నవమి – ఖండిక 8: అహల్య

0
7

[box type=’note’ fontsize=’16’] “నవమి” అనే ఖండకావ్యంలో మొత్తం తొమ్మిది ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో చక్కని పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ఈ ఖండకావ్యాన్ని అందిస్తున్నారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది 8వ ఖండిక ‘అహల్య’. [/box]

[dropcap]‘అ[/dropcap]హల్య’ – ‘నవమి’ ఖండకావ్యంలోని 8వ ఖండిక.

***

నలువకుంగూతురైన యానళిననతుని
తపసి గౌతము భార్యయై తనరునబల
అందగత్తెలకెల్లను నందగత్తె
మంచి సంతును గన్నట్టి మహితచరిత
ఆయహల్యతాబొందనీ హేయమైన
బాధలకు దాము వ్యధనంది పడతురెల్ల
సానుభుతిని పలుకంగ సాగిరిట్లు. (1)

ఎందరులేరు విశ్వమున నెంచగగాంతలు కోట్లకొద్దిగా
అందరికిట్టి దుస్థితి యునబ్బెనె? హానియు గల్గెనే కడున్?
డెందముగుందు, సంతతముడీల్పడి పోవు మనంబు సర్వమున్
అందముగల్గు పుట్టుటయెయమ్మరోనీకును శాపమాయెనా. (2)

ఆడ పుట్టువు పుట్టుటే యధమమనుచు
దెలుపుచుండును నీదగు దీనచరిత
బలగముండియు జగతిని ఫలమదేమి?
కష్టవార్ధిగనయ్యె నీ కాపురంబు. (3)

జననమెట్టిది యైనను ఘనమదేమి?
నిన్ను బాధలు పడకుండ సన్నుతాంగి
ఆపగలిగెనె యెద్దియునవనియందు
సానుభూతిని దెల్పరా సాధుమతులు. (4)

తప్పులుజేయు వారికిని దండననిచ్చుట జెల్లుగాని
తప్పిదమింతయే నియానుధారుణి జేయనినీకు శిక్షనున్
ఒప్పిదమే కరంబునిడ! నున్నతమౌ చునునొప్పుగా కడున్?
చొప్పదియౌనె పెద్దలకు! శోభను గూడ్చనె యిట్టి చర్యలున్? (5)

ఈడు జోడు జూచి యింపైనరీతిగా
మంచిచెడ్డలరసి మహితగతిని
పెండ్లి జేయవీలయు బెద్దతావారలు
తగుననిట్లు జేయధార్మికులకు. (6)

నలువసృష్టికినెనలేని నాణ్యతయును
తెచ్చిపెట్టిన నీ దివ్యతేజమిలను
తుదకునిట్టులనయ్యెనా తోయజాక్షి!
అడవిగాచిన వెన్నెలయైనయట్లు. (7)

పరమలావణ్య సౌందర్యగరిమతోడ
నందగించుచునున్నట్టి సుందరాంగి
నిన్నుమౌనికి ముడిబెట్ట గన్నవారి
కెట్లు మనసొప్పెనో యేమో? యెడుగలేము. (8)

కన్నసంతతికెప్పుడు మిన్నఫణితి
మంచి జరగంగగోరుట మహితులకును
జెల్లు నంతియెగానిట్లు జిత్రముగను
కన్నవారిట్లు జేయుట గలదెయెందు? (9)

పిల్లపెండ్లిజేసి పీడవదలెనంచు
చేయుదులుపుకొనుట నాయమగున?
కూర్మికూతువృద్ది గోరగ లేనట్టి
వారి జన్మమేల? వసుధలోన. (10)

నలువురు బాధలుడుల్చగ
దెలివిగనా నారదుండు దిట్ట తనిడ, నా
సలహామేరకు నిన్నిల
బలిపశువును జేసినారు పంకజనేత్రి! (11)

ఎవరికి వారు వారి వగునిక్కటు తెల్లను రూపుమాపగా
నవనినినెంచుచుంగరమునమ్మరో నీకునుమేలు గోరకే
దివిజులకందనీకనిను దిట్ట తనాన మునీంద్రుకిచ్చియున్
భవితయునాకనీ బ్రదుకుబండలు జేసిరె, మానినీమణి. (12)

ఏమిది తల్లి నీ బ్రదుకునిట్టుల నయ్యెను నిర్వికారవై
కోమలమైన రూపు ముని క్రుద్ధత జేతగృశించిపోయి, యి
భ్బూమిన చేతనంబుగను బ్రోషిత భర్తృకవౌచునుంటివే
రాముని రాకకోసమయి రాతియనంగను యేండ్లు బూండ్లునున్. (13)

నీదు మనసులోని నిర్మలమౌ కోర్కె
నరయకుండ మౌనివరుని తోడ
బెండ్లి జరిపినట్టి పెద్దల భావముల్
గౌరవించి పోతి కాపురముకు. (14)

కామము హెచ్చగా గరము గౌరవభావము జచ్చిపోవగా
నీ మమొకింతలేక యును నీతిని రీతినివీడి వజ్రియున్
తామరసాక్షి! యాశ్రమముదాపునగోడిగ గూతగూసి యున్
ఆ ముని లేని పట్లనిను నమ్మరా కూడెగ గౌతమమర్షిగా. (15)

భర్తయే యంచునెంచుచు బరవశమున
వసుధనాతనిగూడిన భాగ్యమునకు
కాపురము గూలిపోయెనా? కంబుకంఠి
విధియె వక్రింపనెదురీద వీలుగలదె? (16)

పతినేదైవంబుగా నెంచి భక్తిగొలుచు
పరమపావిత్ర్యమూర్తివి భర్తకోర్కె
దీర్చుటే ధర్మమనుకొని దీనవైతి
దివిజనాధుని చేష్టతో నవనియందు. (17)

