[box type=’note’ fontsize=’16’] బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ చిరు కవితలు ప్రచురిస్తున్నాము. ఆషాడ జాతర గురించి, నాగ పంచమి గురించి, స్నేహం గొప్పదనం గురించి చెబుతున్నారు యువకవి సామల ఫణి కుమార్ ఈ చిరు కవితలలో. [/box]
[dropcap]వ[/dropcap]ర్ధమాన కవి సామల ఫణి కుమార్ మూడు చిరు కవితలు.
మహంకాళీ మమ్ము చల్లగా చూడు
1869లో మలేరియా వ్యాధి ప్రబలించగ
ప్రకృతి ప్రకోపానికి ప్రసన్నంకై
ఆషాడ మాస తొలి ఆదివారాన
ధూపదీప నైవేద్యాలతో జాతర జరిపే
కొత్త ఘటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి
వేపాకులు, పుష్పాలు గూర్చి, ప్రమిద వెల్గించి
మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాలతో
గోల్కొండ జగదాంగా ఆలయాన ప్రారంభించి
ఎల్లమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మకు
అర్పించి చివర సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళికి
పూర్ణకుంభం, పాకాలు సాకాలు సమర్పించి
ప్రకృతిని శాంతపరిచినారా…
నాగరాజా నన్నేలురాజ
శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు
అభ్యంగ స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో
నాగేంద్రునికి పాలు, పానకం, వడపప్పు నివేదించి
తాంబూల ఫల పుష్పాదులు, నారికేళం సమర్పించి
పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరుతో పూజ చేసి
పాలు గుడ్లు స్వీకరించి మాకు భోగభాగ్యాలు
ప్రసాదించు ఆదిశేషుడా
మిత్రమా వీడిపోవద్దమ్మా…
దాచుకుంటే దాగేది డబ్బు
దాచుకుంటే దాగనిది చదువు
సృష్టిలో స్నేహం బెస్ట్…
విడిపోకుంటే గ్రేటెస్ట్…
కలిసుంటే స్వీటెస్ట్…
వీడిపోవద్దని నా రిక్వెస్ట్…