ఆన్‍లైన్ ఐశ్వర్య బిజీ

0
9

[dropcap]సూ[/dropcap]ర్యోదయాన్నే పనులు ముగించుకుని పిల్లల చదువు కోసం రెడీ అయ్యింది.. పిల్లలు బాగా చిన్న వయసు కవలలు కాక పోయినా అలాగే ఉంటారు. ఐశ్వర్యకి వంట పని, ఇంటి పని ఉండదు. అన్ని ఇంట్లో అత్తగారు, తల్లి చూస్తారు. మేనత్త కొడుక్కి ఏరి కోరి చేశారు. ఇంట్లో పిల్లలను అమ్మమ్మ మామ్మ కూడా ప్రాణంగా చూస్తూన్నారు. భార్యాభర్తలు కూడా బాగా చదువు కున్నారు.

పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడకుండా ఎవరూ ఎదగరు. తల్లి తండ్రి రెండు చేతులా సంపాదించినా వాళ్ళ చదువు విషయంలో ఎంతో కష్టపడాలి. అప్పుడే వారికి ఒక దారి.

ఆన్‌లైన్ చదువులు వచ్చాక తల్లులు కూడా పిల్లలతో రెడీ అవ్వాలి. ఒక్కో పిల్లకి ఒక్కొక్క టైమ్ ఉంటుంది. వాళ్ళ టైమ్‍కి రెడీ అవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్ తొందరగా రెడీ చేసి పిల్లలకి పెట్టి అత్తగారికి, మామగారికి పెట్టీ; భర్తకు హాట్ ప్యాక్‍లో సర్ది ఉంచి పిల్లల క్లాస్‍కి రెడీ చేసింది. ఇంట్లోనే పని అయినా సరే అత్త భర్త మామ పని తనే చూస్తుంది. అన్ని చేసుకుని పిల్లలని ఆన్‌లైన్ క్లాస్‍లో కూర్చో పెడుతుంది. కూడా ఉండి అన్ని చూసుకుంటుంది.

ఎనిమిది ఏళ్ల కావ్య, ఆరు ఏళ్ల శ్రావణ్ ఇద్దరు కూడా ఆన్‌లైన్ చదువులకు రెడీగా కూర్చుని ఉన్నారు. ఇది ఒక ఉద్యోగం మాదిరి రెడీ అవడం ఐశ్వర్య వంతు ఐయ్యింది. కాలం ప్రకారం ఉద్యోగంలో మాదిరి వంట వార్పు చేసి రెడీ అవుతోంది. పెద్ద వాళ్ళని శ్రమ పెట్టడం ఇష్టంలేక పిల్లల పనులు తనే చూసుకుంటుంది.

కాలం మారింది. గతంలో కేవలం హోమ్ వర్క్ చేయించే తల్లి లేక తండ్రి క్లాస్‍కి వెళ్లి వాళ్ళతో పట్టు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంజినీర్ చదివిన ఐశ్వర్య పిల్లలతో పాటు అక్షరాలు పదాలు అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. స్కూలుకి ఫీజు కడుతు మళ్లీ పిల్లలతో చదువుకునే పరిస్థితి వచ్చింది. అమ్మలకి ఇంటిపనితో పాటు పిల్లల స్కూల్ వర్క్ ఎక్కువ.. ఏమిటో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక అసలు ఖాళీ లేదు.

పెద్దవాళ్ళ సంగతి కూడా అనవసర పని అయ్యింది. ఉదయం సూర్యుని పరుగుతో సమంగా, గడియారం ముల్లుతో సమంగా ఐశ్వర్య పరుగు ఉంటుంది. పెద్దవాళ్ళు చూసి నవ్వుకుంటారు. “నీకోసం మేము ఇంత హైరానా పడలేదు, ఎంతో గారంగా పెంచేము. ఐనా నువ్వు పెద్ద చదువు చదవలేదా? వాళ్ళు చదువు కుంటారు” అంటారు.

