ఒక కుదుపు కుదిపిన కోవిడ్-19

0
8

[dropcap]అ[/dropcap]మెరికాలో లాక్‍డౌన్ తీసివేస్తే మరో 2,30,000 మరణాలు సంభవించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్‍లోని కొందరు ‘హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్ రెజిలెన్స్ ఏక్ట్’ ప్రతిపాదనను తీసుకొని వచ్చారు. సెనేటర్స్ డేవిడ్ పెర్‍ద్యూ, క్రిస్‍కూన్స్, టాడ్‍యంగ్ ఈ బిల్లును స్పాన్సర్ చేస్తుండగా డెమొక్రెటిక్ పార్టీకి చెందిన డిక్ డర్బిన్ కో-స్పాన్సరర్‍గా ముందుకు వచ్చారు. తాత్కాలిక వీసాలపై పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్-19ని నిరోధించడానికి జరుగుతున్న పోరులో తమ సామర్థ్యాలను సేవలను వినియోగించలేకపోతున్నానని ఆ కారణంగా కోవిడ్ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకోలేకపోతున్నారన్న వాదనతో ఆయన బిల్లును సమర్థిస్తున్నారు.

అమెరికాలో వినియోగంలో లేని ఇమ్మిగ్రెంట్ వీసాదారుల సేవలను వినియోగంలోనికి తీసుకొని రావాలన్నది ఈ ప్రతిపాదిత బిల్లు లక్ష్యం.

అమెరికా ఆరోగ్య సంరక్షణ రంగంలో 16% మించి విదేశీ సేవలే. అయితే ఇక్కడ ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా కఠినమైనవి. ప్రతి సంవత్సరం ఒక లక్షా నలభైవేల గ్రీన్ కార్డులను పక్కన పెడుతూ ఉంటారు. వాటిలో 7% దేశీయంగా కేటాయించబడినవి. వినియోగంలో లేని ఇమ్మిగ్రెంట్ గ్రీన్‍కార్డుదారులలో/వీసాదారులలో సుమారు 25000 మంది నర్సులు, 15000మంది డాక్టర్లు ఉన్నారు.

H1B వీసా (నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా) స్టాటస్ కారణంగా ఉద్యోగాల్లో తమను రిక్రూట్ చేసుకున్న సంస్థకు వెలుపల సేవలనందించడానికి వీలుపడదు. కారణం వారి కుటుంబాలన్నీ H-4 డిపెండెంట్ వీసాదారులుగా పరిగణించబడతారు. ఆ కారణంగా ‘H1B’ వీసాదారులు కోవిడ్-19 సేవలకు తరలితే వారి కుటుంబ సభ్యులు అమెరికాను వదలిపెట్టి ఇండియాకు మరల వలసి ఉంటుంది.

అయితే ఆరోగ్య రంగ సంరక్షణ సిబ్బందికి సంబంధించి పెండింగ్‍లో పెట్టిన వాటిని కాక మిగిలిన పెండింగ్ గ్రీన్‍కార్డుల నుండి కోవిడ్-19 సేవలకు తరలించబడే వైద్యసిబ్బంది కుటుంబాలకు ఇవ్వాలన్న సూచన ఉంది.

ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అందినన్ని వైద్యసేవలను కరోనా నియంత్రణలో ఉపయోగించుకోవాలన్నది అమెరికా లక్ష్యం. కాగా ఫ్లాయిడ్ మరణంలో కధ అనుకోని మలుపు తిరిగి పౌర సమాజం దృష్టి ప్రస్తుతానికి కోవిడ్-19 నుండి పక్కకు మరలడం రాజకీయ నేతల అదృష్టమో దురదృష్టమో రానున్న ఎన్నికలే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here