నూతన పదసంచిక-5

0
12

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఆద్యంతాలు కోల్పోయిన ఒక రాగ విశేషం. సంతోషంతో మొదలయ్యేదే!(4)
4. కోరికే మొదలయి కొంచెం తగ్గి ఇష్టముగా పూర్తయింది.(4)
7. వెంకన్న మాఁవగారి సోదరుడు(5)
8. చొక్కాయి చివర చిరిగింది (2)
10. నువ్వాగమన్నావుకదా!  _ _ ! (2)
11. అందులో గుద్దులాట ఎందుకు కనపడదనా? (3)
13. ఎంత చెప్పినా వీళ్ళు _ _ _(3)
14. తల్లులు తమ పిల్లల్ని ఇలాంటి కొండ అని మురిసిపోతారు(3)
15. ఏకాకి కాదు అడబాల‌ (3)
16. ఆరుగురి‌ లో ఒకడు లేడు(3)
18. టెయిలర్ ని మర్యాదగా పిలవండి. (2)
21. ఇది పెడితే కంఠస్థము చేయడమా? (2)
22. వినుకొండ నాగరాజు గారి పోతు. (5)
24. సవతిమాత(4)
25. విసుర్రాయి అడ్డదిడ్డంగా తిరిగింది (4)

నిలువు:

1. హరి కృపాణము (4)
2. నూటికి పది తక్కువ తిరగబడింది (2)
3. ఈ గండడు కిందనుంచి ఎగబాకాడు(3)
4. ఆంజనేయుడిని ఇలా కూడా‌ అనొచ్చు (3)
5. ఈ భూములు వ్యవసాయానికి పనికిరావు(2)
6. ఇలాంటి మోము చూడ బుద్ధి కలిగిందట త్యాగరాజుల వారికి (4)
9. ఈ చటోపోధ్యాయ ప్రఖ్యాత హిందీ సినిమా దర్శకుడు (5)
10. రాజేంద్రప్రసాద్ కి కావలిసిన వారు (5)
12. నిన్నే మనం ఈ పండుగ జరుపుకున్నాం (3)
15. నమస్కారమా?(4)
17. శ్రీ శ్రీ సిప్రాలి లో ఒకటి తడబడింది(4)
19. హిందీలో వెళ్ళు పిల్లి అంటే ఆకాశం వైపు చూస్తారేంటి?(3)
20. ఈ చూపులు ఎక్కువైతే విసుగొస్తుంది.(3)
22. మీ జవాబులు కి ‘ఆధారం’ ఇదే(2)
23. తలా తోకా లేని పాము(2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఏప్రిల్ 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 5 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 17 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 3 జవాబులు:

అడ్డం:   

1.అతిలోక 4.కదేగజ 7. నాలుగోసింహం 8. ధూమ 10 సంభే 11. తహార 13. కంభారి. 14. సమ్మెట 15. మురసో 16. వేనమ 18. ఖతం 21. లుహ 22. అసమదీయు 24. తిలకము 25  మావగారు

నిలువు:

1.అవధూత 2. లోనా 3. కలుపు 4. కసింత 5. దేహం 6. జయభేరి 9. మహాభారతం 10. సంభావనలు 12. ఉమ్మెత్త 15. ముఖస్తుతి 17. మహజరు 19. మీసము 20. దాదీమా 22. అక 23. యువ

నూతన పదసంచిక 3 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధా సాయి జొన్నలగడ్డ
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ఎర్రోళ్ల వెంకటరెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాస రావు
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ల శేషగిరి రావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఆర్.మూర్తి
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • రామలింగయ్య టి
  • రంగావఝల శారద
  • ఎస్. పూర్ణకుమారి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శాంత మాధవపెద్ది
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వెంకాయమ్మ టి
  • వేణుగోపాల రావు పంతుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here