“అలా కాదు నాకు ఇంగ్లీష్ ఏమి మాట్లాడటం అంతగా రాదు. అందుకే నా పిల్లలు బాగా చదువుకోవాలి. బాగుండాలి. అందులో నాకు ఆనందము ఉండాలి అనుకుంటున్నాను” అంటుంది.

“మేమూ అంతేగా నీకోసం ఎన్ని తిప్పలు పడ్డాము. పెద్ద చదువు లేకపోతే పెళ్లి కాదు. పెళ్లి అయినా, ఈ రోజుల్లో భర్త మంచివాడు అయితే అత్తింటి వారు ఏదో రక రకాలుగా భాధలు లేక ఆంక్షలు పెడతారు. ఇలా జీవితములో మన ఇష్టాయిష్టాలు లేక ఆ ఇంటిలో ఐదు నిమిషాలు కూడ సొంత అలోచన చేస్తే వాళ్ళు వప్పుకోరు సంత గా మారి పోతుంది. వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది” అంది భాగ్యం.

ఐశ్వర్య తల్లి భాగ్యం గతం లోకి వెళ్ళింది.

ఐశ్వర్య, శ్రీనివాస్ ఇద్దరు పిల్లలు. వాళ్ళని స్కూల్‍కి పంపడం చదివించడం ఒక మహా యజ్ఞం అయ్యేది. ఇంట్లో పిల్లలని అంతా గారం చేస్తూ ఉండేవారు.

భాగ్యం ప్రైవేట్ కాలేజీలో చేరింది. కారణం భర్త మోహన్ రాయ్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ ఆఫీసర్. ఎక్కడో విజయనగరంలో చదువు అవగానే కాలేజ్ లెక్చరర్స్ టెస్ట్ రాసి సెలెక్ట్ అయ్యి జాబ్‍లో చేరింది.

పదేళ్లు సర్వీస్ అయ్యింది. ఈలోగా ఎన్నో పెళ్లి సంబంధాలు చూశారు కానీ ఒక్కటి కుదర లేదు.

దగ్గరి సంబంధాలలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు తక్కువ. చూస్తూ చూస్తూ పూర్తిగా ఉద్యోగం లేని వాళ్ళూ, పోని చదువు ఉన్నా పర్వాలేదు అంటే – అదీ కష్టం అయ్యింది. ఇంకా మరో ఐదు ఏళ్ళు వెతికి వెతికి పట్టుకొని ఆఫీసర్‍నీ చూశారు. అయితే ఉద్యోగం మానెయ్యమన్నారు. ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి అంటే, పాత సర్వీస్ వదిలేసి కొత్తగా జాబ్‍లో చేరాలి అన్నారు. సరే ముందు పెళ్లి అయ్యాక అవసరం అంటే చూద్దాము అంటూ పెళ్లి ఖాయం చేసారు. పోనీ ఇంకా చూద్దాము అంటే ఇప్పటికే నలభయి దగ్గర చేరింది. ఇంటి వాళ్ళు ఎంత సంపాదించే పిల్ల అయినా స్వతంత్రంగా బ్రతకనివ్వరు. ఆడ పిల్లకి పెళ్లి తప్పదు అంటారు.

అలా భాగ్యలక్ష్మి పెళ్లి జరిగి ఉద్యోగం వదిలి భర్త వెంట వేరే జిల్లాలో కొత్త సంసారం మొదలు పెట్టింది. ఇంట్లో అత్త ఆడపడుచులు ముగ్గురు ఒక మరిది ఉన్నారు. అంతా కలిసి ఉండేవారు.

చదువుకున్న పిల్ల అంటూ మాటిమాటికీ ముక్తాయింపు అనాలా సతాయింపు అనాలో తెలియదు.

