నీలగిరుల యాత్రానుభవాలు-6

0
10

[box type=’note’ fontsize=’16’] నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

బడుగ చరిత్ర:

[dropcap]బ[/dropcap]డుగ గ్రామం లోని వారిని కలిసి మాట్లాడితే వారి చరిత్ర గురించిన అనేక విషయాలు తెలిసాయి. ప్రపంచంలో ప్రతి ప్రదేశానికి, ప్రజలకు ఏదో ఒక చిన్నదో పెద్దదో కథ చరిత్ర ఉండే ఉంటుంది. తెలుసుకోవాలనే కోరిక ఉండాలి అంతే. నా ఉద్దేశంలో తెలుసుకోవాలి. చెప్పాలి. లేదంటే క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో చరిత్రని వక్రీకరించవచ్చు.

నవతరం యువతకు తమ మూలాలు చరిత్ర సరిగ్గా తెలిపే అవకాశం వస్తే ఎంత మాత్రం వదలొద్దు. బడుగ తెగ గురించిన నాకు తెలిసిన కొన్ని విషయాలు క్లుప్తంగా వివరిస్తాను.

క్రీస్తుకు ముందే బడుగ తెగవారు వేల వేల సంవత్సరాల క్రితం నీలగిరిలో నివసించారు. వారు 5000 BC నుండి నీలగిరిలో నివసిస్తున్నారు.

సింధు నాగరికత (3300 BC) మరియు నీలగిరి మధ్య విలువైన రాతి వ్యాపారం జరిగింది. మొహంజొదారో మరియు హరప్పా వద్ద, ‘అందమైన ఆకుపచ్చ అమెజాన్ రాయి నీలగిరిలోని దొడ్డబెట్ట సమీపంలో కనుగొనబడింది’ అని ఉందట. బహుశా దొడ్డబెట్ట అంటే పెద్ద గుట్ట బడుగ పదాల నుండి వచ్చిందేమో?

మౌర్యుల కాలంలో (321 BC – 184 AD) బౌద్ధ సన్యాసులు నీలగిరిలోని బడుగలలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి నీలగిరిలోకి వచ్చారన్నారు. అక్కడ బడుగలలో చెట్టు ఆరాధన అనేది ఉంది. బహుశా వారు ప్రకృతి ప్రేమికులు, conservators. కదంబ (2AD – 6AD) రాజ్య కాలంలో, నీలగిరిలోని బడుగల నుండి భూమి రాబడి మరియు ఇతర పన్నులు వసూలు చేశారుట. ఆహార ధాన్యాలను ‘కోలగా’ మరియు ’20 కోలగా’, ఒక ‘కందుగ’తో కొలుస్తారు, బడుగలో ‘కోలగా’, ‘కోగ’. ఇప్పటికీ కోగ అనే పదాన్ని బడుగ ప్రజలు ఉపయోగిస్తారట.

క్రీ.శ.1116లో కాలరాజు అనే బడుగ రాజు నీలగిరిని పరిపాలించాడు. కర్నాటకలోని హొయసల రాజ్యానికి చెందిన విష్ణువర్దనుడు నీలగిరిపై దండెత్తిన మొదటి రాజు, తన సైన్యాన్ని పంపి, బడుగలను బెదిరించేందుకు ప్రయత్నించాడు, తనకి కట్టుబడి ఉండమని ఆదేశించాడు.

ధైర్యశాలైన బడుగ రాజు, కాలరాజు అతని ఆజ్ఞను నిరాకరించి అతనితో పోరాడాడు. అతని రెండవ దండయాత్రలో, హోయసల సైన్యం కాలరాజు కుమారుడిని చంపింది, అతని కుమారుడు మరణించినప్పటికీ, కాలరాజు విష్ణువర్ధనునికి లొంగి పోవటానికి ఒప్పుకోలేదు. మూడవ దండయాత్రలో, కాలరాజును హొయసలరాజు చంపాడు.

కోయంబత్తూరు మాన్యువల్ (1898) రచయిత నికల్సన్ ప్రకారం, దండనాయకకోట్టై 1338లో నీలగిరి మరియు వైనాడ్‌లను పాలిస్తున్న మాడప్ప దండనాయకచే నిర్మించబడింది. అతని తరువాత అతని కుమారుడు కేతయ దండనాయకుడు 1321లో మరియు సింగయ దండనాయకుడు 1338లో పాలించారు. వారు నీలగిరిని అణచివేసేవారు.

