నూతన పదసంచిక-21

0
8

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. చిన్ని కృష్ణుడికి ఇదంటే చాలా ఇష్టం (4)
4 .మీ సమ్మతి మాకు సంతోషం (4)
7. మనకి ఫేస్బుక్ ఎలాగో ఈయనికి చిట్టా అలాగా!(5)
8. ఇలా తిరిగి చూడకు (2)
10. కానుక లో గారె ఎవరో తినేసారు. ఇదే మిగిలింది. భయపడొద్దు (2)
11. ఈ చివరా ఆ చివరా విరిగిన ఈర్పెన (3)
13. పసి రూపంలో సింగారి (3)
14. విలన్ల వెంట ఉండేవాళ్ళు (3)
15. రూపా రాణి లాక్షారసం పూసుకుందట. (3)
16. లోభి తరువాత ఇలా మారాడు (3)
18. అసలే నడక కి పెట్టింది పేరు. నడిచి నడిచి సన్నబడిపోయింది‌. (2)
21. కొండ వదిలిన కోతి (2)
22.  అలా అంటాం గానీ నేను ఎప్పుడూ దీన్ని బయట చూడడమే బెకబెక మంటూ (5)
24. ఈ ఊరి హల్వా తిన్నాకా ఆ తీపి భరించలేక ఊరుపేరే తికమకగా చెప్పాను (4)
25.  తునా పోయింది ఇవి మిగిలాయి (4)

నిలువు:

1.  తెల్లపోవటానికి ధరని ఆమ్రేడించాలా? (4)
2.  క కలిపితే చీపురు. కలపకపోతే బాధ్యత (2)
3.  మున్మథుడు శీర్షాసనం వేసి కాళ్ళు ముడుచుకున్నాడు (3)
4.  మీరందరూ నాకు వీళ్ళే కదా! (3)
5.  ఇది ఎప్పటికైనా చిగురించక మానదు (2)
6. ఆమ్రేడిస్తే అలాంటి నవ్వులు కనపడతాయి (4)
9. బ్రహ్మ పనుల్లో ఇదొకటిట. (5)
10. శిశువునుయ్యి.  ఇదేం తెలుగు? ఏమో వాటిని ఇంకో రకం గా రాస్తే నరకమట. (5)
12. పూరీ జగన్నాథ స్వామి మందిరం లో పూర్వం వీరి దాష్టికాలు ఎక్కువ గా ఉండేవి. ఇప్పుడు తగ్గాయి (3)
15. ఈ రాయుడు ఊరు మంగళగిరి (4)
17. అంతరించిపోతున్న ముద్దొచ్చే చిట్టి పక్షులు (4)
19. మహమ్మద్ ప్రవక్త కూతురి పేరు (3)
20. తాతా కసరతు లో శక్తి ఉందా అన్నాడు మనవడు.  ఉందీ అన్నాడు తాత. (3)
22. నూరుగురు లో నువ్వు (2)
23. అడ్డం పది లోనిదే .తలాతోకా లేదు. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 02వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 21 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 07 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 19 జవాబులు:

అడ్డం:   

1.వానాకాలం 4. అహోరాత్రం‌ 7. జామురాతిరి 8. పాచి‌ 10. గీత‌ 11. ముత్తనె‌ 13. ణిర్వాశ‌ 14. జంజాటం 15. ఈనెలు‌ 16. గంభాస‌ 18 లల 21. షమీ‌ 22. పేదరికము‌ 24. డిప్పకాయ 25. పిల్లాపీచు‌

నిలువు:

1.వానపాము‌ 2. కాజా‌ 3. లంముచ‌ 4. అతిథి‌ 5. హోరి‌ 6. త్రంపతశ‌ 9. చిత్తడినెల‌ 10. గీర్వాణభాష‌ 12. పుంజాలు‌ 15. ఈలకోడి‌ 17. సమీపించు. 19. ఉదయ‌ 20. ల్లాకపి‌ 22. పేకా‌ 23. ముల్లా ‌

నూతన పదసంచిక 19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్శపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోల్ల వెంకట్‌రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సూర్యకుమారి మానుకొండ డాక్టర్
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here