అయ్యో, చదువుకున్న పిల్లవి, ఆ మాత్రం రాదా అనేవారు ప్రతి విషయానికి, చదువు ఉద్యోగం ఒక ప్రశ్నగా మారింది. ఇద్దరు పిల్లల్ని కని పెంచుతుంటే ‘నీకు పిల్లలకి పెంచడం రాదు. నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళు. ఈ ఊళ్ళో ప్రైవేట్ కాలేజ్ ఉన్నది. అందులో జీతం ఎక్కువ రాదు కాని నీ జీవితానికి కొంచెం ఊరట కల్గుతుంది. హాయిగా ఉద్యోగం చేస్తూ సీతాకోకచిలుక మాదిరి ఎగిరే మనస్సు. కుటుంబ బాధ్యతలలో ఇమడలేక పోతున్నావు కనుక పిల్లల్ని మాకు నచ్చినట్లు పెంచుతాము’ అని ఒక వార్ డిక్లేర్ చేశారు. ఇంకా చేసేది ఏమిటి?

బుద్ధిగా ఉద్యోగంలో చేరి మనసులో అవేదనున్నా ఆనందపడింది. చదివిన చదువుకు న్యాయం చేస్తున్నాను అనుకుంది. భగవంతుడు ఇలా అవకాశం ఇచ్చాడు అని తృప్తి పడింది.

స్త్రీకి స్వతంత్ర భావాలు పనికి రావు. అయినా ఆ ఇంటికీ వంశం ఇవ్వడానికి వచ్చింది కనుక పిల్లల పెంపకం వారు ఇష్ట ప్రకారమే జరగాలి. ఇది ఒక ప్రత్యేక పద్ధతిగా ఉన్నది. అలా భాగ్యం పిల్లల పెంపకంలో భాధ్యత లేకుండా పిల్లలు ఇద్దరు పెరిగారు. ఐశ్వర్య, శ్రీనివాస్ ఇద్దరు ఇంజినీర్స్ అయ్యారు.

కొడుకు కర్ణాటక వెళ్లి అక్కడ ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. పిల్లాడు నెమ్మదితనం చూసి పిల్లనిచ్చి పెళ్లి చేసి అక్కడే ఉంచారు. కలిసి వచ్చిన అదృష్టాన్ని ఎవరు వద్దంటారు. చదువు, తెలివి మాత్రమే మన సొంతము.

పెళ్లి మన చేతిలో లేదు. ఎంత తెలివైన వారు అయినా వెళ్ళిన అత్త ఇంటి వారు స్వభావాన్ని బట్టి జీవితం ఉంటుంది. ఎంత తెలివి అయిన వారైనా పెళ్లి తరువాత విధి చేతిలో కీలబొమ్మగా మారుతారు.

***

ఐశ్వర్య చదువు కాగానే పెళ్లి చెయ్యాలి. తల్లిలా ఉద్యోగంలో ఉంటే పెళ్లి పక్కన పెట్టుకోవాలి. అలా స్వతంత్ర భావాలకి పెంచకూడదు. ఈ విధానం ఎప్పటికీ మారదు. మనువు చెప్పిన సూత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడదానికి రక్షణ కవచాలు అని కొందరు పెద్దలు చెపుతారు. ఇంకా ఇంకా చెపుతూనే ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు ఎదురు చెపుతారు?

లోకో భిన్న రుచి అభిరుచి. అంతేగా అంతేగా అనాలి.

ఏదైనా అంటే పెద్ద వాళ్ళం మేము చెప్పింది విను అంటారు.

ఐశ్వర్య అలోచనలో పడింది. పిల్లల చిన్న చదువు పెంపకంలో పడి సబ్జెక్ట్ అంతా మరచి పోయింది.