తరువాత 13వ శతాబ్దంలో, హొయసల రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యము ఓడించింది, కాబట్టి నీలగిరి విజయనగర సామ్రాజ్యం కిందకు వచ్చింది.

విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత నీలగిరి సుల్తాన్ పాలనలోకి వచ్చింది. తరువాత దండనాయకకోటలోని దండనాయకులు మధురై నాయకులపై ఆధారపడి ఉన్నారు. హైదర్ అలీ దండనాయకకోటలో రాజు వీరపాండ్య దేవన్‌పై దాడి చేసి దండనాయకకోటను స్వాధీనం చేసుకున్నాడు. శాసనాలలో నీలగిరి సదరన్ కోటే (నీలగిరిని జయించిన కోట) గురించి ప్రస్తావించబడింది. నీలగిరితో పాటు దండనాయకకోట గ్రామాలు ఒడువంగనాడు అని పిలువబడ్డాయి. హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ పాలన.

తరువాత 1799లో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్‌ను ఓడించి నీలగిరిని స్వాధీనం చేసుకున్నారు కానీ 1818 వరకు వారికి పర్వత ప్రాంతాలు తెలియవు, అయినప్పటికీ దండనాయకకోటే నుండి పన్ను వసూలు చేసారు.

అప్పటి వరకు నీలగిరి మైసూర్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. టిప్పు సుల్తాన్‌ను ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు నీలగిరిని మద్రాసు ప్రావిన్స్‌లో విలీనం చేశారు. స్వాతంత్ర్యం తరువాత, నీలగిరి శాశ్వతంగా తమిళనాడులో విలీనం చేయబడింది.

తరువాత 1819లో, జాన్ సుల్లివన్ కోయంబత్తూరు నుండి నీలగిర్స్‌కు ముత్తయ్య గౌడ్ అనే బడుగ పెద్ద సహాయంతో వచ్చాడు. అతను మొదట కోటగిరి, తరువాత ఊటకాముండ్ చేరుకున్నాడు. కోటగిరి సమీపంలోని మిలిదానే గ్రామంలో సుల్లివన్‌కు మార్గనిర్దేశం చేసిన ముత్యాల గౌడ్ గురించిన శాసనం ఇప్పటికీ ఉంది.

బడుగ ప్రజలు తమ నివాస స్థలాన్ని పోరంగడు సీమ, తోటనాడు (తోటనాడు తోత్తనాడుగా మారింది) సీమ, మెర్కునాడు సీమ్, కుండే సీమ అని నాలుగు వర్గాలుగా విభజించారు, ఇక్కడ దాదాపు 303 గ్రామాలు ఈ నాలుగు సీమ్‌ల పరిధిలోకి వస్తాయి. సంఘంలో బడుగర్, కనకర్, హరువర్, అతికారి అనే నాలుగు వంశాలు ఉన్నాయి. బడులకు కోలాలు లేవు.

బ్రిటీషర్లు మరియు ఇతర కమ్యూనిటీ ప్రజలు నీలగిరికి రాకముందు ‘బడుగు’ అని పిలువబడే బడుగ గిరిజన భాష బడుగలు మరియు ఇతర గిరిజన ప్రజల మధ్య సంప్రదింపు భాష.

బడుగ కమ్యూనిటీపై అనేక పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచ్ భాషా శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన పరిశోధన చేశారు. బడుగలు నీలగిరిలోని ఆదిమ తెగలని, వారు ఏ భాషా మాండలికం కాదని, ప్రత్యేకమైన భాష మాట్లాడతారని అన్నారుట.

బడుగలు శివునితో సహా అనేక హిందూ దేవతలను పూజిస్తారు, అయితే వారి ప్రధాన దేవతలు హెతై మరియు అయ్య. వారు ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరి మధ్య ఒక నెల పాటు గొప్ప పద్ధతిలో హేతై హబ్బాను జరుపుకుంటారు. ఈ ఆదివాసీ తెగలో అధికులు విద్యావంతులు. మేము అనేక మందిని కలిసాము.

***

ఊటీ:

నీలగిరుల్లో ప్రముఖమైనది ఊటీ. జిల్లా ముఖ్య కేంద్రం. అందమైన ప్రదేశం. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే సుందర ప్రదేశం. మేము గత 9-10 సంవత్సరాలుగా ఈ ఊరితో ప్రేమలో పడ్డాము. అందువల్లనే కాబోలు దీని గురించి అన్ని తెలుసుకోవాలని అనుకుంటాము.

