హృదయానికి హత్తుకునే రచన – ‘కైంకర్యము’

0
2

[dropcap]శ్రీ[/dropcap]మతి యల్లాప్రగడ గారు రచించిన ‘కైంకర్యము’ సంపూర్ణముగా పఠించాను.

సంప్రదాయిక శ్రీవైష్ణవ సంపన్న కుటుంబమును యితివృత్తముగా తీసుకొని వారి జీవనములలో వివిధ సమయములందు జరిగిన సంఘటనలు తన అద్భుత రచనా పటిమతో పాఠకునికి విసుగు రానీకుండా చదివించే శైలితో లోకానుభవముతో రచించారు. ఈ నవలలో ప్రధానముగా సుదర్శనాచార్యులు, అండాళు, రాఘవాచార్యులు, ప్రసన్నలక్ష్మి వీళ్ళను చిత్రించిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉందీ రచన.

వైష్ణవ సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా వైష్ణవ కుటుంబ చిత్రణలో నైపుణ్యముతో రచించిన తీరు పరమ రమణీయం. కొన్నిపాత్రలందు రచయిత్రి దాగుకొనినట్లు (నేపథ్యం)అగుపిస్తుంది.

ముఖ్యముగా రాఘవను రాఘవాచార్యలుగా మలచినతీరు అత్యంత శ్లాఘనీయము. పవిత్రజీవనము యెడ రచయిత్రి కలము రాఘవ పాత్ర శుచిగా సాగినది.

మొదటిరచనలకు ఈ కైంకర్య నవలా రచనకు విభిన్నముగా కొనసాగినది.

సంధ్యా యల్లాప్రగడ గారిని ఈ సందర్భమున కొనియాడుచున్నాను. రాహుల్ సాంకృత్యాయన్ వలె ఈమె నిరంతరం సంప్రదాయ అన్వేషణలోనూ రచనా వ్యాసంగములందు నిమగ్నులై ఉంటారు. ఉత్తరోత్తరా ఉదాత్తరచనలతో సమాజమునకు చక్కని పవిత్ర సందేశములు ఇస్తారని ఆశిస్తూ వీరికి మంగళాశాసనములు తెలుపుతూ ముగిస్తున్నాను.

ఆర్షవిద్యానిష్ణాత దేవీదాస శర్మ. ఆత్మకూర్, వనపర్తి

***

కైంకర్యము (నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here