ఓ పిల్లా

4
11

[dropcap]ఓ[/dropcap] పిల్లా
ఆ రోజు ‘జూ’ లో
ఈ రోజు ‘షో’ లో
అతను నిన్ను చూసి
కన్ను కొట్టాడంట
తెలుసా నీకిది తెలుసా..!
~
కారు బంగళా కొంటా
తనను కొంటా
విన్నావా అతడి మాటలు
నువ్వు అంగడి సరుకా
అమ్ముడు సరుకా..
~
బలే వుందిరా పిట్ట
పిట్ట చూసి పక్కున నవ్వింది
పిచ్చి పట్టిండి పిల్లాడికి
మాటలు కోటలు దాటుతున్నాయి
నీకేమైనా తెలుసా..
~
ఆమె మాటలు నాకు
వేద వాక్యాలు
చిలిపి చేష్టలు
చిన్మయానందాలు
వలపు వాసంతం
ఆమె సాంగత్యం
నాకో స్వర్గం
ఎవరామె! నువ్వేనా?
~
ఓ పిల్లా
నీ ప్రేమను పొందే భాగ్యం
నాకు లేదా?
అందుకే వెళ్ళిపోతివా
మరో ప్రపంచమునకు
~
ఓ పిల్లా
నీ ముఖాన్ని
చంద్రబింబంతో పోల్చుకొన్న
అందుకేనేమో నీ మనసులో
అన్ని గోతులు గొయ్యలు
~
అందం అంది
మనది బంధం అంది
ఆశగా నన్ను అందుకొంటూ
అన్నా అంది
ఆమె నను అలానే అంది
తెలుసా నీకు.
~
ఓ పిల్లా
నీ గుండెల్లో
రగులుతున్న అగ్నికి
నువ్వు ఆహుతి అవుతూ
నవ్వుతున్నావేం? నవ్విస్తున్నావేం?
ఆత్మవంచన చేసుకొంటున్నావేం?
~
పువ్వు వికసించింది
వయసు ఉరకలేసింది
కోరిక తీరింది
కొన్ని క్షణాల సుఖం కోసం
జీవితాంతం దుఃఖం
నీకు అర్థం అవుతోందా..!
పిల్లా! ఓ పిల్లా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here