ఈ విచిత్ర పరిస్థితులు చూస్తుంటే మళ్లీ తను పిల్లలతో చదువుకుంటూ కూర్చుంటుంది

ఇప్పుడు పిల్లల చదువుతో అవే గుర్తుకు వస్తునాయి. ఏమీ చెయ్యాలి వీళ్ళు ఐదవ తరగతి వరకు ఇంతే అనుకున్నది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసే స్త్రీలు పిల్లల చదువు విషయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చేవి కానీ ఉద్యోగం లేని స్త్రీలు కనుక పిల్లలతో పాటు చదువుకుంటున్నారు.

స్త్రీకి రెండు విధాల సమస్యలు? ఎలా ఇంకా ఎదగాలి?

మళ్లీ ఈ పిల్లలకోసం ప్రత్యేక యాప్‍లు వచ్చాయి ఎందుకంటే ఈ పిల్లలు శ్రద్ధగా కూర్చుని వినలేరు కదా అందుకని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ యాప్ ద్వారా పాఠాలు వినేలా కొన్ని కంపెనీలు విద్యకి సంభందించిన యాప్‍లు పెట్టారు. అందులో నెలకి కొంత ఫీస్. ఐదు ఏళ్ళకి ఒక సారి ప్యాకేజి ఉంటుంది. అయితే ముఖ్యంగా నెలవారీ ఫీస్ కట్టి చెప్పించ వచ్చును. కొన్ని కంపెనీలు పిల్లల కోసం ఎన్నో రకాల ఫెసిలిటీలు ఏర్పాటు చేశాయి. అయితే దానికి చాలా డబ్బు కట్టాలి అంతా కన్నా దగ్గర ఉండి తను కష్టపడి చదివించడం మంచిది అనుకున్నది.

ఎన్నో రకాల విద్యలకు ఎన్నో బిజినెస్‍లు ఈ రోజుల్లో పిల్లలకి చదువు నేర్పించడం మహా కష్టంగా ఉంది. స్కూల్‍లో అయితే పిల్లలతో పాటు కలిసి ఆడుతూ పాడుతూ చదువుకునేవారు. ఈ జూమ్ పాఠాలు వచ్చాక చదువు కోవాలంటే పిల్లలు కొంత సేపు మాత్రం జూమ్‍లో ఉంటున్నారు. విసుగు చిరాకు కోపం అల్లరి అన్ని చేస్తూ తల్లికి కూడా వినకుండా పరుగులు. పిల్లలు పెంకి పిల్లలుగా ఉన్నారు. తల్లులు కొందరు తండ్రులు కొందరు ఇంకొందరు పెద్ద వయస్సు వారు ఎన్నోరకాల భాధలు పడుతూ పిల్లలను చదివిస్తున్నారు.

ఇలా ఎంత కాలం పిల్లలకి చదువులు నేర్పాలి అన్నది ప్రశ్న. ఈ రోజుల్లో కూడా చదువు రాని తల్లి తండ్రులు ఉన్నారు. చదువు వచ్చినా బాగా టెక్నాలజీ రాని వాళ్ళకి చాలా కష్టంగా ఉంది.

గతంలో క్యారేజిలు సర్ది రిక్షా ఎక్కించి లేక ఆటో ఎక్కించి పంపడంతో సరి. కానీ ఇప్పుడు తల్లులు అంతగా చదువు రాని తల్లులు ఎంతో కష్టపడుతూ చదివిస్తున్నారు.

పిల్లలతో పాటు పాఠాలు చదువుతూ మళ్లీ కొన్ని క్లాసులు చదివే అవకాశం వచ్చింది. వాళ్ళ చదువు టైంలో సరిగ్గా చదువు కొక పైనా ఇప్పుడు పద్ధతిగా చదువుకుంటున్నారు

ఇది ఒకందుకు మంచిది అవవచ్చును కానీ ఉద్యోగాలు చేసే వారికి చాలా ఇబ్బంది. అమ్మ చదువు విషయంలో మళ్లీ కొత్త బాణీ వచ్చింది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్న నానుడి విషయంలో ఇల్లాలి చదువు పిల్లల జీవితాలకు వెలుగు అని తెలుస్తోంది ఇప్పటికీ అదే సూత్రం వర్తిస్తు ఉన్నది.

