నీరజ్ గీతాలలో రహస్యవాదం – మార్మికత

0
13

[ఆధారం నీరజ్ విశేషాంక్ 2, 2011, భోపాల్, కాన్పూర్, పహాలా అంతరా, ఇంకా మరికొన్ని విశేషాంకాలతో ప్రచురితమైన ఆర్టికల్.]

[dropcap]శ్రీ [/dropcap]గోపాల్ ‘నీరజ్’ గారి వ్యక్తిత్వం కృతిత్వంలో ఒక వైపు నదిలోని గలగల ప్రవాహం ఉంటే మరొక వైపు జ్వాలాముఖి కూడా ఉంది, ఒక వైపు మట్టి సాంధీగంధం ఉంటే మరొకవైపు భూకంపం కూడా ఉంది, ఒక వైపు పర్వతాల మహాశక్తి ఉంటే మరొకవైపు గాలి దుమారాలు, తుఫానులు కూడా ఉన్నాయి. ఒక వైపు భావుకమైన మనస్సు ఉంటే మరొక వైపు విప్లవం తేగల మేధాశక్తి కూడా ఉంది. భోగి మనస్తత్వం ఉంది. మరొక వైపు యోగి కుండే మనస్సూ ఉంది. ఈ మహాకవిలో ఉన్న విరోధాభాసం ఈ గీతాల చరణాలలో వ్యక్తం అవుతోంది.

మై పంథీ తుఫానోం మే రాహ్ బనాతా

మేరా దునియా సే కేవల్ ఇతనా నాతా

వహ్ ముఝే రోకతీహై అవరోధ్ బిఛాకర్

మై ఠోకర్ ఉసే లగాకర్ బఢ్ తా జతా

(నేను గాలి దుమారాలు – తుఫానుల మధ్య బాట వేస్తూ

సాగిపోతున్న బాటసారిని,

నాకూ ప్రపంచానికి మధ్య కేవలం ఇదే సంబంధం

అది నన్ను ఆటంకాలు కలిగించి అడ్డగిస్తుంది

నేను దాన్ని తన్ని ముందడుగు వేస్తాను.)

~

హో సకా న కుఛ్ మగర్

షామ్ బన్ గయి సహర్

వహ్ ఉఠీ లహర్ కి ఢహ్ గమే కితే భికర్ – భిఖర్

జార్ హమ్ లుటే – లుటే

వక్త సే పిటే – పిటే

దామ్ గాంఠ్ కే గవాం, బాజార్ దేఖతే రహే

కారవాం గుజర్ గయా, గుబార్ దేఖతే రహే.

(ఏమీ చేయలేకపోయాను

సంధ్యలోనే తెల్లారిపోయింది

ఆ అల ఎగిసి పడింది, కోటలన్ని శిధిలాలయ్యాయి

దోచుకోబడి నేను

కాలం వేసిన దెబ్బలకు నేను

డబ్బుల మూట పోగొట్టుకున్న నేను బజారుని చూస్తూ)

(కారవాం గుజర్ గయా)

కవి ఒక వైపు తనని తాను గాలి దుమారాలలో నడిచే బాటసారిగా చెబుతూ తనని అడ్డుకునే ప్రపంచాన్ని తన్నేస్తూ ముందుకు నడుస్తున్నాని చెబుతూ మరొక వైపు తలరాతకి తల వంచుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని వ్యక్తం చేస్తున్నాడు. ఒక వైపు ప్రచండ ప్రభంజన తీవ్రగతి, మరో వైపు చల్లటి పిల్లగాలి, ఒక వైపు హృదయాన్ని కదిలించి కుదిపి వేసే భావోద్వేగాల తీవ్ర జల ప్రపాతంలాంటి వేగయుక్త శైతీ – శిల్పం, మరో వైపు మనస్సును స్పర్శించే సూక్ష్మ బావాలను లలిత శైలిలో మార్మికంగా వ్యక్త పరచడం.

