[dropcap]”మ[/dropcap]నిషి మనిషి ఆ రాయిలా నువ్వు ఏమి చూస్తివి?”
“రాయిలా శిల్పం చూస్తిని”
“ఇసకలా?”
“ఇల్లు చూస్తిని”
“ఆ ఆకులా ఏమి చూస్తివి?”
“రుచి చూస్తిని”
“ఈ ఆకులా ఏమి చూస్తివి?”
“దాంట్లా మందు (ఔషధం) చూస్తిని”
“ఔనౌనా! మనిషి ఆ కల్లు సారాయిలా ఏమి చూస్తివి?”
“అది నా వ్యసనం దాంట్లా నేను సొర్గం (ఆనందం) చూస్తిని”
“బలే బలే! ఆ బంగారంలా ఏమి చూస్తివి?”
“సిరిని చూస్తిని ఆ బంగారంలా నా పెండ్లాముని సింగారిస్తిని”
“సరే సరే! మనిషి! ఆ కారులా ఏమి చూస్తివి?”
“హోదా! చూస్తిని”
“మంచిది మనిషి మంచిది ఆ అద్దంలా ఏమి చూస్తివి?”
“అందం చూస్తిని”
“శానా మంచింది మనిషి… మనిషి…”
“చెప్పు… చెప్పు”
“నువ్వు మనిషిలా ఏమి చూస్తివి?
“నేను మనిషిలా మనిషిని చూడలే”
“కదా”
“ఊ”
“మనిషిలా మనిషిని చూడని నువ్వేం మనిషివిరా నీయాక్సినగా, నువ్వు ఎగిరిపడి నిగురుకొన…”
నీయాక్సినగా = ఒక రకం తిట్టు