నువ్వెంతో ప్రియమైన దానివి!

0
12

[ప్రముఖ కొరియన్ కవి కిమ్ యోంగ్-తాక్ రచించిన ‘You are so lovely’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Korean poet Kim Yong-taek’s poem ‘You are so lovely’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ఒ[/dropcap]కానొక వసంత కాలపు రోజున..
నీ మీది ప్రేమ ఉప్పొంగిన క్షణాల్లో..
నా ఇంటి పెరట్లో చీకటి పరుచుకున్న సాయంకాలంలో..
వెదచల్లబడిన సూర్య కాంతిని చూసాను!
అక్కడ.. అంధకారంలో నిలబడి ప్రణయాగ్ని వైపుగా
మంద్రమైన గొంతుతో నువ్వు నన్ను పిలిచావు.
అచ్చం ఒక అడవి పుష్పంలా ఎంత వింతగా నవ్వావని?
ఉజ్వలంగా మెరిసిపోయే వెలుగులో నా ముందు నిలబడ్డావు..
నీలాంటి మనిషిని కేవలం చీకట్లలోంచి
నడిచిన మనిషి మాత్రమే తయారు చేయగలడు!
అసలు నీ గురుంచి ఆలోచించే క్షణాలు ఎంత మధురమైనవని?
ఎలా చెప్పను.. నువ్వు నాకెంతో ప్రియమైన దానివని!
నిజం.. నువ్వు నాకు చాలా.. ప్రియాతి ప్రియమైన దానివి సుమా!

~

మూలం: కొరియన్ కవి కిమ్ యోంగ్-తాక్

అనువాదం: గీతాంజలి


కిమ్ యోంగ్-తాక్ ప్రముఖ కొరియన్ కవి. ప్రకృతి, వ్యవసాయమన్నా అమితమైన ఇష్టం. ఉపాధ్యాయుడిగా పని చేశారు. Seomjingang River; A Clear Day; Sister, the Day is Fading; The Road to Flower Mountain; Longing for a Flower Letter; Your Daring Love; However Crooked the Stage, Let’s Play the Drum Right;  A Small Village వంటి సంపుటులను వెలువరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here