మరి అమ్మ చదువు దేశానికే వెలుగు.

ఇలా ఆలోచించి రెండు ఏళ్ళు పూర్తి ఆన్‌లైన్ చదువు మూడో ఏడు కొంత స్కూల్ కొంత ఆన్‌లైన్ చదువు ఇలా సాగింది.

ఈ అనుభవంతో ఐశ్వర్య ఆన్‌లైన్ బిజినెస్ మంచిదేమో అని ఆలోచించి చదివిన విద్య పక్కన పెట్టింది. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల డ్రెస్సులు, నాన్న కాంప్ లకు వెళ్లి తెచ్చేవాడు. కొత్త రకం బట్టలు రకరకాల మోడల్స్ ఇష్టమే. చాలా డబ్బు పోసి కొంటూ ఉండేవారు. అందుకే ఆడవాళ్ళ ఐటమ్స్ ఐతే బాగుంటుంది అనుకున్నది

ఆ వెంటనే భర్తకు చెప్పింది ఇల్లు కదలకుండా చేసే బిజినెస్ కదా ఎంత అవుతుంది అన్నది. చూసుకుని మన మినిస్టర్ గారు చేత ఓపెన్ చేయిద్దాము అన్నాడు. భర్త ఇంత తొందరగా ఒప్పుకున్నాడు అని సంతోష పడింది.

భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలు మిగిలి ఉండటానికి కారణం స్త్రీలు కుటుంబ భాద్యతలు తెలుసుకుని ప్రవర్తించడమే ముఖ్య కారణము. విద్యావంతులైన స్త్రీలు భాద్యతలు సమర్థవంతంగా చూడటమే.

ఒక టీచర్ దగ్గర మిషన్‍తో దుస్తుల తయారీ పాతిక వేలు పెట్టి నేర్చుకున్నది. ఇంకో టీచర్ దగ్గర మగ్గం వర్క్ పూసలు అద్దాలు ఎంబ్రాయిడరీ వర్క్ ఇత్యాదివి నేర్చుకున్నది.

ఇవ్వాళ పిల్లల పరికిణి జాకెట్‍కి పదిహేను వందలు, రెండేళ్ల పిల్లకి. అదే పెద్దవాళ్ళు అయితే నాలుగు వేలు చెప్పారు. అన్నిటికన్నా ఇలా ఫ్యాషన్ టెక్నాలజీ వర్క్ బాగుంది అనుకున్నది.

హైదరాబాద్ వెళ్లి కళాంజలి ఇంకా షోరూమ్ లలో కొన్ని కొని తెచ్చుకున్నది. ముగ్గురు మగ వాళ్ళు, ఇద్దరు ఆడవారిని పెట్టుకున్నది. ఇంట్లోనే ఫ్యాషన్ వర్క్స్ బ్యానర్ మీద బిజినెస్ పెట్టుకున్నది.

పిల్లలని పంపేసి ఇంట్లో పెద్ద వాళ్ళ సహకారంతో సొంత బిజినెస్ పెట్టుకున్నది.

అయితే నేటి పండుగ సీజన్స్ లో షాపుల్లో ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఉచితాలు పెరిగిపోయాయి. అందుకని ప్రజలు షాప్స్ చుట్టూ వెడుతున్న రోజులు. భారీ డిస్కౌంట్ పెట్టారు, అంతేనా వెయ్యి కొన్న వాళ్ళకి రెండు వందలు తగ్గుతాయా లేదా పదివేలు కొన్నవాళ్ళకి వి.ఐ.పి సూట్ కేసులు లేదా వెండి కొయిన్ ఇవ్వడం లేదా పాతిక వేలు కొన్న వాళ్ళకి గ్రామ్ బంగారు బిళ్ళ లేక ఐదు వేలు డిస్కౌంట్ పెట్టారు.