నీరజీయ గీతాలలో వస్తువు (విషయం) ఎన్నో రకాలుగా ఉంటుంది. విషయాలు అనేకం. ఆయన రచనలలో ఆధునిక సాహిత్యంలో ఉండే అన్ని విషయాలకు సంబంధంచిన గీతాలు ఉన్నాయి. నిరాశ స్వరం, మృత్యుభావన, ఉన్నత జీవిత ఆదర్శాలు, ఆత్మవిశ్వాసం, మానవత్వం, ప్రేయసి పట్ల ప్రేమ, రాష్ట్రీయ ప్రేమ, ఉన్నత తత్వం మొదలైనవి గీతాలలోని విశేషాలు. నీరజ్ రచనలలో అనేక రకమైన గీతాలు ఉన్నాయి. ప్రేమగీతాలు, ప్రగతి గీతాలు, మానస గీతాలు, సంఘర్షణతో కూడిన గీతాలు, మానవ గీతాలు, ప్రార్థనా గీతాలు, రాష్ట్రీయ గీతాలు, ఉపదేశాత్మకమైన గీతాలు, రహస్యవాదీ గీతాలు, సందేశాత్మక గీతాలు, ఉత్సహాన్ని ప్రేరేపించే గీతాలు.

నీరజ్ గారు తన ‘దర్ద్ దియా హై’ అనే కావ్య సంకలనంలోని భూమిక (ఉపోద్ఘాతం)లో ఇట్లు రాసారు –

“నా దృష్టిలో సాహిత్యానికి మనిషి కన్నా మరో సత్యం ఏదీ ఈ లోకంలో లేదు. దీన్ని పొందడంలోనే మనిషి సార్థకత ఉంది. నేను నా కవితల ద్వారా మనిషిగా అవతలి మనిషి దాకా చేరాలని కోరుకుంటున్నాను. నా జీవిత యాత్రకి మొదలు అదే చివరిదీ అదే. ఆరంభం అంతం రెండు ఈ సత్యాన్ని పొందడం కోసమే.” నీరజ్ మానవత్వాన్ని పూజించే పూజారి, అని స్పష్టమవుతోంది. మానవత్వం అంటే ప్రేమ. అంటే నీరజ్ ఓ ‘ప్రేమ పూజారి’.

నీరజ్ ఛాయావాదం తరువాత కవితా సాహిత్యంలో అడుగు పెట్టిన కవి. అందువలన నీరజ్ పైన అంతకు పూర్వపు ఛాయావాదం, రహస్యవాదం రెండింటి ప్రభావం ఉంది. ఆయన ఈ రెండింటినీ స్వీకరిస్తూ ప్రగతి పథం పైన నడిచారు. ఆయన ఏ వాదలను సిద్ధాంతాలుగా స్వీకరించి వాటికే కట్టుబడి లేరు. ఆధునిక కావ్య సాహిత్యంలో రహస్యవాదం (మార్మికవాదం) ఒక ప్రత్యేకమైన కావ్య ప్రక్రియ. రహస్య భావన అనే పదంలోనే ఎంతో గొప్ప అర్థం ఉంది. ఈ భావంలో ద్వైతానికి చోటు లేదు. రహస్యవాదులు ఆత్మ పరమాత్మల మధ్య అద్వైత భావం మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ద్వైత భావం ఉంటే ఆత్మ పరమాత్మల కలయిక అసంభవం. ఈ భావాన్ని వ్యక్తం చేసే ఒక సుఫీ కవి కవితకి నీరజ్ అనుసృజన చేసారు. అందులోని కావ్య పంక్తులు..

అర్థరాత్రి

అంబర్ స్తబ్ధ్ శాంత్

ధరా మౌన్ సన్నాటా

థఫ్.. థప్.. థప్..

ద్వార్ పర్ కౌన్ హై

‘మై హుఁ తుమ్హారా యాచక్’

‘కిస్ లియే ఆయే హో’

‘ఏక్ దృష్టి దాన్ హేతు..’

‘నహీ .. నహీ.. జావో యహాఁ దాన్ నాహీ మిల్‍తా హై’

“భిక్షు ఔర్ దాతా కే బీచ్ జో పరదా హై

జిస్ దమ్ వహ్ జలతా హై

తభీ ద్వార్ ఖుల్‌తా హై

ఔర్ ద్వార్ బంద్ రహా”

(దర్ద్ దియా హై)

(“అర్ధరాత్రి

ఆకాశం స్తబ్ధంగా ఉంది

భూమి అంతటా నిశ్శబ్దం

ధప్.. ధప్.. ధప్..

