నూతన పదసంచిక-39

0
8

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కళ్ళు చెదరే దృశ్యం చూడాలంటే ఈ గాయని నేత్రం కావాల్సిందే (4)
4. తామరపువ్వు కోసం శివుడి/సూర్యుడి ముందు విలపించు (4)
7. వెంట్రుక కోసం శివనామాన్ని రోజూ జపించు (3)
9. లవ్ లెటర్ (5)
10. కప్పి కలిగిన నుయ్యి (5)
11. దృష్టాంతాలు, తార్కాణాలు (4)
12. తెలంగాణలోని ఈ సరస్సు పర్యాటకులకు ఒక ఆకర్షణ. (4)
14. ఘృతద్వయంతో ఏర్పడే అహమే (2)
15. జబ్బపుష్టిలో అగుపించే జువ్వి (2)
16. నక్కజిత్తు (4)
19. ప్రారంభంలో రహస్యముగా గమనించే డాకలి (4)
23. పుండరీకము నిలువు 5 కాదు (5)
24. సూక్ష్మాతిసూక్ష్మమైన దీనిని డాల్టన్ కనిపెట్టాడట (5)
25. భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన తార (3)
27. గమ్మత్తుగా (4)
28. ఆకాశవాణిలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమం పేరు (4)

నిలువు:

1. ఫెయిర్ కాపీ కాదు సుమండీ (4)
2.పాలెగాడు (5)
3. అంధుడైన ఈ క్రికెటర్ ఈమధ్యే ట్రిపుల్ సెంచురీ చేసి రికార్డు సృష్టించాడు. (2)
5. అడ్డం 23 కాదు. ఇందీవరం (5)
6. అయ్యో దేవుడా! (4)
7. ఉన్నతమైనవి కొండకొమ్ములు (4)
8.  జల త్యాగి అస్తవ్యస్తమై మంటల జెండాల కవి జన్మస్థలిని గుర్తు తెస్తున్నాడు. (4)
11. పైకి ఎగబాకిన ఎక్కుడుతీగ (3)
13. ఇంగువ (3)
17. శ్రీశ్రీకి చలంద్వారా లభించిన టెస్టిమోనియల్ (5)
18. భారతీయులకు సంబంధించింది తల్లక్రిందలయ్యింది. (4)
19.  ముటుకూరు సుబ్బారావంటే ఎవరికి తెలుస్తుందీ? ఇలా పిలవాలి గానీ. (4)
20. పుండరీకము (5)
21. అబ్బ. ఏమి జ్ఞానం? (4)
22. ఓ పదిహేను నిమిషాలు (4)
26. శత్రువులతో కుదుర్చుకునే ఒడంబడిక (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 39 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 11 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 37 జవాబులు:

అడ్డం:   

1.కోనేరు 3. అఖండ 6. విమానం 9. పరమాన్నం 10. బర్బరీకుడు 11. మీగడ 12. కుముద 14. సంతృప్తి 16. ధీమతి 22. చలువరాయి 23. హయగ్రీవము 24. లావణి 25. బాడుగ 26. కుడుక

నిలువు:

2.నేలమాళిగ 4. ఖంజరీటము 5. ప్రపత్తి 6. విముక్తి 7. నంబరు 8. పడుగు 11. మీకోసం 13. దవంతి 15. తృణావర్తుడు 17. మణిగ్రీవుడు 18. సేచని 19. ఖాయిలా 20. గ్రహణి 21. వ్యోముడు ‌‌

‌‌నూతన పదసంచిక 37 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • శంభర వెంకట రామ జోగారావు

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here