నా అంత్యక్రియలు

1
13

[క్లార్ హార్నర్ రచించిన అనే ‘Do Not Stand by My Grave and Weep’ ఆంగ్ల కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Clare Harner’s poem ‘Do Not Stand by My Grave and Weep’ by Mrs. Geetanjali.]

~

[dropcap]నా[/dropcap] సమాధి పక్కన నిలబడి.. దుఃఖించకు..
అందులో నేను లేను
నేను నిద్రపోను!
నేను.. వేయి గాలుల వేగంతో వీచే గాలిని!
మంచులో మెరిసే వజ్రాన్ని!
పండిన ధాన్యం మీద మెరిసిపోయే సూర్య కాంతిని!
వసంత కాలంలో..
ప్రాతః కాలపు నిశ్శబ్దంలో మంద్రంగా, మృదువుగా కురిసే వర్షాన్ని.
నువ్వు ఉదయపు తొందరలో బద్దకంగా నిద్ర లేచినప్పుడు..
నేను వాయువేగంతో ఎగిరిపోతాను.
ఆ వేగంలో పక్షులు మెల్లిగా గుండ్రంగా తిరుగుతాయి.
నేను ఉదయాన్ని అధిగమించలేని రాత్రిని!
అందుకే.. నా సమాధి పక్కన నిలబడకు.. ఏడవకు!
ఎందుకంటావా.. చెబుతా విను!
నేనసలు సమాధిలోనే లేను..
నిజానికి.. నేను మరణించనే లేదు!
అందుకే.. నా సమాధి పక్కన నిలబడకు!

~

మూలం: క్లార్ హార్నర్ (Clare Harner)

అనువాదం: గీతాంజలి


క్లార్ హార్నర్ (1909 -1977) కాన్సాస్‌లోని గ్రీన్‍లో జన్మించారు. చిన్న వయస్సు నుండే పియానోలోనూ, కవిత్వంలోనూ చక్కని ప్రతిభను ప్రదర్శించారు. కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో, ఇండస్ట్రియల్ జర్నలిజం, క్లాతింగ్ డిజైన్‌ అభ్యసించారు. కొంతకాలం కాన్సాస్‌లోని అగ్గివిల్లేలో బట్టల దుకాణం నిర్వహించారు. ఆమె సామాజిక కార్యకర్తగానూ, కార్యదర్శిగాను పనిచేశారు. ఆమె ఫెయిర్‌చైల్డ్ పబ్లికేషన్స్‌లో ఉద్యోగిగా చేరారు. ఈ సమయంలో, ఆమె అనేక కవితలు వ్రాసి ప్రచురించింది. ఈ కవిత మొదటిసారిగా ది జిప్సీ పత్రిక యొక్క డిసెంబర్ 1934 సంచికలో ప్రచురితమైంది, తరువాత వారి ఫిబ్రవరి 1935 సంచికలో పునర్ముద్రించబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here