నూతన పదసంచిక-29

0
10

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కంచు కంచమట. కంసుడు భక్తుడట! ఏవిటో?(4)
4. పరుగెట్టటం బాగా తెలుసు కాబోలు కుబేరుడుకి. అందుకే పేరులో  అది ఉంది (4)
7. వీడు తిండిపోతు (5)
8. ముందు క్లీ పెట్టండి. హోటల్ లో సర్వరు కింద పని చేసే వాడు కనిపిస్తాడు. (2)
10. తల తెగిన రాకెట్టు (2)
11. రామదాసు భక్త నివాసం.(3)
13. ఇవి నిండగానే ఇంటికి పంపిస్తారు (3)
14. ఒక రాగం. అశ్వపతి భార్య కూడా (3)
15. దుర్వాసుడుకి మారుపేరు. (3)
16. అటునుంచి రావిశాస్త్రి గారి కొంచెం కొంచెం (3)
18. హైదరాబాద్ లో వీరి చీరల షాపు ఉంది. హెడ్డాఫీసు చెన్నైలో. (2)
21. మారేడు కాయ చెయ్యాలంటే ఇది కావాలి (2)
22. పెద్దన గారి వరూధిని (5)
24. సంస్కృత కలహంస (4)
25.  వెంకాయమ్మ కాదు కరీంనగర్ వారి దద్దమ్మ (4)

నిలువు:

1. చివరి మూడూ లేని ఉత్పలమాల (4)
2. రామావతారం ఈ రామాయణంగా తమిళంలో ప్రసిద్ధి చెందింది (2)
3. పీక తెగిన బుడమకాయ (3)
4. అనాకారి కాదు కోస్తా వారి గరిటె (3)
5. అడ్డం నాలుగులో 2,4 (2)
6. వీణావాదుడు మెట్లెక్కి వచ్చాడు (4)
9. చెప్పిందొకటి చేసిందొకటిగా ప్రవర్తించే వాళ్ళను దీనితో పోలుస్తారు (5)
10. అగ్ని ప్రమాదం వల్ల ఆస్తి నష్టపోతే ఈ ఇష్టం అయిందంటారు (5)
12. శంకరాభరణంలో మంజు భార్గవి పాత్ర పేరు, ఆమె కొడుకు గా నటించిన నటి పేరు. ఇక్కడ అదే అర్థంతో ఇంకో విధంగా (3)
15. గోదావరి ఒడ్డున ఈ అందాలు చూడవలసిందే(4)
17. అత్యధికం కి విశ్లేషణంగా ఒక అమ్మవారు (4)
19. చిన్నప్పుడు చదువు ఆగిపోతే ఇదెక్కిందంటారు (3)
20. రామా నీ కెవరు తోడు రామా ___ చూడు! త్యాగయ్య మొర (3)
22. నేము లేని పక్క దేశము (2)
23. తిరస్కారం కొంతే (2).

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 27 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 29 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 02 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 27 జవాబులు:

అడ్డం:   

1.రాధాష్టమి 4. గురుపూజ 7. ద్రవ్యదారువు 8. వరం‌ 10. ఏలు‌ 11. ముగుసు‌ 13. ఎకరా‌ 14. పథ్యము‌ 15. టోకరా‌ 16. లుతుకాం‌ 18. పీల‌ 21. డుతా 22. జనజీవన 24. సునయన‌ 25. చిత్తరువు‌

నిలువు:

1.రాఘవము‌ 2. ష్టద్ర‌ 3. మివ్యన‌ 4. గురులు‌ 5. రువు‌ 6. జవలురా‌ 9. రంగులకల‌ 10. ఏకదంతుడు‌ 12. తథ్యము‌ 15. టోపీదాసు‌ 17. కాంతారావు 19. ఆనన 20. సవచి‌ 22. జయ‌ 23. నత్త‌

‌నూతన పదసంచిక 27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహన రావు
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మణినాగేంద్రరావు బొందాడ
  • మత్స్యరాజ విజయ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పార్వతి వేదుల
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీనివాసరావు సొంసాళె

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here