ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 12

0
7

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

భోః శేష్ఠిన్, స చ అపరిక్లేశః కథమావిర్భవ తీతి నను భవతా ప్రష్టవ్యాః స్మః।

అర్థం:

భోః శేష్ఠిన్=అయ్యా, శెట్టిగారూ; స+చ+అపరిక్లేశః=ఆ హింసలేమి, కథం+ఆవిర్భవతి+ఇతి=ఏ విధంగా సంభవిస్తుంది – అని, భవతా+ప్రష్టవ్యాః+స్మః+నను=మీరు (నీవు) నన్ను అడగాలి కదా!

చన్దన దాసః:

ఆణ వేదు అజ్జో. (ఆజ్ఞాపయతు ఆర్యః)

అర్థం:

ఆర్యః=అయ్యవారు, ఆజ్ఞాపయతు = ఆదేశించండి.

చాణక్యః:

సంక్షేపతో, రాజని అవిరుద్ధాభి ర్వృత్తిభి ర్వర్తితవ్యమ్

అర్థం:

సంక్షేపతః=క్లుప్తంగా (ఇదీ విషయం), రాజని=చంద్రగుప్త ప్రభువు విషయంలో, అవిరుద్ధాభిః+వృత్తిభిః=అనుకూలమైన రీతుల్లో, వర్తితవ్యమ్=నడుచుకోవలసి ఉంటుంది.

చన్దన దాసః:

కో ఈణ అధణ్ణో రణ్ణా విరుద్ధోత్తి అజ్జేణ అవగఛ్చీ అది. (ఆర్య, కః పున రధన్యో రాజ్ఞా విరుద్ధ ఇతి ఆర్యే ణావగమ్య తే?)

అర్థం:

ఆర్య=అయ్యవారూ, కః+పునః=ఎవరని, అధన్యః=దురదృష్టవంతుడు, రాజ్ఞా=ప్రభువుతో, విరుద్ధః+ఇతి=వ్యతిరేకి అని, ఆర్యేణ+అవగమ్యతే?=తమరు భావిస్తున్నారు? (తమచే భావించబడుతోంది?)

చాణక్యః:

భవానేవ తావ త్ప్రథమమ్

అర్థం:

తావత్=అలాగైతే, భవాన్+ఏవ=నువ్వే, ప్రథమమ్=మొదటివాడివి.

చన్దన దాసః:

(కర్ణౌ పిధాయ) సన్తంపావం! సన్తం పావం! కీదిసో తిణాణం అగ్గిణాసహ విరోహో. (శాన్తమ్ పాపమ్! శాన్తమ్ పాపమ్! కీదృశ స్తృణానా మగ్నినా సహ విరోధః)

అర్థం:

(కర్ణౌ పిధాయ=చెవులు మూసుకుని), శాన్తమ్+పాపమ్, శాన్తమ్+పాపమ్=పాపము శమించుగాక!, కీదృశః=అదెట్టిది?, తృణానం=గడ్డిపరకలకు, అగ్నినా+సహ+విరోధః=నిప్పుతో వైరమా (చెలగాటమా?)

చాణక్యః:

అయ మీదృశో విరోధః। యత్ త్వ మ ద్యాపి రాజాఽపథ్య కారిణో ఽమాత్యరాక్షసస్య గృహజనం స్వగృహ మానీయ రక్షసి

అర్థం:

యత్=ఏమంటే, అయం+విరోధః+ఈదృశః=వైరం ఏమంటున్నావా? ఇదిగో ఇది – , త్వం=నువ్వు, అద్యాపి (అద్య+అపి)=ఈనాటికి కూడా, రాజ్ఞ+అపథ్యకారిణః (రాజాఽపథ్య కారిణః)=చంద్రగుప్త ప్రభువుకు అనిష్టుడైన (కీడు తలపెట్టిన), అమాత్యరాక్షసస్య=రాక్షసమంత్రి (యొక్క), గృహజనం=కుటుంబాన్ని, అనీయ=తీసుకువచ్చి (దగ్గరకు తీసి), రక్షసి=కాపాడుతున్నావు.

వ్యాఖ్య:

చాణక్యుడు రాచకార్యాలలో వ్యంగ్యాల జోలికి పోడు. నేరుగా వ్యవహారం మాట్లాడే స్వభావం. అందుకే డొంకతిరుగుడు లేకుండా విషయం అడిగేశాడు. చందనదాసైనా ఇంకా, తన వినయం ప్రదర్శిస్తూ, “గడ్డిపరకలకు నిప్పుతో చెలగాటమా?” అంటూ ‘అర్థాంతరానికి’ పోయాడు గాని – చాణక్యుడు నేరుగా మాట్లాడాడు.

