“ఒక యువకళాకారుడి ఆత్మగీతం” ఆవిష్కరణ సభ

0
13

[dropcap]అ[/dropcap]నువాదమో కళ.. అందరివల్ల సాధ్యమయ్యే ప్రక్రియ కాదది. సాధనచేస్తే కానీ అలవడని క్రియ. అందులోనూ ఆ అనువాదం ‘యులిసిస్’ రాసిన ‘జేమ్స్ జాయిస్’ అంటే మరీ క్లిష్టమూ సంక్లిష్టమూనూ…

దాదాపు రెండేళ్లుగా ధారావాహికగా వెలువడుతూ వస్తున్న జాయిస్ నవల ‘A portrait of a young man as an artist’ తెలుగులో ‘ఒక యువకళాకారుని ఆత్మకథ’ గా వెలువరించారు రచయిత శ్రీ చింతపట్ల సుదర్శన్.

ఆ పుస్తకావిష్కరణ జూలై16వ తేదీ సోమవారం నాడు హైదరాబాదులో ఆహ్లాదకరంగా జరిగింది… సభాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ రచయిత చింతపట్ల సుదర్శన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కవి శ్రీ శివారెడ్డి పుస్తకాన్నావిష్కరించి అనువాదంతోనే రచయిత సంపూర్ణ రచయితగా అవతరిస్తాడని సాహిత్య పునరుజ్జీవనానికి అనువాదానిదో కీలకపాత్ర అన్నారు.

ఈ పుస్తకాన్ని శ్రీ కె.వి.అశోక్ కుమార్, శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, కవి సిద్ధార్థ సమీక్షించారు. Stream of consciousness టెక్నిక్‌ని విశ్లేషించారు.

అనేకమంది కవులు రచయితలు హాజరై శ్రీ చింతపట్ల సుదర్శన్‌ని అభినందించారు. వందేళ్ళ కితం ఎంతో ఉన్నత ఆలోచనలను ప్రదర్శించిన ఈ నవలను ఈనాటి తరం చదవాల్సిన అవసరముందని వివరించారు.

పాలపిట్ట ప్రచురణల ద్వారా విడుదలైన ఈ అనువాదం రచనలోని సంక్లిష్టతను పాఠకుల ముందుంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here