‘ద్వారం దగ్గర ఎవరు ఉన్నారు?’

‘నేను యాచకుడిని’

‘నీ దయ కోసం, దానం కోసం’

‘ఊహు.. వెళ్ళిపో ఇక్కడ దానం దొరకదు’

 ‘భిక్షకుడికి దాతకి మధ్య తెర ఉంది

 అది పూర్తిగా దగ్ధం అయినప్పుడే

ద్వారం తెరుచుకుంటుంది

తలుపులు మూయబడ్డాయి’)

ఇక్కడ ఆత్మ యాచకుడు. పరమాత్మ దాత. ఇద్దరి మధ్య అడ్డంగా ఒక తెర ఉంది. ఈ తెర పూర్తిగా దగ్ధం అయినప్పుడే ఇద్దరి మధ్య ఉన్న దూరం మటుమాయం అయితేనే ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతంది.

థప్.. థప్.. థప్..

‘ద్వార్ పర్ కౌన్ హై?’

‘మై హుఁ తుమ్హారీ భక్త్ ఏక్’

‘ఆశయ్ క్యాహై’

‘అపనే భగవాన్ కా హీ దరస్ తనిక్ పానా హై’

‘ఔర్ భోర్ హోతే హి వాపస్ లౌట్ జానా హై’

‘నహీ.. నహీ..’

‘భక్త్ భగవాన్ యహాఁ దోనోంకే ఠౌర్ నహీ’

‘దర్శన్ జో పానా హో అభీ హుయీ భోర్ నహీ’

బంద్ ద్వార్ బంద్ రహా హువా కోయీ షోర్ నహీ

(థప్.. థప్.. థప్..

‘ద్వారం దగ్గర ఎవరు?’

‘నేనే నీ భక్తుడిని’

‘ఏం కావాలి?’

‘నా భగవంతుడిని ఒకసారి దర్శనం చేసుకోవాలి.’

‘తెల్లవారుతూనే వెళ్ళిపోవాలి’

‘ఊహు.. కాదు.. కాదు’

‘భక్తుడికి భగవంతుడికి ఇక్కడ ఒకే చోట చోటు లేదు’

 దర్శనం చోసుకోవాలంటే ఇంకా తెల్లవారలేదు.

ముసుకున్న ద్వారం ముసుకునే ఉంది, అంతటా నిశ్శబ్దం.)

ఇక్కడ ఆత్మ భక్తుడు. పరమాత్మ భగవంతుడు. భక్తుడు భగవంతుడి మధ్యలో ఉన్న దూరం పూర్తిగా మటుమాయం అయినప్పుడే భగవంతుడి దర్శన భాగ్యం భక్తుడికి కలుగుతుంది. ఇంకా ఈ దూరం పూర్తిగా నశించలేదు. అందువలన అతడికి భగవంతుడికి దర్శనం కాలేదు.

థప్.. థప్.. థప్..

‘కౌన్ హై?’

ఉత్తర్ నహీ

‘కౌన్ హై?’

ఉత్తర్ నహీ

‘కౌన్ హై?’

వహీ జో భీతర్ హై బోల్ రహా,

దర్పణ్ బన్ రూప్ జిస్ కా బాహర్ హై డోల్ రహా,

ఘూంఘట్ ఉఠాకర్ జో దర్వాజా ఖోల్ రహా

భ్రమ్ కా జో కాజల్ థా ధుల్ గయా

పరదా ఉఠా సురజ్-సా ఖిల్ గయా

ఔర్ బంద్ ద్వార్ స్వయం ఖుల్ గయా

(దర్ద్ దియా హై)

(థప్.. థప్.. థప్..

‘ఎవరు?’

జవాబు లేదు

‘ఎవరు?’

జవాబు లేదు

అతడే ఎవరైతే లోపల ఉన్నాడో, మాట్లాడుతున్నాడో

అద్దం రూపంలో బయట ఊయల ఊగుతున్నాడు.

ముసుగు తీసేసి ఎవరైతే తలుపులు తెరుస్తున్నాడు.

భ్రమ అనే కాటుక కడిగి వేయబడ్డది, తెర పైకి లేచింది,

సూర్యుడిలా వికసించింది

మూయబడ్డ తలుపులు తెరవబడ్డాయి.)