నీదుతప్పేమిలేకున్ననిక్కముగను
శాపమిచ్చియు శిక్షించె సంయమీంద్ర
డాగ్రహంబున నిన్ను నోయంబుజాక్షి!
అబలయని నంతనలు సాయెనవని ప్రజకు. (18)

ఇంద్రజాలంపుమహిమకో చంద్రవదన
ఏమిజరుగుచునుండెనో యెరుగరాని
స్థితికిగురియైననీపైన చెడునువేసి
నిందజేయుటలోగలనీతదేమి? (19)

అంత మాత్రనె బోకనీయవనిలోని
అధికజనులును కవులును నధిపులెల్ల
నీకు నీవుగ కోర్కెతో నీరజాక్షి
వజ్రిగూడిత వంచును పలుకుటేమి? (20)

మౌని భార్యవయ్యుమహనీయమైనట్టి
తపసివేషమీవుదాల్చియుండి
మంచి సంతుగన్నమాతృమూర్తిని నిన్ను
చెడినదానవంచు చెప్పుటేమి? (21)

నిన్ను చేతన రహితగా సన్నుతాంగి
శాపమిచ్చిన యామౌని శక్రునపుడు
ధాత్రివే గన్నులంగూడి తనరుమనుట
దేవరాజునకది గొప్ప దీవెన కద. (22)

అధిపునకునొక్కనీతియునల్పులకును
నొక్కనీతియువిలసిల్లదీక్కునమ్మ
ధర్మమెప్పుడుసమరీతిధాత్రిప్రజకు
నెంతమాత్రంబు నేనియునెంచిచూడ.(23)

రాజు తప్పుజేసి రాజిల్లెధాత్రిలో
పడతి దోషికాక బాధనందె
ఏమి ధర్మమిద్ది? యేమినాయంచిది?
ఇంత పక్షపాతమెందుగలదె? (24)

పూర్వకాలము నుండి యపూర్వ రీతి
సాగుచుండిన ఘోరమౌయాగమిద్ది
దానికావబతియైనట్టిదీనవనిత
లెందరెందరోభువిలోననెఱుగలేము. (25)

నీనతనుబాపదిట్టయౌ దివిజవరుడె
కామమోహితుడౌచునిన్గవయనెంచి
నిన్ను దీనగజేసేనోనీరజాక్షి!
కంచెయేచేను మేసిన గలదెదిక్కు. (26)

మంచి మంచి యంచు వంచన బడుటేన
మహినిబరగునట్టి మగువలెల్ల
ఎంత కాలమిట్లునిక్కట్లు బొందుట
దీనినడ్డగించు దిట్టలేడ? (27)

నిన్ను శపియించుటేగాక సన్నుతాంగి
సంయమీంద్రడు శపియించే నింద్రుగూడ
అంచు చెప్పుట నగునుగానక్కజంబు
అతడు వేగళ్లదీప్తితో నలరుచుండ
చలనరహితగనీవట్లునిలువలేదా? (28)

దెబ్బకుదెబ్బతీయగను దీవతమాన్పగభూతలంబునన్
బొబ్బలు వెట్టుచుంగరము బుష్టిని గూర్చక సుందరాంగులున్
బెబ్బులు తాచు బౌరుషము బేర్వడ జూపకనాడు జాతికిన్
నిబ్బరమబ్బునమ్మ? మహనీయతనిల్చునటమ్మమానినీ? (29)

అంచు భావించు నీలోకమమనియందు
సానుభూతిని నీపైని జక్కజూపి
నీదుకష్టాలుగనలేకనిక్కముగను
మహిని విధి వ్రాతమార్చగమనదు వశమే! (30)

అందగతై వోలెనలరారునట్లుగ
పరగసృజనజేసిప్రాణమిడిన
నలువ తనకు దానె తెలియనిస్థితిలోన
వ్రాసె ‘విధి’గ నీదు ఫాలమందు. (31)

వేధకుంగూతువైగూడ వింతరీతి
బాధలందిన తీరును బట్టిచూడ
వసుధ విధి వ్రాత మార్చగ వశమదౌన?
ఎంత వారలకైనను నెవరికైన. (32)

ఏమాయెను పతిభక్తియు
ఏమాయె బతివ్రతాత్వమిప్పట్టున, దా
రేమాయే బంచభూతము
లేమాత్రమురక్షనిడెనెయెంచుగదల్లీ. (33)

నీది తప్పిదమైనచో నిర్మలాంగి
అరయరాముండు నీగాధకరుణవినున?
చేతనత్వము నీకిచ్చి చెలువమిడున?
ఇలను నీపేరుసాధ్విగా బిలువబడున? (34)

దైవకార్యం బదేమియో ధాత్రియందు
సలుపదలపెట్టి ధర్మమున్ నిలుపనెంచు
సురలు జేసెడి చర్యకొ సుందరాంగి
నిన్ను బాధకు గురిజేయనెంచిరేమో? (35)

ఏదోదేవరహస్యము
ఏదోనొకటియుదాగి నిచ్చటనుండెన్
నీదౌచరితము, తల్లీ
ఆ దేవుని లీలటంచు ననగనుజెల్లున్. (36)

కొందరమాయకస్థితిని, కొందరు మాయకులోనునౌచునున్
కొందరు జ్ఞానశూన్యతను, కుందెడుడెందము లొప్పకాందరున్
కొందరు సానుభూతిగను, కొందరెరుంగకదైవతత్త్వమున్
ఎందరో సుందరాంగులిటు హెచ్చుగబల్కగజొచ్చిరెంతయున్. (37)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here