మేము గత 5 ఏళ్ళుగా వస్తూ పోతూ నీలగిరుల గురించి స్థానికులని, ఇక్కడే ఉంటున్న మిత్రులని అడిగి తెలుసుకుంటున్నాము. కొంత గూగులమ్మ సాయం ఉండనే ఉంది. అదృష్టవశాత్తు మావారు నాగార్జునకి తమిళం బాగా రావటంతో మాకు సులువుగా ఉంది.

ఊటీ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలు చెప్తాను.

ఊటీని అధికారికంగా ఉదగమండలం అని పిలుస్తారు, దీనిని ఊటకముండ్ అని, ఉదగై అని కూడా అంటారు. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉన్న ఒక నగర మునిసిపాలిటీ. ప్రేమగా ‘క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్’ అని పిలుస్తారు. ఇది మద్రాసు ప్రెసిడెన్సీకి వేసవి రాజధాని బ్రిటిష్ కాలంలో.

నిజానికి తోడా ప్రజల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం 18వ శతాబ్దం చివరలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. ఔషధాల తయారీ, ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్‌ INDU తో పాటు పర్యాటకం మరియు వ్యవసాయం ముఖ్యమైనవి. ఈ పట్టణం నీలగిరి ఘాట్ రోడ్లు మరియు నీలగిరి మౌంటైన్ రైల్వే ద్వారా కనెక్ట్ అయి ఉంది. దీని సహజ వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఒక ప్రసిద్ధ వేసవి విడిది.

ఊటీ పేరు ఎలా వచ్చిందో అస్పష్టంగా ఉంది. మద్రాస్ గెజిట్‌ మార్చి 1821 నాటి ఉత్తరంలో ఈ ప్రదేశం గురించి మొట్టమొదటిగా తెలిసిన written note వోటోకిమండ్ అని. దీనిని ఒట్టకల్ మండు అని పిలిచేవారు. బ్రిటీష్ పాలనలో ఈ పేరు బహుశా ఉదగమండలం నుండి ఊటకమండ్‌గా మార్చబడి తరువాత ఊటీగా అయిందేమో?

పేరులోని మొదటి భాగం (ఊటాకా) ఓథా-కాల్ అంటే ‘ఒకే రాయి’. ఇది బహుశా స్థానిక తోడా ప్రజలు గౌరవించే పవిత్రమైన రాయికి సూచన. బహుశా తెలంగాణ గ్రామాల్లో కనబడే బొడ్రాయి లాంటిది కావచ్చు. ఇది నా ఊహ మాత్రమే. ఊటీ నీలగిరి కొండలలో ఉంది, అంటే ‘నీలి పర్వతాలు’ అని అర్థం. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వికసించే నీలి కురుంజి పువ్వు కారణంగా ఈ పేరు వచ్చింది. ఆ పూలు విచ్చుకునే జులై – అక్టోబర్ సమయంలో టూరిస్టులు ఎక్కువట. వాటి గురించి తరువాత చెబుతాను.

ఉదగమండలం మొదట్లో తమిళ, తోడ, కోట, ఇరుల మరియు కురుంబలచే ఆక్రమించబడిన గిరిజన భూమి.

1117 CE నాటి హోయసల రాజు విష్ణువర్ధన మరియు అతని సేనాధిపతి పునిసాకు చెందిన రికార్డులో నీలగిరిలోని తోడా మొదటిగా ప్రస్తావించబడింది. తోడా ప్రజలు నీటి గేదెలను పెంచడంలో ప్రసిద్ధి చెందారు. వ్యవసాయ పనులకు ప్రసిద్ధి చెందిన ప్రజలు. నీలగిరిని శాతవాహనులు, గంగులు, కదంబులు, రాష్ట్రకూటులు, హోయసలులు, విజయనగర సామ్రాజ్యం మరియు ఉమ్మత్తూరు రాజులు (మైసూరు వడయార్‌ల తరపున) వంటి వివిధ రాజవంశాలు పాలించాయి. టిప్పు సుల్తాన్ పద్దెనిమిదవ శతాబ్దంలో నీలగిరిని స్వాధీనం చేసుకుని, ఒక రహస్య గుహలాంటి నిర్మాణాన్ని నిర్మించడం ద్వారా సరిహద్దును విస్తరించాడు. 1799లో శ్రీరంగపట్నం ఒప్పందం ద్వారా టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉన్న సీడెడ్ భూములలో భాగంగా నీలగిరి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చింది.

