ఒక ఆశ మౌనంగా…

0
7

[dropcap]ని[/dropcap]శ్శబ్దాలు పల్లవించే
ఆ క్షణాలు చాలు
యుగాలు వసంతమై పూయడానికి

నీవేమీ అనవు
నేనేమీ వినను
అయినా ఒక మౌన సంభాషణ
నీలోనూ, నాలోనూ

అలలై గాలివాలున ప్రవహించే
నీపాట చాలు
గుండె సడి తీయని రాగమై పలికేందుకు

మబ్బులు ముసిరిన ఆకాశం లోనూ
ఆ ఒక్క ధవళ వర్ణపు చార చాలు
చీకటి వెనుకా వేచి
ఒక ఆశ నీలా ఉంటుందనేందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here