నానీలు 1.2

0
7

11 .
కన్నీళ్ళు
ఇంకితే పాతాళ గంగ…
గునపం దిగితే
పుడుతుంది ”జల ”…!!!

12 .
రంగస్థలం మీద
ఆటబొమ్మలు…
బ్రతుకుతెరువులో
తులసిమొక్కలు. ..!!!

13 .
జీవితము
అయిపోతోంది…
దీపం పెట్టుకోవాలి
ఇప్పుడైనా…!!!

14 .
దేనికో
నిరంతర అన్వేషణ?
సంతృప్తి
శూన్యం…!!!

15 .
జారింది
ఒక కన్నీటి బొట్టే…
ఎంతటి
మనశ్శాంతి…!!!

16 .
చిటికిన వేలు
ఎంతగొప్పది. ..?
అచ్చమైన తోడుకు
ఆలంబన…!!!

17 .
వాడు
పొగిడాడు…
ఇగో కు
కొంత తృప్తి…!!!

18 .
జీవితం
నిండుకుండ అయితే…
పగిలినా
‘ఆత్మ’ సంతృప్తి…!!!

19.
అందరి రక్తం
ఎరుపే…
గ్రూపు మారితే
తేడానే…!!!

20 .
పెద్దరికాలు
మౌనపాత్రలు…
చిన్నారికాలదే
మాటలరాజ్యం…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here