నుదిటిన నా జీవనధారవై

0
10

[డా. బి. హేమావతి రచించిన ‘నుదిటిన నా జీవనధారవై’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]నురాగంతో
నా పెదవులు నిన్ను పిలుస్తున్నాయి
ఊపిరిలో ఊపిరిగా
నీ దరికి చేరాలని
అమృతం కురిసిన రాత్రి
నక్షత్ర లోకాన్నే మథించాలని
నా కన్నులలో నిన్నే నిలుపుకోవాలని
నీ పై నా హృదయాన్ని నిలిపి
అమృతాన్ని గ్రోలాలని
ఓ అమృతపు చినుకై నీవు..
నా నుదిటిన నా జీవనధారవై
రావా నా ప్రియతమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here