ఇక్కడ ద్వైతభావం సమాప్తం అయిపోయింది. మొట్ట మొదటి ఛందస్సులో ఆత్మ తన అహాన్ని ప్రదర్శించింది. పరమాత్మ నుండి తనని తాను వేరు చేసుకుంది. అందు వలనే ‘నేను’ అని అంటోంది. కాని అంతిమ ఛందస్సులో ఆత్మ పరమాత్మతో ‘నువ్వే నేను’ ‘నీ రూపమే నాది’ అని అంటోంది.

ఇక్కడ ద్వైత భావం లేదు. ఇందులో అద్వైతం ఉంది. అప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. ఆత్మ పరమాత్మలో లీనం అయిపోతుంది. ఇటు వంటిదే మరొక ఉదాహరణ ఎవరో ప్రేమికుడు ప్రేయసి ఇంటి తలుపులను తట్టాడు. లోపలి నుండి ఒక స్వరం వినిపించింది – “నీవు ఎవరు?” ఆ స్వరం ‘నేను’ అని పలికింది. లోపలి నుండి “ఇంట్లో నీవు నేను కలిసి ఉండలేము.” అన్న మాటలు వినిపించాయి. తలుపులు మూసుకునే ఉన్నాయి. ప్రియుడు నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం తపస్సు చేసాక మళ్ళీ ద్వారం దగ్గరకి వచ్చాడు. తలుపులను తట్టాడు. మళ్ళీ అదే ప్రశ్న – “నీవు ఎవరు?” ప్రేమికుడు జవాబు చెప్పాడు. “నీవే..” అంతే తలుపులు తెరచుకున్నాయి. ఈ ఉదాహరణ వలన ఒక సత్యం స్పష్టం అవుతోంది. రహస్యంవాదం (మార్మిక వాదం) లో ఆత్మ పరమాత్మల మధ్య ధ్వైత భావానికి స్థానం లేదు.

నీరజీయ గీతాలలో విరహ వేదన ఎంతో బలంగా చిత్రీకరించ బడ్డది. కింద ఇచ్చిన గీతంలో ఆత్మ పరమాత్మ కోసం ఎంతగా పరితపిస్తోందో వర్ణింపబడింది. ఆత్మ తన ప్రియుడైన పరమాత్మతో ఇట్లు అంటోంది –

తుఝ్‌‌సే లగన్ లగాయీ

ఉమర్ భర్ నీంద్ న అయీ

(నీతో ఆత్మీయతని పెంచకున్నాను.

జన్మంతా నిద్రే రాలేదు.)

దర్ద్ బిఛౌనా, దేహ్ అటారీ

రోమ్, రోమ్ ఆరతీ ఉతారీ

పలక్ భిగోయి అలక్ సాంవరీ

(బాధ పరుపు అయింది దేహం గూడు అయింది.

రోమ రోమాలకు హారతి

కనురెప్పలు తడిపాను, ముంగురులను సవరించాను)

అయినా అతడి జీవితంలో వెన్నెల లేదు. కేవలం పెను చీకటే ఉంది. ఆత్మ తన ప్రియుడి దాక చేరదు. ఎన్నో అష్టకష్టాలు పడుతోంది.

“సాథీ ఛోడే, సంగీ ఛోడే

జన్మ జన్మకే బంధన్ తోడే

బద్‌నామీ సే రిస్తే జోడే

ఇస్‌లియే ఆత్మ కహతీ హై

తబ్ తుఝ్ తక్ ఆపాయా

న కర్ అబ్ తో నిఠురాయూ

తుఝ్‌‌సే లగన్ లగాయీ

ఉమర్ భర్ నీంద్ న అయీ..”