మనుష్యులు ఎగపడి వెడుతున్న సమయము. ఇంటి దగ్గర ఎవరు కొంటారు ఇది ఒక ప్రశ్న.

ఆన్‌లైన్‍లో బట్టలు ఎక్కువ మక్కువగా ఉన్నారు. అందుకే కుట్టిన బట్టలు అన్ని తను కూడా ఆన్‌లైన్‍లో పెట్టాలి అనుకున్నది.

సూర్యోదయం మొదలు మనిషి జీవితంలో ఉచితాలు, తక్కువ ధరల చుట్టూ తిరుగుతోంది. ఉదయం మొదలు ఎన్నో అవసరాలు వెంట మనసు పరుగు పెడుతుంది, ఎన్నో కోరికలు సముద్రపు అలలు మాదిరి పరిభ్రమిస్తూ కెరటాలు వలె ఎగసి ఎగసి పడుతూ ఉన్నాయి.

ఒక ప్రక్క క్రిస్మస్, మరో ప్రక్క న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తున్న షాపులు ఎన్నో స్వాగత బేనర్స్ ఇతర ఆసక్తి కర ప్రకటనలు వైఫైలా అవారించి ఉన్నాయి. కళ్ళు మిరు మిట్లు కొల్పుతు ఉన్నాయి. అబ్బా అన్ని కొనాలి అనిపిస్తున్నాయి. మార్కెట్ అంతా విద్యుత్ దీపలంకరణ అద్భుతంగా ఉన్నది. చేతి రుమాలు, దుప్పట్లు, కర్టెన్లు, చీరలు డ్రెస్సులు ఎన్ని కొట్లో ఉన్నాయి.

మనుషులు డబ్బు కంటే కూడా కొత్త మోడల్‍కి విలువ ఎక్కవ ఇస్తున్నారు, గత ఏడాది కొన్న వస్తువులు ఈ ఏడాది మార్చేస్తారు. పాత బట్టలు అనాథ ఆశ్రమాలకు లేక పని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇటీవల కొన్ని సెకండ్స్ షాపులు వచ్చాయి. వాటిలో ఇవి ఒన్ ఫోర్త్ లేక హాఫ్ రేట్‍కి కోని త్రి ఫోర్త్ ధరకి అమ్ముతారు.

ఒక షాపుకి వస్తువులు కొనడానికి వెడితే అధి పెద్ద మాల్. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. దుబాయి నుంచి భర్త వచ్చి ఏడాదికి ఒకసారి అన్ని వస్తువులు కొనే వెడతారు. కొందరు ఆ తరహా మనుష్యులు ఎక్కువ అందులో ఉన్నారు.

ఐశ్వర్య వారిని ఆసక్తికారంగా చూస్తూ వారీ మాటలు వింటోంది. వాళ్ళ పిల్లలు అరు నెలల కన్న ఎక్కువ రోజులు కొనరని మరి కొన్ని ఆన్‌లైన్‍లో కొంటారు అని చెపుతుంది.

అయితే విదేశీ కజిన్ ఒకామె “చాలా బట్టలు ఉన్నాయి, అనాథ ఆశ్రమంలో ఇస్తాను చెప్పు” అంటే ఐశ్వర్యని కూడా పెట్టుకుని మల్లవరం, నిడదనోలు ఆశ్రమాలకి పట్టుకెళ్ళి ఇచ్చారు. అయితే అక్కడ ఆ విలువైన ఎంబ్రాయిడరీ సిల్క్ చీరలు కట్టే వారు ఎవరు లేరు. వాళ్ళు నూలు వస్త్రాలు, సామాన్య వస్త్రాలు ధరిస్తాము అన్నారు

మనసుకి అలోచన వచ్చింది. ఒకసారి ఒక డాక్టర్ భార్య కొన్నాళ్ళు కట్టిన పట్టుచీరలు పని అమ్మాయి చేత స్లం ఏరియాస్‍లో అమ్మడానికి పంపినట్లు మాటల్లో చెప్పింది.

