ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 10

0
6

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

శిష్యః:

(ఉపసృత్య), ఉపాధ్యాయ, అయం శ్రేష్ఠీ చన్దన దాసః

అర్థం:

(ఉపసృత్య=సమీపించి), ఉపాధ్యాయ=గురుదేవా!, అయం+శ్రేష్ఠీ+చన్దన దాసః=వీరు చందన దాసు శెట్టిగారు.

చన్దన దాసః:

జేతు అజ్జో. (జయతు ఆర్య)

అర్థం:

ఆర్యః+జయతు=అయ్యవారికి జయము.

చాణక్యః:

(నాట్యేన విలోక్య) శ్రేష్ఠిన్, స్వాగతమ్, ఇద మాసనమ్, ఆస్యతామ్.

అర్థం:

(నాట్యేన=నాటకీయంగా, విలోక్య=చూసి), శ్రేష్ఠిన్=శెట్టిగారూ, స్వాగతమ్= స్వాగతమయ్యా, ఇదం+ఆసనమ్+ఆస్యతామ్=ఈ ఆసనం మీద కూర్చోండి. (దయచేయండి, కూర్చోండి).

చన్దన దాసః:

(ప్రణమ్య) కిం ణ జాణాది అజ్జో జహ అణుచిదో ఉపఆరో హిఅఅస్స పరిహవాదో వి దుఃఖ ముప్పాదేది తా ఇహ జ్జేవ ఉచిదాఏ భూమిఏ ఉవవిసామి.

(కిం న జానా త్యార్యః య థానుచిత ఉపచారో హృదయస్య పరిభావా దపి దుఃఖ ముత్పాదయతి. తస్మా ది హైవ ఉచితాయాం భూమా వుపవిశామి.)

అర్థం:

(ప్రణమ్య=వంగి నమస్కరించి), అనుచిత+ఉపచారః=నాకు తగని మర్యాద, పరిభవాత్+అపి=అవమానం కంటే కూడా, హృదయస్య+దుఃఖం+ఉత్పాదయత్=మనస్సుకు వేదన కలిగిస్తుంది – అని, ఆర్యస్య+కిమ్+న+జానాతి?=అయ్యవారికి తెలియనిదా?, తస్మాత్=అందువల్ల, ఉచితయా+భూమా+ఇహ+ఏవ+ఉపవిశామి= (నాకు) తగిన ఈ నేల మీద ఇక్కడే కూర్చుంటాను.

చాణక్యః:

భోః శ్రేష్ఠిన్, మా మైవమ్। సంభావిత మే వేద మస్మద్విధైః భవతః। త దుపవిశ్యతా మాసన ఏవ।

అర్థం:

భోః+శ్రేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, మా+మా+ఏవం=అలాక్కాదు కాదు, సంభావితం+ఏవ+ఇదం+అస్మత్+విధైః=మనవంటి వారికి ఇది తగినదే. తత్+ఆసనే+ఏవ+ఆస్యతామ్=అందువల్ల ఆసనం మీదే కూర్చోవాలి.

చన్దన దాసః:

(స్వగతమ్) ఉవక్ఖిత మణేణ దుట్ఠేన కిమపి। (ప్రకాశమ్) జం అజ్జో ఆణ వేదిత్తి.

(ఉపక్షిప్త మనేన దుష్టేన కిమపి – (ప్రకాశమ్) యదార్య ఆజ్ఞాపయతి). (ఉపవిష్టః)

అర్థం:

(స్వగతమ్=తనలో), అనేన+దుష్టేన+కిమ్+అపి+ఉపక్షిప్తం=ఈ కుత్సితుడు ఏదో చెయ్యబోతున్నాడు. (ప్రకాశమ్=పైకి), యత్+ఆర్యః+ఆజ్ఞాపయతి=సరే అయ్యవారి ఆజ్ఞ! (ఉపవిష్టః=కూర్చున్నాడు).

వ్యాఖ్య:

తనపట్ల చూపనవసరం లేనంత మర్యాద చేస్తున్నాడంటే ఈ దుర్మార్గుడు ఏదో చెయ్యబోతున్నాడని – తెలివిగా చందనదాసు గ్రహించాడు. అయినా వినయం ప్రకటించాడు. చాణక్యుడి మర్యాదను మన్నించినట్లుగా – నిర్దేశానుసారం ఆసనం మీదనే కూర్చున్నాడు (ఆ కాలపు ఆచరం ప్రకారం శ్రేష్ఠి నేలపైనే కూర్చోవాలేమో! – లేదా చందనదాసు అతి వినయం ప్రదర్శించాడో!)

ఈ వాక్యంలో ‘దుష్టేన’ అనే పదం (పాఠం) బదులు ‘ధూర్తేన’ అనే పాఠం కూడా వుంది. ధూర్తుడంటే – తుంటరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here