[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఈ నవ సావాసి సన్యాసి (4) |
4. గ్రామం లో ప్ర సా దు (4) |
7. రేపు ఒక మహానుభావుడి జయంతి. (5) |
8. అటునుంచి వస్తున్న మంత్రి గారు సగంలో ఆగిపోయారు (2) |
10. – – మనమంచికే (2) |
11. మయూరాన్ని నెమ్మదిగా పిలుస్తే అటునుంచి వస్తుంది (3) |
13. దుఃఖాన్ని మధ్యలో కొంచెం దిగమింగండి (3) |
14. ఆమె లో అతడు- ఆమె. ఎవరామె? (3) |
15. ఆఫీస్ మధ్యలో కుంచించుకు పోయింది (3) |
16. సీతాలు దే ఇది (3) |
18. తెల్లవాళ్ళ బహు గదుల సముదాయం (2) |
21. ప్రతివాడి జీవితం లో ఈ రాయి ఉండాలి. సరే లెండి అదేదో అటునుంచి చెప్పండి (2) |
22. పిల్ల నలుపా తెలుపా? కాదండి —–(5) |
24. ద్వాదశి తరువాత వచ్చేది (4) |
25. య నుంచి వ వరకు రాయరా అంటే గుంటడికి పొగరు. ఇలా రాసేడు (4) |
నిలువు:
1. రాధకు ‘శ్రీకృష్ణుడు’ అంటే వల్లమాలిన అభిమానం (4) |
2. హిందీ మేనత్త. పాపం బోర్లా పడింది (2) |
3. ప్రయాణీకులకు గమనిక 12345 దురంతో బయలుదేరుటకు — గా ఉన్నది (3) |
4. ఒక అప్సరస చెవికి కమ్మ కట్టండి (3) |
5. వస్తాదు కుస్తీ కొచ్చి తిరగబడ్డాడు (2) |
6. అడ్డం 13 సరిగ్గా ఇక్కడ కుదిరింది (4) |
9. ఔరా! అంటూ చిరంజీవి ఈ మాట కూడా పాటలో అన్నాడు (5) |
10. ఒకప్పుడు సంవత్సరాల పాటు నడిచిన బుల్లితెర ధారావాహిక (5) |
12. ఎటు నుంచి చూసినా ఘనతే! (3) |
15.అందరితో స్నేహంగా ఉంటాడని కాబోలు ఒక తిమ్మన గారికి ఈ బిరుదు ఇచ్చారు (4) |
17. బుడమేరు నది ఈ ఊరి పక్కన ఉన్న కొండల్లో పుట్టిందట. ఊరు వంకర టింకర అయిపోయింది. (4) |
19. మంచకొండ మీద వరకు వెళ్ళకండి. విరిగిపోయింది (3) |
20. అడ్డం 13 అలా అన్నారు. ఇక్కడ కూడా సరిగ్గా రాయరా ? రెండిటికీ ఒకటే జవాబైనా !(3) |
22. ఇదెప్పుడూ నూతిలో పడిపోతూ ఉంటుంది (2) |
23.’బాలరాజు’ సినిమా లో కస్తూరి శివరావు పాత్రపేరు. మంద లేదు.(2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 24 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 11 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 29 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 9 జవాబులు:
అడ్డం:
1.సన్నివేశం 4. వడగాడ్పు 7. పనిగంటలు 8. మేడే 10. పయి 11. వగలు 13. టేరాక 14. అంకెలు 15. గన్నులు 16. చికాగో 18. వలు 21. లుర 22. పరపీడన 24. రుకాపులు 25. విషాదము
నిలువు:
1.సత్యమేవ 2. వేప. 3. శంనిర్వం 4. వటచ 5. డలు 6. డ్పుమోయిక 9. డేగకన్నులు 10. పరాచకాలు 12. సంకెళ్లు 15. గవర్నరు 17. గోరసము 19. మరలు 20. అడవి 22. పపు 23. నషా
నూతన పదసంచిక 9 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ఈమని రమామణి
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ల శేషగిరి రావు
- పొన్నాడ సరస్వతి
- శంభర వెంకట రామ జోగారావు
- శాంత మాధవపెద్ది
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.