మీరు ఆ చీరలు డ్రెస్‍లు కుట్టుకుని అమ్మవచ్చును, తక్కువ ధరకు అమ్మితే ఎక్కువ మంది కొంటారు. ఉచితానికి కాదేది అనర్హం అన్నట్లు చిన్న ఊళ్ళల్లో కూడా ఈ ఉచితాలకు అందరూ ఆకర్షితులు అవుతున్నారు. గొప్ప కబుర్లు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవడం, మాకు అన్ని విదేశీ వస్తువులు వస్తాయి, అసలు మేము స్వదేశీ బ్రాండ్ వాడం అంటూ ఇక్కడ తల్లి పిల్లలు డంబాలు చెప్పుకుంటూ గడిపేస్తారు

ఉచితాలు, తక్కువ ధరలు, సెకండ్స్, బహుమతులు వెంట మానవ జీవితాలు వెంట పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. మనిషికి కావాల్సినవి ఖరీదయిన వస్తువులు. ఖరీదయిన జీవితం కోసం వెంపర్లడటం కనిపిస్తుంది కర్చీఫ్ మొదలు కరెంట్ కుక్కర్ వరకు బ్రాండెడ్ ఐటమ్స్ డిస్కౌంట్‍లో దొరకడమే.

మంచి తనం మానవత్వం విలువలు మరుగున పడి మంచు దుప్పటి మబ్బు రగ్గు వెనకాల మిగిలి పోయాయి. బంధాలు, అనుబంధాలు మసక మసకగా మంచు తెరల వెనుక మిగిలి పోయాయి.

ఎలా సంపాదిస్తారు? ఎలా బ్రతుకుతారు? అన్న ఆలోచన లేక పిల్లలు పెద్దలంతా కూడా ఖరీదయిన జీవితం కోసం అర్రులు చాచుతున్నారు. అందుకే ఈ తరహా ఉచితాలు సామాన్యుల జీవితానికి ఎంతో ఆనందాలు.

అలా షాపింగ్‍కి వెళ్ళడం వల్ల ఐశ్వర్యలో ఎంతో మార్పు వచ్చింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాక ఒక ఆలోచనకి వచ్చింది.

కొన్ని రకాల సిల్క్‌లు, కాటన్ వస్త్రాలు కొని పిల్లల ఆదులకి కుట్టి అమ్మకానికి పెట్టింది.

ఆ డాక్టర్ భార్యలో ఏమి మార్పు వచ్చిందో పాత చీరలు అమ్మడం మాని బట్టలు కుట్టించి అనాథ పిల్లలకి ఇస్తోంది. పాత చీరలు చక్కని అందమైన బొంతలు కుట్టించి ఆశ్రమాలకు పంపడం ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది. వ్యర్థ పదార్థాలను ఉపయోగకరంగా మార్చి వాడగలిగే సలహా ఐశ్వర్య డాక్టర్ భార్యకు ఇవ్వడం వల్ల ఈ మంచి మార్పు వచ్చింది. పూర్వ జన్మ పుణ్యం వల్ల మంచి జీవితం వచ్చింది ఈ జన్మలో కూడా పుణ్యం చెయ్యాలి కదా అన్న మాటలు బాగా పనిచేశాయి. మనిషి తోటి మనిషికి సహాయం చెయ్యడంలో కొంత కృషి చెయ్యాలి.

ఐశ్వర్యా భర్త మాత్రం “ఈ బిజినెస్‍లు లాభాలు అంటూ పరుగు పెట్టలేను, నేను ఒక కంపెనీలో యాభయి వేలకి జాబ్‍లో చేరి వేళ పట్టుకు తిని వచ్చిన దానితో తృప్తి పడతాను” అన్నాడు

“ఇద్దరం అలా అనుకుంటే ఎలా? నా బ్లడ్ లోనే బిజినెస్ జీన్స్ ఉన్నాయి. నేను మాత్రం ఈ వస్త్ర బిజినెస్‍లో రోజు కూడా వస్త్ర ప్రపంచంలో ఆనందంగా జీవిస్తూ నా పిల్లలకి మంచి న్యూ ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలి” అంటూ తన దృఢ నిశ్చయాన్ని తెల్పింది.