(స్నేహితులను, తోటి వాళ్ళను వదిలేశాను. జన్మ జన్మల బంధాలని తెంచేసుకున్నాను. అపకీర్తితో సంబంధాన్ని ఏర్పరుచుకున్నాను. అందువలన ఆత్మ ఇట్లా అంటోంది –

“అప్పుడు కాని నీ దాకా చేరలేకపోయాను. ఇక ఇప్పుడు నిష్ఠూరంగా మాట్లాడుకు నీతో ఆత్మీయతని పెంచుకున్నాను. జన్మంతా నిద్రపోలేదు”)

ఆత్మ చిరవిరహిణి. దుమ్ము – ధూళితో నిండిన దేహన్ని కోటి శృంగారలతో అలంకారించుకొండి. ఎన్నెన్నో కలయికల సన్నాయిలు మ్రోగాయి. యుగాల నుండి నిద్రపోకిన, పొగొట్టుకున్న చరిత్రల సిరా, అంతా మూగదై పోయింది. తులసీదాస్, సూరదాస్ మూగవాళ్ళై పోయారు, లక్షల మంది ముత్తైదువుల సిందూరం చెరిగిపోయింది. లక్షల రాత్రుల ద్వారాల తారలు విరిగి పడ్డాయి. లెక్క లేనన్ని వసంతాలు ముంగిట్లో విరిసాయి, రాలిపోయాయి కానీ ఈ విరహిణి ఆత్మ –

ఆజ్ తక్ న జిస్ కా పరదేశీ ప్రయతమ్ ఆయా

(ఇవాళ్టి దాకా తన పరదేశీ ప్రియుడు రాలేదు.)

ఆత్మలో పరమాత్మ కోసం ఎప్పటికీ అనురాగం ఉండి తీరాలి. ఈ భూమి మీద మానవుడిగా పుట్టాక ఎటువంటి మచ్చ లేకుండా ఉండడు. ఆత్మ పరమాత్మతో అంటుంది.

“మా మత్ హో నారాజ్ కి మైనే ఖుద్ హి మైలా కీ న చునరియా.”

(అమ్మా! కోప్పడకమ్మా! నా కొంగుకు నేను మట్టి బురదల నంటించుకో లేదమ్మా!)

పంజరంలోని మైనాకి ఇక్కడి సందు గొందులు ఏ తెలుసు? ఆ మైనా తన ముతక బట్టలలోనే ఎంతో సంతోషంగా ఉంది కాని ఈ లోకంలోని మేలా (తిరువాళ్ళు) లోకి ఈ రంగుల ప్రపంచంలోకి దానిని ఎవరు పంపించారు? ఈశ్వరుడే కదా లోకంలోకి పంపించాడు. ఈ లోకం లోని ఈ మేలా గురించి ఆత్మ ఈ విధంగా చెబుతోంది. అసలు ‘మేలా’ అంటే అదేనమ్మా అదే.. అడుగడుగున ఆకర్షణలమ్మా! లక్షల దుకాణాలు, లక్షల తమాషాలు లక్షల్లో చిలిపి అల్లరి చేసే వాళ్ళే నమ్ము! అసలు అక్కడ అన్నీ నకిలీ పూలేనమ్మా! అయినా అసలు సిసలైన పూలు వాటిని చూసి సిగ్గు పడతాయమ్మా! మరి నీవే చెప్పమ్మా! ఈ పదహారేళ్ళ మనస్సును ఎట్లా నిగ్రహించుకోగలనమ్మా! అయినా! అయినా అమ్మా ! మనస్సును ఎంతగానో నిగ్రహించుకున్నా..

పైన ఉల్లేఖించిన దాన్ని బట్టి చూస్తే నీరజ్ రహస్యవాద గీతాలలో మార్మికతను వ్యక్తం చేయగల సామర్థ్యం ఉంది అన్న విషయం తెలుస్తోంది. ఆయన రహస్యవాదం శుష్కమైనది, నీరసమైనది ఎంత మాత్రం కాదు. ఈ రహస్యవాదం భావాత్మకమైది. ప్రేమ దీని బీజం. ఈ రహస్యవాద గర్భంలో భావం, ఊహల ఉమ్మ నీరు ఉంది. ఇది అంకురానికి అపారమైన జీవ శక్తిని ఇస్తుంది. ఈ అంకురాలనే గీతాలు చిగుళ్ళు తోడిగి, మొక్కలై, చెట్లైయి, పూవులై, కాయలై, పండ్లై, వటవృక్షాలై ఈనాటి వరకు సాంధీగంధాన్ని వెదజలుతున్నాయి. నీరజీయ గీత వసంతానికి ఏ నాటికి శిశిరం ఉండదు.

