స్వాతి కవితలు-2: ఒక్కసారైనా కనిపించవూ

0
10

[dropcap]ఓ[/dropcap] అద్భుత ప్రపంచమనే తలుపు తీసి
తాళంచెవి నాకు ఇచ్చి… తలుపు మూసి
నువ్వెటో వెళ్ళిపోయావు.
ఎదురు చూసి ఎదురు చూసి
లోపలున్నావేమో నన్న ఆశతో
తాళం తీశా. ప్రతీ గదిలోనూ
పరీక్షగా వెదుకుతూనే వున్నా.
ముందుకి నేనడుస్తూంటే –
వెనుకనే గదులన్నీ మూసుకుపోతున్నాయి.
ఏం జరుగుతోందో తెలియని వేదనలో
కనిపించిందో కిటికీ!
పరుగు పరుగున వెళ్ళి
వూచల మధ్యగా వెదికా, నువ్వున్నావేమోనని.
ఒక్కసారైనా కనిపించవూ. పోనీ
నీ శ్వాసల సవ్వడినైనా వినిపించవూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here