పిల్లలు ఇంటర్‍కి వచ్చే సరికి ఆన్‌లైన్ వ్యాపారంలో బిజీ అయిపోయింది. సినిమా, టివి రంగం వారు ఐటమ్స్‌ని ఇష్టంగా కొంటారు. అది ఆమె నిరంతర కృషి అని చెప్పాలి. కానీ ఐశ్వర్య మాత్రం తన ఆలోచనకి అదృష్టం ఎంతో తోడు అయ్యి విజయంగా మార్చింది. విమర్శలు మాత్రం తప్పవు కదా మరి.

బంధువుల్లో మాత్రం అంతా బీటెక్ చదువుకుని బట్టలు కుట్టించే టైలర్ వ్యాపారమా అంటూ ఎద్దేవా చేసేవారు. కుటుంబం లోంచి బయటకు రావడానికి అందరూ ఇష్టపడరు. అందుకే క్రియేటివ్ వర్క్ బాగా తెలిసిన వాళ్ళు డ్రెస్ డిజైనర్స్ గా కృషి చెయ్యడం ఎంతో మంచిది అని నిరూపించింది.

వివిధ ప్రభుత్వ సంస్థలకు, షాపింగ్ మాల్స్ వర్కర్స్‌కి యూనిఫామ్ తయారీలో ప్రసిద్ది చెందినది. ఒక్కోసారి జీవితం చాలా విచిత్రంగా మారుతుంది. అది విధి రాత అన్నా మన ప్రయత్నం అన్నా ఏమి చెప్పలేము ఒక చిన్న బిజినెస్‌గా ఇంట్లో మొదలు పెట్టుకుని ఆన్‌లైన్ ద్వారా పెంచుకుని ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్య బ్రాండ్ ఐటమ్స్ అమ్ముడు పోతున్నాయి. ఎందరికో తక్కువ ధరకి ఆనందాన్ని ఇస్తున్నాయి.

మనిషి నచ్చిన వ్యాపకంలో ఉంటే ఎంతో ఆరోగ్యం, ఆయుష్యు, ఆనందం, ఆహ్లాదం. క్షణం ఖాళీ ఉండదు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది వరకు బిజీ. పిల్లల ఆన్‌లైన్ చదువు ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని బిజినెస్ వుమన్‍గా సక్సెస్ అయ్యింది. ఇంటి దగ్గర నుంచే ఐశ్వర్య ఎంతో ఐశ్వర్యాన్ని పొందింది.

జీవన సమరంలో శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల సారంతో మనిషి జీవితం ముడి పడి ఉన్నది. ఇందరికి అభయంబు లిచ్చు చేయి అన్నట్లు అమ్మ తన పిల్లల చదువుకు చక్కని అవకాశం వచ్చినందుకు తిరిగి చదువుతో ఆనందపడుతోంది. అదే జీవితానికి ఎంతో శాంతి.

ఇంటి పనులు, వంట పనులు చేసుకుని ఇల్లే స్వర్గంగా ఎంతో మంది విద్యావంతులు కుటుంబంలో ఇమిడి పోతున్నారు. మారే సమాజంలో ఎన్నో మార్పులు. ఆ విజయాల కోసం, ప్రతి స్త్రీ మార్పు కోసం ప్రయత్నించాలి. అదే స్త్రీ ప్రగతి, దేశ ఉన్నతి కూడా. కొందరు అయిన మారే జీవితాలు కోరితే అదే విజయ స్ఫూర్తి. అదే శాంతి శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here