నేను మొలవడం ఓ తమాషా..

0
8

[శ్రీ సాహితి రచించిన ‘నేను మొలవడం ఓ తమాషా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]చ్చవు గాని
మెత్తగా గుచ్చినా
భలే ఇష్టం నీవంటే..

అమాంతం నిజంలోకి దూకి
ఆ ధూళిలోనే ఒడిసిన కలను
ఓర్పునల్లి, నీడను చల్లి

విస్తృతంగా వీచే ఎండను తాగి
ఎర్రని కిరాణాలని కౌగిట్లో ఆర్పి
మేఘమై కరగడంలో

తడవడం సరదా
తేమవడం సందడి
అందులో నేను మొలవడం ఓ తమాషా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here