నీవు..

0
11

[dropcap]కొం[/dropcap]చెం మబ్బు దుప్పటి తొలిగించి
వెలుతురు పంచగల సూర్యుడివైతే

చెదపట్టిన మనుషుల మెదళ్ళను
రగిలించగల నిప్పు కణిక వైతే

దిక్కు తోచని జనసమూహానికి
ఓ దారి చూపగల నక్షత్రానివైతే

ఆశలు ఆవిరయే వేళ ఓ వెలుగు నిచ్చే
గోరంత దీపానివైతే

ఎక్కడా కనపడని
ఎవరికీ వినబడని
మనోద్దీప్త గానానివైతే

ప్రతి హృదయం
కొత్త ఉదయమయే మెరుపౌతుంది
మనసుని తట్టి లేపే వెచ్చని పిలుపౌతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here