చన్దన దాసః:

అజ్జ అళీ అం ఏదం। కేణాపి అణభిణ్ణేణ అజ్జస్స ణివేదిదం. (ఆర్య, అళీకమేతత్। కేనా ప్యనభిజ్ఞేన ఆర్యస్య నివేదితమ్॥)

అర్థం:

ఆర్య=అయ్యవారూ, ఏతత్+అళీకమ్=ఇది అబద్ధం, కేనాపి+అనభిజ్ఞేన=ఎవడో తెలియనివాడు (వాడి చేత), ఆర్యస్య+నివేదితమ్=తమకు చెప్పడం జరిగింది.

చాణక్యః:

భోః శేష్ఠిన్, అల మాశఙ్కయా। భీతాః పూర్వరాజపురుషాః పౌరాణా మనిచ్ఛతా మపి గృహేషు గృహజనం నిక్షిప్య దేశాన్తరం వ్రజన్తి। తత స్తత్ప్రచ్ఛాదనం దోష ముత్పాదయతి॥

అర్థం:

భోః+శేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, ఆశఙ్కయా+అలం=అనుమానం లేదు, భీతాః+పూర్వరాజపురుషాః=భయపడిన పాత రాజోద్యోగులు, పౌరాణాం+అనిచ్ఛతా (న+ఇచ్ఛతాం)+అపి= ప్రజలకు ఇష్టం లేకపోయినా (ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా) కూడా, గృహేషు=ఇళ్ళల్లో, గృహజనం+ నిక్షిప్య=తమ కుటుంబాన్ని ఉంచి, దేశాన్తరం (దేశ+అంతరం)= పొరుగు ప్రాంతానికి, వ్రజన్తి=వెళ్తుంటారు. తతః=ఆ మీదట, తత్+ ప్రచ్ఛాదనం=అలా దాచి పెట్టడం, దోషం+ఉత్పాదయతి=తప్పుగా పరిణమిస్తుంది (తప్పు పుట్టిస్తుంది).

చన్దన దాసః:

ఏవం ణేదం। తస్సిం సమఏ ఆసి అహ్మఘరే, అమచ్చరక్ఖసస్స ఘరఅణోత్తి. (ఏవం ను ఇదమ్। తస్మిన్ సమయే ఆసీ దస్మద్గృహే అమాత్య రాక్షసస్య గృహజనః ఇతి)

అర్థం:

తస్మిన్+సమయే=ఆ సమయంలో (దేశంలో తిరుగుబాటు జరిగినప్పుడు), అస్మత్+గృహే=నా ఇంట్లో, అమాత్యరాక్షసస్య+గృహజనః=రాక్షసమంత్రి కుటుంబం, అసీత్+ఇతి+ఏవం+ను+ఇదమ్=ఉన్నదనే మాట ఏదైతే వుందో, అది నిజమే.

చాణక్యః:

పూర్వ మనృత, మిదానీ మాసీ దితి పరస్పర విరోధినీ వచనే॥

అర్థం:

పూర్వం+అనృతం=వెనుకటిది అబద్ధం, ఇదానీం+ఆసీత్=ఇప్పుడున్నది (అనే మాటలు), పరస్పర+విరోధినీ+వచనే=ఒకదానితో ఒకటి పొసగని మాటలు.

చన్దన దాసః:

ఎత్తిఅం జెవ్వ అత్థి మే వాఆచ్ఛలమ్। (ఏతావ దే వాస్తి మే వాక్ఛలమ్॥)

అర్థం:

ఏతావత్+ఏవ+మే+వాక్+ఛలమ్+అస్తి=ఇంతవరకే నేను చెప్పగలిగేది.

వ్యాఖ్య:

‘వాక్ఛలం’ అంటే నిజం ఒకటైతే, మరొకటి చెప్పి నమ్మించ ప్రయత్నించడం. (అవిశేషాభిహితేఽర్థే, వక్తు రభిప్రాయా దర్థాంతర కల్పనమ్ వాక్ఛలమ్.) ఇక్కడ చందనదాసు ఉద్దేశించిన అర్థం: ‘ఇది నా భావం’ అని మాత్రమే!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here