నా రుబాయీలు-12

0
13

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
ఈ పాలనలో వందమంది అవినీతిపరులు చచ్చారు
వారి జాడ వెతకలేక పాపం విలేకరులు చచ్చారు
మా ఆఫీసులో అసలు లీవంటే పెద్ద బూతే మరి
నా కోసం మా తాత ఒక్కరే వందసార్లు చచ్చారు

2.
స్వార్థపూరిత లోకాన నీకై నిలిచే చరిత ఎవరు
పతియే తన దైవమని ముదమొంది నడిచే సీత ఎవరు
వేకువ జామున పిడప చుట్టి ప్రదక్షిణాలు చేస్తుంటే
తులసికోట వెలుగులో ఇద్దరిలో తులసిమాత ఎవరు

3.
మూడు కత్తులతొ ముష్టియుద్ధం చేశాను నేడు
బుల్లెటునే ఒడిసిపట్టి ఆటలాడాను నేడు
జిల్లెట్లు ఎన్ఫీల్డులే ఠీవీలు పెంచు మాకు
ఎంతని వేచాను పెళ్లికొడుకునయ్యాను నేడు

4.
గుండెలవిసేల ఏడ్చినా మీకు ఏమీ కాని నేను
ప్రాణంలేని మనసుఒడిలో సాంత్వన పొందితిని నేను
దైవం, కాలాలు చల్లార్చలేని కుంపటిలే లోన
మీ జగదోద్ధార హృదయాలకో తాగుబోతుని నేను

5.
గుండియలోని బాధ లావాకు తక్కువేం కాదు
సముద్రరాశి నా ప్రేమ కన్న ఎక్కువేం కాదు
ఔనంటే ప్రతిరేయి పున్నమిలే పూయు మనకు
సంపదలెన్నైనా నీ ముందు మక్కువేం కాదు

6.
ఆకలిని మరిపించు నీ అంకము చేరేది ఎప్పుడు
వెన్నెలని తలపించు నీ మోమున వెలిగేది ఎప్పుడు
మా ఇంటికి వస్తే నా ఇంటి పేరు ఇచ్చేస్తాను
బ్రతుకును నడిపించగ నీ పేరును పిలిచేది ఎప్పుడు

7.
ఆర్తిగ ఎంత పిలిచిన గొంతుకు అలుపు లేదు
ప్రతిగా ఎంత వేచిన వీనుకు పిలుపు లేదు
నీ ఊసుల విత్తనాలు పండించగ ఎదలొ
ప్రీతిగ ఎంత పెంచిన మడికే కలుపు లేదు

8.
వర్షం కురుస్తుంటే గొడుగును వేడు
వడగళ్ళు చేరితె పైకప్పును వేడు
పిడుగులకు నీ తలొక్కటే గురైతే
భక్తితొ భగవంతుడి నామమును వేడు

9.
నీవూ చావూ రెండూ రావు కద
దాడేల! నాకస్త్రాలు లేవు కద
నీ ఒక్క స్మరణే వ్రణమూ ప్రియమూ
వ్యథ చితి కాగ వీడి నను పోవు కద

10.
ఎవ్రీవేర్ బాస్ ఈస్ రైట్
ఎనీవేరు వైఫ్ ఈస్ రైట్
హూ సేస్ ఇన్ ఫ్రంట్ అఫ్ థెమ్
యాక్చువల్లి వాట్ ఈస్ రైట్

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here