మొబైల్ బానిస

1
8

[హిందీలో శ్రీ ముఖేష్ కుమార్ మోడి వ్రాసిన కవితని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు డా. సి. భవానీదేవి]

[dropcap]మా[/dropcap]టిమాటికి నీ మొబైల్ ఎందుకు చూసుకుంటావు

ఏది తప్పిపోతుందని
నీ భయం

నీ మొబైల్ బ్యాటరీ అయిపోతున్నదా

ధనలక్ష్మి పిలుస్తుందనా

నిన్ను భోజనానికి రమ్మని
మాటిమాటికీ పిలుపు వస్తున్నది

కానీ మొబైల్‌తో నీకు తనివి తీరటంలేదు

నిన్నెవరయినా ఏమన్నాఅంటే కొంచంసేపు మొబైల్ వదిలేయి

నీ బాధ్యతలవైపు మనసును కొంతసేపు మరల్చు

పోట్లాడాలనిపిస్తుంది, కోపం పొంగుతుంది

నీ దూషణలు నీవాళ్ళను గాయపరుస్తాయి
నీ అలవాటు మంచిది కాదు,
ఎలా వదిలేయగలవు

జీవన సుఖశాంతులను పణం పెడతావా

నీ వాళ్ళతో మాట్లాడేందుకు సమయం ఇవ్వలేవు

ఎందుకంటే ఈ మొబైల్
నీ కాలాన్నంతా దోచుకుంటుంది

మొబైల్‌ని వాడటంలో జాగ్రత్తలు గుర్తించు

మాటిమాటికి మొబైల్ మీద నీ ధ్యాస పోతుంటే..

ప్రతి పనికి ఆధారం మొబైల్‌ని చేసుకుంటే..

దీని బంధంలో ప్రతిక్షణం చిక్కుకుపోతావు

ఒకనాటికి ఇదే మొబైల్ నీమీద అధికారం చెలాయిస్తుంది

మొబైల్ నీ యజమానిగా, నువ్వు దానికి బానిసగా మారిపోతావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here