నడక..!

2
12

[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘నడక..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కరికి ఒకరం పక్కపక్కనే
ఇరువురి చేతుల్లో చరవాణి విన్యాసాలు
కవన యుద్ధం నాదైతే, భక్తి ఉద్యమం ఆమెది
మైళ్ళ దూరం తలపిస్తున్నట్లుగా మమేకం

కాల ఉగ్రరూపంలో కరోనా బందీలం
కాలు బయటపెట్టరాదు, మూతికి మాస్క్ విడవరాదు
భౌతిక దూరం పాటించడమే బతుకు లక్షణాలు
సమాజంతోనే జీవనం, నియమాలన్నీ సదా ఆచరణీయాలే

జననం, మరణం ఆద్యంతాలు
ఈ రెండింటి మధ్యనే అనేకానేకాలు
చచ్చి బ్రతికినట్లు, బ్రతికి చచ్చినట్లు
మనిషి మనుగడలో మంచితనమే కీర్తి బావుటా

సహకరించుకోవడమే ఆశయంగా నడక సాగాలి
ఒంటరి పోరులో గమ్యం చేరడం నిష్ఫలం
విమర్శకులూ, వ్యతిరేకులూ నీతోనే ఉంటారు
నీ బాటకు రహదారులెన్నడూ తివాచీలు పరచవు
నీకు నువ్వే నిరంతరం మేల్కొనే ఉండాలి
సమాజంతో నీవు, నీతో సమాజమూ.. నడవాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here