నీలగిరుల యాత్రానుభవాలు -3

0
10

[box type=’note’ fontsize=’16’] వేసవిని గడపడానికి దక్షిణ భారతదేశంలో ‘కోటగిరి’ ఉత్తమమైన ప్రాంతమని తెలుసుకుని నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

బెరగని కెట్టి

[dropcap]నీ[/dropcap]లగిరి జిల్లావ్యాప్తంగా 400 హట్టి /గ్రామాల్లో బడుగ ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారుట. వారి గ్రామాలను ‘హట్టి’లుగా పిలుస్తారు. వారి వ్యావహారిక భాష బడుగ. దానికి లిపి లేదుట. కన్నడకి దగ్గరగా ఉంటుందిట. బడుగ మహిళల పారంపర్య వస్త్రధారణ తెల్లని రంగుతో ఉన్నది. పై వస్త్రం.

వారి తెగలోనే వివాహాలు చేసుకుంటారు. తెగ వెలుపల వివాహం నిషిద్ధం. వారికి వారి పురాతన వివాహ పద్ధతులున్నాయి.

వారి ముఖ్య పండుగ దేవ్వ హబ్బ. ఈ పండుగ బాడుగ తెగ వారి మూలలను తెలుసుకునే అవకాశం ఇస్తుందిట. ఈ తెగవారు పుట్టుక, నామకరణం, ప్యూబర్టీ, పెళ్లి, శ్రీమంతం, గృహప్రవేశం, మరణం వాటి వాటికి ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తారుట. పాటించాలిట.

బడుగ తెగకు చెందిన వారు ఎందరో విద్యావంతులు. అనేక ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ, సొంతవ్యాపారాల్లో ఉన్నారట.

తొలి మహిళా బడుగు విద్యావంతురాలు, నీలగిరి ఎంపి అయిన శ్రీమతి అక్కమ్మ దేవి. అలాగే తోలి మహిళా గెజిటెడ్ ఆఫీసర్ బెల్లి లక్ష్మి రామకృష్ణన్‌ట.

చాల కాలంగా బడుగ తెగ తమను తిరిగి ఎస్‌టిలుగా పరిగణించాలని ఉద్యమిస్తున్నారుట. బ్రిటిష్ హయాంలో 1931 వరకు, తరువాత 1951 వరకు ఎస్‍టిలుగా ఉండి స్టేటస్ కోల్పోయారుట.

బడుగు గ్రామాలు నాక్కుబెట్ట అనబడే నీలగిరి చుటూ ఉంటాయట. నక్కు అంటే 4, బెట్ట అంటే పర్వతం. నాలుగు పర్వతాల మధ్యలో అన్నమాట.

హితై హబ్బా వారి ఆరాధ్య దేవత. హితై అమ్మ పండగ వారి ముఖ్య పండుగ. వారి మహిళల నగలు అందమైన పెద్ద ముక్కెర, మూకుట్టి. కమ్మలు చిన్న అంటారట. చిన్న అంటే స్మాల్ కాదు బంగారం.

బెల్లి ఉంగరం వెండి ఉంగరం ధరించటం వాళ్ళకి ఆరోగ్యం అని నమ్మిక.

వారి ఆచారాలు చాలావరకు నిరాడంబరంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయి. శతాబ్దాలుగా మార్పులేదుట.

మే 15 ప్రతి వత్సరం బడుగ దినం గా జరుపుకుంటారుట.

వారి ముఖ్య పంటలు కూరగాయలు. అన్ని రకాల ఇంగ్లీష్ కూరలు, టీ పండిస్తారు.

ఊటీ చుట్టూ ప్రక్కల సాధారణ టూర్ ఆపరేటర్స్ చూపించే ప్రదేశాలు కావివి. మా 25 రోజుల స్టే లో మేమీ ప్రాంతమంతా తిరిగి చూసాము.

మేము బడుగ తెగ ప్రజలను కలిసాము. వారి ఆత్మీయ ఆతిథ్యాన్ని పొందాము. వారి ఇండ్లు ఉండే చోటికి బైటవారిని రానివ్వరు. మేము ఊరి మొదట్లో ఉన్న ప్రాథమిక పాఠశాల వద్ద ఊరి వారిని కలిసాము.

       

రమేష్, ఇతరులు చక్కని ఇంగ్లిష్ మాట్లాడారు. వాటి తాటిబెల్లం, అల్లం కలిపిన లోకల్ తేనీరుని పాలు లేకుండా వేడిగా అప్పటికి అప్పుడు చేసి ఇచ్చారు. గ్రామపెద్ద మహిళను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాము. గ్రామపెద్ద మహిళను కలవటం వారు అదృష్టంగా పరిగణిస్తారని తరువాత తెలిసింది.

వేసవి విద్యా శిబిరంలో చేతి వ్రాత, డ్రాయింగ్ క్లాసులు అటెండ్ అవుతున్న పిల్లలను, వారి టీచర్‌ని కలిసి ముచ్చటించాను. పిల్లలు చాల చురుకుగా హమ్ కిసీసే కమ్ నహీ! అన్నట్లున్నారు. నేను  టీచర్, కథకురాలు కావటం వల్ల పిల్లలు కనిపిస్తే పరుగెత్తి పలకరించడం నా బలం/బలహీనత.

వారి పాఠశాలను రంగులతో బొమ్మలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఊరివారు.

పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన గ్రామం. అన్ని అధునాతన వసతులు ఉన్నాయి. బస్సు సౌకర్యం ఉంది. చక్కని రోడ్లు. ఎత్తైన వృక్షాలు, కూరల స్టెప్ ఫార్మింగ్, టీ తోటలు. చల్లని నల్లని వాన మబ్బులు.

నీలగిరికి ఆ పేరు ఆ పర్వతాలు దూరం నుండి నీలంగా కనిపించటం వల్ల వచ్చిందిట. అది నిజం. మేము ఫీల్ అయ్యాము.

నిదానంగా స్థానిక ప్రజలతో కలిసి మెలిసి తిరిగే యాత్ర ఇచ్చే అనుభూతి వేరు. 2-5 రోజుల ట్రిప్స్‌లో దొరకదు… మనకు తెలీని మరో జీవన విధానం అది. ప్రకృతి ఆరాధన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here