నూతన పదసంచిక-58

0
7

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఫర్మానా (3)
3. దీపస్తంభము మధ్యలో లక్ష్యం (3)
5. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారము నీరుచురుకు వంటిది. (3)
7. ప్రేమసాగరంలా సర్దుబాటు చేసుకుంటే వంటలో వాడే ఒక దినుసు కనిపిస్తుంది. (5)
9. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ల కాంబినేషన్లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా సినిమా. (5)
11. తక్కువ జాతి ప్రజలంటూ కించపరిచేందుకు వాడే పదప్రయోగం (5)
12. వెంకటేష్, నగ్మా, సుమన్ల కాంబినేషన్లో వచ్చిన రవిరాజా పినిశెట్టి సినిమాలో రెండో అక్షరం ఎగిరిపోయింది. (5)
14. ఓర్వలేనితనము (5)
15. ఇతర దేశాల బ్యాంకులలో డబ్బు నిల్వ చేసుకునేందుకు తెరిచే పద్దు (3,2)
16. జానమద్దివారు కాకపోతే ఇంద్రగంటివారు. (5)
19. ధనుర్మాసం (5)
22. నూలు వడికే స్పిండిల్. దీనిలో తిక్కుంది (3)
23.  ఈ చట్నీని గోంగూరతో చేస్తే పడిచచ్చేవారు బోలెడు (3)
24. కుసూలము వంటి పెద్దబాన (3)

నిలువు:

1. రూపరాగములోని ధూళి (3)
2. చంద్రమాత (3)
3. అనారోగ్యము. సాధారణంగా నష్టాలతో నడిచే పరిశ్రమలకు ముందు ఈ విశేషణం వాడుతారు. (3)
4. రుచి, రంగు, వాసనలలో మనోహరమైనది. (3)
5. రేసుగుర్రంలో అల్లు అర్జున్ ప్రకాష్ రాజ్‌కు చూపించింది. (3)
6. అడ్డం 22 గుణింతాలను మారిస్తే వచ్చే తరాజు (3)
8. ఇక్బాల్ పాట రాకేశ్ శర్మ నోట (2,3,2)
10. కాకతీయ రాజు. రుద్రమదేవికి తండ్రి. (4,3)
11. కొవ్వు (3)
13. లిస్టు (3)
16. కుంపటి (3)
17. చెరువులో ఎక్కువైన నీళ్లు పొర్లి పోవడానికి కట్టకు పల్లంగా ఏర్పరచిన రాతి కట్టడం (3)
18. ప్లాస్టరును తెనుగీకరించడంలో వచ్చిన తంటా. క్రింది నుండి పైకి. (3)
19. గేటు (3)
20. పొదరిల్లు (3)
21. కృష్ణసతి (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 18 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 58 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 23 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 56 జవాబులు:

అడ్డం:   

6.హేమలతా లవణం 8. పాచిక 10. రీధావి 12. మురుమురాలు 13. బిరుదు గద్య 14. ఆగమాగము 17. అపాత్రదానం 20. కావున 21. స ర గి 22. సేవాపరాయణుడు

నిలువు:

1.సహేతుకము 2. బలహీనులు 3. కులకశిబి 4. ప్రాణం ఖరీదు 5. త్రాచుపాము/నల్లపాము 7. విలువిద్య 9. చిరునగవు 11. ధా గ జ దా ర 14. ఆకారము 15. మానవ సేవ 16. మున్నీటి పట్టి 17. అసహాయత 18. త్రసరేణువు 19. నంగి మాట ‌‌

‌‌నూతన పదసంచిక 56 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకి సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • సునీతా ప్రకాశ్
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here