నీరజ్ గీతాలు చదివాక పాఠకులకు మన భారతీయ సంస్కృతి గుర్తుకు వస్తుంది. భారతీయ సంస్కృతికి పునాది ఆధ్యాత్మికం. ఈ గీతాలలో ఏ సంగీతం అయితే వినబడుతుందో అది ఆత్మ – పరమాత్మల ప్రణయ భావసంగీతం. ఈ సంగీతంలో నాస్తికుడు కూడా కొంచెం సేపు తనని తను మరచిపోతాడు. పరమాత్మని ఊహించుకుంటాడు. ప్రణయ భావంతో పాటు ఈ గీతాలలో భక్తి భావం కూడా ఉంది. భక్తితో కూడిన ఈ రహస్యవాద గీతాలలో కవి పరమాత్మని దాత రూపంలో భక్తుడిని యాచకుడి రూపంలో చిత్రీకరిస్తాడు. ఈ గీతాలలోని పల్లవులు పాఠకులపై ఎంత గానో ప్రభావం చూపిస్తాయి. కొన్ని గీతాలు సంక్షిప్తంగా లేవు. ఈ గీతాలు పెద్దవిగా ఉన్నా కూడా వీటిల్లో ఆధ్యాత్మిక మానసతరంగాల వికాసం విహతమై ఉంది. నీరజ్ రహస్యవాద గీత్‌కార్ కాకపోయినా మార్మికతను వెల్లడించడంలో ఎంతో దిట్ట. ఈ గీతాలలో అవ్యక్తమైన పరమాత్మ పట్ల హృదయ – తల్లీనత, పరమాత్మలో ఐక్యం కావాలి అన్న తపన ఉన్నాయి. ఆయన వ్యష్టిరహస్య వాదం సమిష్టి (సమాజ) పరమైనదిగా కూడా కనిపిస్తుంది.

“నీరజీయ గీతాలలో సూక్ష్మ – స్థూల సశక్తమైన సౌందర్య చేతనా వికాసం కనిపిస్తుంది.” వారి సౌందర్య దృష్టి కేవలం కాముకతతో కూడినది ఎంత మాత్రం కాదు. ఈ గీతాలలో ప్రేమ, దయ, కరుణ, త్యాగం మొదలైన మానవీయ గుణాల పూర్ణకుంభం ఉంది. ఈ గీతాలలో విశ్వ చైతన్య సౌందర్యం ఉంది. నీరజీయ గీతాలు యువతరానికి ఆదర్శాలు. ఆయన ఆటుపోట్లు జీవితం, గీతాలు వ్యక్తిత్వ వికాసానికి ప్రతీకలు.

ఈనాడు నీరజ్ వయౌవృద్ధులు. వారి జీవన సంఘర్షణ చదివాక ఒక సత్యం స్పష్టం అవుతుంది. ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా ధైర్యంగా ధీరోదాత్తుడై ముందుడుగే వేసారు. గెలుపు – ఓటమిలను స్వీకరిస్తూ జీవన పథానికి ఒక అమూల్యమైన సౌందర్యాన్ని చేకూర్చారు. సఫల యాత్రికుడు నీరజ్. ఈ బాటసారి పేరు వినగానే ఒక అందమైన దృశ్యం పాఠకుల ఎదురుకుండా సాక్షాత్కరిస్తుంది. పల్లకీలో నీరజ్ ఉన్నారు. అక్షరాల బోయలు పల్లకీని మోస్తున్నారు. గీతాల స్వరం మారుమ్రోగుతోంది.-

జయ జయతి హింద్

లాల్‌ఖిలే పర్ లహారాతా హై

దేశ నిషానా తిరంగా ప్యారా

ఔర్ కహ్ రహా విశ్వ్ ప్యారా

ఔర్ కప్ రహా విశ్వ హమారా

హింద్ హిమాలయ్ కా అభినందన్

(ప్రాణగీత్)

(జయ – జయతి హింద్

ఎర్రకోటపై ఎగురుతోంది

దేశపు గుర్తు మూడు రంగుల జండా

ప్రేమ మయ విశ్వం

మా హింద్ హిమాలయాలకి

స్వాగతం పలుకుతోంది

శభాకాంక్షలు తెలుపుతోంది.)

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here