[dropcap]మ[/dropcap]నసైన వేళలో
ముసిరిన ఊహకు
విరిసిన ఊసుకు
ప్రభవించిన ఉదయని నీవు.
***
నీ నీడలో,
అడుగడుగులో
ఎంత మోసినా
అలుపు రాని నిజం నీవు.
***
చిక్కని పాలలో
వెచ్చని పాల నరుగులా
చక్కని నవ్వులో
పచ్చని స్వేచ్ఛవు నీవు
***
విప్పారిన మనసులో
విరబూసిన మమతలా
పురివిప్పిన అందంలో
కళవిరిసిన కాంతి నీవు.
***
మాట లేకుండా మ్రోగే
మౌనం నీవు
పలుకు లేకుండా పల్లవించే
చరణం నీవు
***
కంటి గూటిలొ
పారాడే చంటి పాపలా
ఎదిగే ప్రేమకు
వెలుగు రూపం నీవు.
***
పగలు గీసిన గీతలో
ప్రాణం పోసుకొన్న అందం నీవు.
రాత్రులు రాసిన కవితలలో
పొదగపడ్డ ప్రేమవు నీవు