నూతన పదసంచిక-52

0
7

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

2. శివునికి ఉన్న సవాలక్ష పేర్లలో ఇదీ ఒకటి. శ్మశానంతో ముగుస్తుంది. (3,4)
4. కాలసూచకయంత్రములో రెండు మూడు అక్షరాలు తారుమారయ్యాయి. (5)
5. దేశరాజు రవికుమార్ గారి వాడుక నామం. (2)
7. కలవాడిలో భరద్వాజ పక్షి ఎగిరిపోతే మిగిలేది అన్నం ముద్దే. (2)
9. “మూలాధార చక్రం” ఆంజనేయులు నాయుడుగారి కలం పేరు. (4,4)
12. తరురుహములో నక్కిన మృగము (2)
14. గడ్డిని ఆవరించిన సివిలైజేషను (5)
16. ముళ్లమండతో మొదలయ్యే లోభి తిరగబడ్డాడు. (5)
17.  అడ్డం7లోని నాలుగో వర్ణాన్ని మూడో దానితో భర్తీచేస్తే వచ్చే ద్వేషం. (2)
18. డైరెక్టు ప్రొపోర్షన్ (8)
22. గతి గతితప్పితే యిక తార్తీయమే. (2)
23. కదులునది లోపల కలదు. (2)
24. స్వప్నం?తో మొదలై మదీయంతో ముగిసే భృంగరాజం. (5)
25. సుందరిలో మమేకమయిన సుబ్బారావు. 1452673  (7)

నిలువు:

1. పాలకుర్తి ఎమ్మెల్యే ఈ రావుగారు. (4)
2. బీదల ఆస్తి సినిమా నేపథ్యగాయనిని పిలుస్తున్నారు బాగానే ఉంది. కానీ మధ్యలో ఓ అక్షరాన్ని మింగేస్తే ఎట్లా? (4)
3.  మేరిమాత కొలువున్న తమిళనాడులోని దివ్యక్షేత్రం. (4)
6. రేణుకా సహానీ భర్త పేరు చివర (2)
8. ధ్వజస్తంభం (3,3)
9. బహిరంగ స్థలాలలో ప్రదర్శించే కళారూపము. బయలు నాటకం. (6)
10. పసరువన్నె కల పాము. బేసి కానిదాన్ని కడుపులో దాచుకుంది. (4)
11. ఖడ్గదార బంకమన్నుతో కలిస్తే ములుగు జిల్లాలోని ఓ గ్రామం అవుతుందా? (3)
13. బోల్తా కొట్టిన పెడెస్ట్రియన్ (4)
15. తమరిని, వారిని (3)
18. బయానాతో మొదలై భార్యతో ముగిసే బురదగుంట (4)
19. లోలోపల మాంసము లేదు. (2)
20. పుష్పలావిక (4)
21. లిటరల్ గా “ఆ రోజులు” (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మార్చి 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 52 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 మార్చి 12 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 50 జవాబులు:

అడ్డం:   

1.అరపది 4. ఇభయాన 7. ఈరువు 9. వరపుత్రులు 10. లక్ష్మీవారము 11. గునిసె 13. ఉడుపు 15. ఊడుచు 17 ఋషి 18. రత్నమాలిక 19. ప్రోది 20. తంపము 22. ముభ్రఅ 25. ఏదుము 28. లబ్ధిదారుడు 29. సుగుణ మణి 30 పువ్వారు 32. ర కో ము పా 33. భక్షకుడు

నిలువు:

1.అరువది 2. పసుపుతాడు 3. ఆరు 5. భగవానుడు 6. నక్తముఖం 7. ఈలుగు 8. వులసె 12. నిజామాబాదు 13. ఉషితం 14. పురము 15. ఊకము 16. చుప్రోఅ 21. పరదాహము 23. భ్రమణకాంక్ష 24. ఎలపార 25. ఏడుపు 26. ముసురు 27. ఐణికుడు 31. వ్వాయి ‌‌

‌‌నూతన పదసంచిక 50 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పార్వతి వేదుల
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here