నీలగిరుల యత్రానుభవాలు-1

0
11

[box type=’note’ fontsize=’16’] వేసవిని గడపడానికి దక్షిణ భారతదేశంలో ‘కోటగిరి’ ఉత్తమమైన ప్రాంతమని తెలుసుకుని నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పటిలాగే వేసవి సెలవులకు ఎక్కడికి వెళ్లాలని ఆలోచించాము. మా ఇద్దరికీ మహా ఇష్టమైన ప్రదేశం మనాలి, బియాస్ నది. ఎప్పటిలా అక్కడికే వెళ్లాలని 15 మైల్ దగ్గరున్న ‘నల్వా హోమ్ స్టే’తో మాట్లాడి రూమ్ విత్ కిచెన్ బుక్ చేసాము. ఢిల్లీకి ప్రయాణ ఏర్పాట్లు చేసాము. కానీ ఇంతలో మా మేనకోడలు పెళ్లి మే నెలలో ఫిక్స్ అయ్యింది. అందువల్ల మా ప్రయాణంలో తప్పని మార్పు.

అందువల్ల ఎండాకాలం వేడిని తప్పించుకోవటానికి సౌత్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ వెతికాను. కర్ణాటకలోని చిక్‌మంగళూర్ అనుకుని అక్కడ హోటల్స్‌తో మాట్లాడాము, ఒక నెలకి రూమ్ కావాలని. కానీ అక్కడ ఎండలు మేము ఊహించినంత తక్కువ ఉండవని, ఉక్కగా ఉంటుందని తెలిసి వద్దనుకున్నాము. మాకు టెంపరేచర్ 26 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల కావాలి.

మళ్ళీ వెతుకులాట! ఒక కామన్ ఫ్రెండ్ సలహా ప్రకారం కోటగిరి దగ్గర ఆగాము. అక్కడ ఉంటున్న ఫ్రెండ్‌ని వాతావరణం, వేడి గురించి తరచి తరచి అడిగి తెలుసుకున్నాము. ముందుగా కోటగిరి ఎక్కడ? అని మ్యాప్‌లలో వెతికాము. ఊటీకి 29 కి.మీ. దూరంలో వయా మెట్టుపాళయం నుండి కోయంబత్తూర్ మార్గంలో ఉందని తెలిసింది.

తరువాత ఒక నెల ఉండటానికి మా స్పెసిఫికేషన్స్‌కి అనుగుణంగా హోటల్స్‌ని వెతికే పని. అక్కడున్న స్నేహితుడు ఒక బస గురించి చెప్పి మాట్లాడి పెడతానన్నారు. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలిగా. అందుకని వెతకటం మొదలుపెట్టాము.

మాకు ఒక రూమ్ విత్ కిచెన్ కావాలి. మాకు నచ్చిన సాధారణ ఆహారం మేమే వండుకోవాలని. బయటి ఫుడ్ తినమని కాదు, నెలరోజులు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, సిటీకి దూరంగా ఉంటూ, తిరుగుతూ ఇఫ్ వి వాంట్, కొత్తకాపురంలోలా లిమిటెడ్ సామానుతో వండుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండాలని. తెల్లవారు ఝామున వేడి కాఫీ సిప్ చేస్తూ హోటల్ వరండా లోంచి సూర్యోదయం మైమరచి చూస్తూ, పచ్చని ప్రకృతిలోని రంగులను ఆస్వాదిస్తూ, పిట్టలు, నెమళ్ళు కనిపిస్తే ఆనందపడుతూ ఉండటం ఒక బ్లిస్.

మాకు దక్కిన అదృష్టం. సో అలాంటి పరిసరాలను వెతుకుతూ ఆన్‌లైన్‌లో 4 హోటల్స్‌‍ని సెలెక్ట్ చేసాము. వారితో మాట్లాడితే అది రెంటికి వచ్చింది. అందులో ఒక హోటల్ మా ఆలోచనకి సరిపోతుందనిపించింది. వారితో మాట్లాడి నెలరోజుల వసతికి బేరం చేసి సుమారుగా డేట్స్ ఫిక్స్ చేసాము.

వేసవి విడిది ప్రదేశం దాదాపుగా ఫైనల్ అయ్యాక, ఎలా వెళ్ళాలి?

విమానం కోయంబత్తూర్ వరకు ఉంది. రైలు అక్కడ వరకే. బస్సు అయితే బెంగుళూరు నుండి కోటగిరి వరకు. మరి లోకల్‌గా తిరగాలంటే? లోకల్‌గా బస్సులు, టాక్సీలు ఉంటాయి. కానీ మేము మా కొత్త కార్‌లో హైదరాబాద్ నుండి బెంగుళూరు మీదుగా కోటగిరి వెళ్లాలని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ రోడ్ మ్యాప్ తయారు చేసే పనిని సోషల్ టీచర్ అయినందున నాకు అప్పగించారు.

ఇంతలో మా వారు మా చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్స్‌కి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు మరో ఇద్దరు మాతో రావచ్చని. విన్నవారు “wow! వాట్ యాన్ ఐడియా సర్ జీ!” అన్నారు. మేము మా ఏర్పాట్లలో మేమున్నాము.

ట్రిప్ నార్త్ నుండి సౌత్‌కి మారటంతో ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి వచ్చి పెళ్ళికి ఒక్కరోజు ముందు, అదే రాత్రి విజయవాడకి వెళ్లి మర్నాడు పెళ్లి చూసుకుని ఆతిథ్యం పొంది రాత్రి బయలుదేరి హైదరాబాద్ వచ్చి, 3 రోజులు ఇతర పనులు అంటే ప్రయాణానికి కారు రెడీ చెయ్యటం; అవకాయల సీజన్ మేము తిరిగి వచ్చేలోపల ముగిసిపోతుంది, అందుకని ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి పెట్టుకుని, ఇతర ఏర్పాట్లు చేసుకోవటం మా ప్లాన్.

మేము 3 వారాలకు ఢిల్లీ వెళ్ళే లోపులే మాతో వచ్చేవారు చెప్పాలన్నాము. మా తమ్ముడు, మరదలు వస్తామన్నారు. సో ఇంకో అదనపు రూమ్ బుక్ చెయ్యాలి. ఈ లోపుల మావారు స్వయంగా కోటగిరి వెళ్లి వారి స్నేహితుడు చెప్పిన వసతి మరియు మేము సెలెక్ట్ చేసిన రెండు హోటల్స్ చూసి బుక్ చేసి వస్తానన్నారు. గుడ్ అనుకున్నాము. అనుకున్న ప్రకారం కోటగిరి వెళ్లి చూసి మేము కోరుకున్న విధంగా ఉన్న ఒక హోటల్‌ని బుక్ చేసారు. రూమ్ ఫొటోస్ నెట్టింట్లో ఉన్నా, మళ్ళీ తీసి పంపారు. హోటల్ యజమాని చాలా స్నేహపూరితంగా ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో కార్నర్ రూమ్స్, మంచి వ్యూ ఉన్నవి సెలెక్ట్ చేసారు. సో ప్రయాణానికి అవసరమైన ముఖ్య ఘట్టం మొదలైనది. వసతి.

హోటల్ పేరు The Valley Villa Guest House, Kotagiri.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here