నేను

0
7

[dropcap]ని[/dropcap]శీధి వేళలో…
నిరహంకార తోవలో….
నిర్మలానంద అన్వేషణలో….
‘నేను’ ఎవరని ఆలోచిస్తే
‘నేను’ లేను…….
మరి నేను అనుకున్నది ఎవరు?
మరి నాది అనుకునేది ఏమిటి?
అదే ఓ నూతన ఎరుక
ఆ ఎరుక అర్ధమయ్యే లోపల
ఈ జీవితం అంతర్ధానమవ్వడం ఖాయం
నేను ఉంటే -అన్ని నాకే కావాలి
నేను పోతే -నువ్వు కూడా ఉండాలి
అదే ఆరుద్ర “త్వమేవాహం”
నువ్వేనేను…….
అహం బ్రహ్మాస్మి…… శివోహం…….
ఏ పరమాచార్య చెప్పినా…
పరమార్థం ఒక్కటే…
నేను అనేది “చైతన్య శక్తి”
అందరిలోని ‘నేను’ అనేది ఒకే పరమాత్మ స్వరూపం…
ఆ తత్వం తెలిస్తే
నిలిచేది మోక్షత్వం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here