తోంది. పీడకలేదో వచ్చినట్టు ఆశ్లేష భయంతో లేచి కూచుంది. దుప్పటిలోని ఆకారం మాయమైంది.

ఉదయం లేచాక బాత్రూంలో అద్దంలోకి చూసుకుంటూ పళ్ళు తోముకుంటున్న ఆశ్లేష ఏదో శబ్దం వినిపిస్తే తలతిప్పి అటువైపుకి చూసింది. అద్దంలోని ప్రతిబింబం మాత్రం కదల్లేదు. నిశ్చలంగా ఆమె వైపే కోపంగా చూస్తోంది. ఆశ్లేష అద్దంలోకి చూసింది. తన ప్రతిబింబం మొహం కాలిపోతున్న మైనపు బొమ్మలా కరిగిపోయి వికృతంగా మారిపోయింది. ఆశ్లేష భయంతో కళ్ళు విప్పార్చి అద్దం వైపే చూడసాగింది. ఒక్క సారిగా అద్దంలోంచి రెండు చేతులు బైటికొచ్చి ఆమెను అద్దంలోకి లాగేశాయి.

***

అద్దాన్ని ఆసరా చేసుకుని ఇలాంటి ఎన్ని కథలో… ఎన్ని సినిమాలో… సాహిత్యానికీ అద్దానికీ చాలా అవినాభావ సంబంధం ఉంది.

నా చిన్నప్పుడు మా యింట్లో చిన్న అద్దం ఉండేది. నక్కలోళ్ళు పల్లెల్లో ఇల్లిల్లూ తిరిగి అద్దాలు, దువ్వెనలు, పూసల హారాలు అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొనుక్కున్న అద్దం. పల్చటి చెక్కలో బిగించబడి, అరచేయంత వెడల్పుండేది. దానికోసం ఇంట్లో అందరం పోటీ పడేవాళ్ళం. నాన్న గడ్డం చేసుకోవాలన్నా అదే అద్దం, అమ్మ తల దువ్వుకోవాలన్నా అదే అద్దం. పిల్లలం మా మొహాలు చూసుకోవాలన్నా అదే అద్దం.

ఓ రోజు అద్దం పొరపాటున కిందపడి భళ్ళున పగిలింది. అంతే. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. అమ్మ కళ్ళలో దిగులు… “మరో అద్దం కొనుక్కోవచ్చుగా అమ్మా… దీనికే ఇంతలా బాధపడాలా?” అన్నాను. “అద్దం పగిల్లే ఏడేళ్ళు అరిష్టం. ఎలాంటి రోజులు చూడాల్సి వస్తుందోనని భయమేస్తోంది” అంది. ఈ మూఢనమ్మకం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఆత్మ ఏడేళ్ళకోసారి పునరుత్పత్తి చెందుతూ ఉంటుందని నమ్మేవాళ్ళు. అద్దం పగిలితే ఆత్మకూడా పగిలిపోతుందట.

నాకు హారర్ నవలలు చదడం, హారర్ సినిమాలు చూడటం ఇష్టం. స్కూల్ రోజుల్లో చూసిన డ్రాకులా సినిమా కాణ్ణించి ఇప్పటివరకూ వచ్చిన హాలివుడ్ హారర్ సినిమాలేవీ మిస్ కాలేదు. ఈ మధ్య నెట్లో కొరియన్, జపనీస్ హారర్ సినిమాలు కూడా చూస్తున్నా చాలా బావుంటాయి. బావుండటమంటే అర్థం బాగా భయపెడాయని. ఏదో తెలుగు సినిమాలో సత్యన్నారాయణ హారర్ నవలలు చదివి రాత్రుళ్ళు నిద్ర రాక మంచం మధ్యలో బాసింపట్టు వేసుకుని భయంతో వణుకుతూ కూచుని ఉంటాడు. అతని భార్య వచ్చి “దిక్కు మాలిన పుస్తకాలు చదవడం దేనికి? భయంతో నిద్ర రాక వణకడం దేనికి?” అని విసుక్కుంట్లో ఉంటుంది.

నాకెప్పుడూ అటువంటి పరిస్థితి దాపురించలేదు. ఒకే ఒక్కసారి “బివేర్ ఆఫ్ గాడ్స్” అనే నవల చదివి నిద్ర పాడు చేసుకున్నాను. ఈజిప్ట్‌లోని పిరమిడ్లూ వాటిని కాపాడే దేవుళ్ళ కథాంశంతో నడిచే నవల అది. పూర్తయ్యేటప్పటికి రాత్రి ఒంటిగంట దాటింది. అప్పటివరకు మేల్కోవడం అలవాటే కాబట్టి అదేమీ సమస్య కాలేదు. కానీ కళ్ళు మూస్తే చాలు ఈజిప్షియన్ గాడ్స్ కన్పించడం.. భయంతో లేచి కూచోవడం… తెల్లగా తెల్లారేవరకు వరకూ ఇదే తంతు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here