ప్రసిద్ధ వేసవి విడిదిగా బ్రిటిష్ అధికారులు దీనిని సందర్శించారు. కోలుకోవడానికి సైనికులు సమీపంలోని వెల్లింగ్టన్‌కు పంపబడ్డారు. వెల్లింగ్టన్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క మద్రాస్ రెజిమెంట్ యొక్క నిలయం. స్వాతంత్ర్యం తరువాత, ఇది ఒక ప్రసిద్ధ హిల్ రిసార్ట్‌గా అయింది.

ఊటీ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో ఉంది. ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి అనేక అటవీ ప్రాంతాలు మరియు నీటి వనరులు చాలా మంది సందర్శకులకు నిషేధించబడ్డాయిట.

ఇది సముద్ర మట్టానికి 2,240 మీటర్లు (7,350 అడుగులు) ఎత్తులో ఉంది. ఊటీలో వాతావరణం ఏడాది పొడవునా వసంతకాలంలా ఉంటుంది. అయితే, జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో రాత్రి సమయం సాధారణంగా చల్లగా ఉంటుంది. ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి; సగటు అధిక ఉష్ణోగ్రతలు దాదాపు 17–20°C వరకు ఉంటాయి. సగటు తక్కువ సుమారుగా 2–12 °C మధ్య ఉంటాయి.

వేసవిలో వచ్చి వెళ్లే ప్రతి సారి తిరిగి ఒక శీతాకాలంలో వచ్చి చలి గిలిగింతలని ఆస్వాదించాలనే మా కోరిక తీరటం లేదు. దట్టమైన పొగ మంచు దుప్పటి లో కప్పబడి ఉండే నీలగిరుల అందమే అందం.

రావాలి ఒక్కసారైనా. 2022 లో మాకు అద్భుతమైన అనుభూతి కలిగింది. దట్టమైన మంచు దుప్పటి కప్పుకుంటున్న పరిసరాలు, కొండలు కోనలు రోడ్లు చూసాము. ముంచు పొరల్లోంచి, మబ్బు తెరల్లోంచి నడుస్తుంటే ఏదో తెలీని అనుభూతి. మేఘాలలో తేలిపోతుంది అనే సాంగ్ గుర్తుకువచ్చింది. అలాగే మే 11- నుండి నిరంతరంగా పడుతున్న వానలు, అందువల్ల ఏర్పడిన చిన్ని జలపాతాలు కనువిందు చేసాయి.

ఇక్కడ అందరికి తెలిసిన ప్రదేశాల్లో గవర్నమెంట్ రోజ్ గార్డెన్ (గతంలో సెంటెనరీ రోజ్ పార్క్) భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట. ఇది ఊటీ పట్టణంలోని విజయనగరంలో ఎల్క్ కొండ వాలుపై ఉంది 2,200 మీటర్ల (7,200 అడుగులు) ఎత్తులో ఉందిట.

బొటానికల్ గార్డెన్ పైన ఉన్న కొండలపై కొన్ని తోడా గుడిసెలు ఉన్నాయి, ఇక్కడ తోడాస్ ఇప్పటికీ నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇతర తోడా స్థావరాలు ఉన్నాయి, ముఖ్యంగా పాత ఊటీకి సమీపంలోని కండల్ ముండ్

నీలగిరి మౌంటైన్ రైల్వేను 1908లో బ్రిటిష్ వారు నిర్మించారు, దీనిని మొదట మద్రాసు రైల్వే కంపెనీ నిర్వహించింది. రైల్వే ఇప్పటికీ స్టీమ్ లోకోమోటివ్‌లపై నడుపుతోందిట. ఇన్ని సార్లు వచ్చినా మాకు అది ఎక్కే అవకాశం రాలేదు. సిమ్లాలో ఎక్కాము.

ఊటీ టీ ఫ్యాక్టరీ ఊటీ పట్టణానికి ఉంది. వివిధ రకాల టీ ఆకుల origin మరియు భారతదేశంలోని టీ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు.

ఇదండీ ప్రస్తుతానికి ఊటీ గురించి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here