‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1) కొణిదెల శివశంకర వరప్రసాదు (4) |
| 3) సినారెను జ్ఞానపీఠ మెక్కించిన కావ్యం (4) |
| 5) జరుగుతుందనే నమ్మకంతో పెట్టుకునే ఆశ (4) |
| 7) విభీషణుని భార్య (3) |
| 8) అప్పడంతో పాటే ఇదీని – చివర కాస్త విరిగింది (3) |
| 9) లేత ధనియాల ఆకు (4) |
| 11) శ్రీకృష్ణుడే (4) |
| 13) హరిశ్చంద్రుని మంత్రి (4) |
| 15) పూర్వపు ప్రైవేటు, బజారు పాఠశాల (4) |
| 17) అభ్యుదయ రచయితల సంఘము (4) |
| 19) వంటయిల్లు (4) |
| 21) బడలిన ఒడలికి విశ్రాంతి – సుషుప్తి (3) |
| 22) దశరధుని భార్యలకు సంతానం ప్రసాదించిన పేయము (3) |
| 23) ఐమూలగా భుజమ్మీద వేసుకున్న ఉత్తరీయం (4) |
| 25) ఆ పిమ్మట (4) |
| 27) మంచు (4) |
| 29) ద్రౌపదికి భీముడు తెచ్చిచ్చిన పుష్పము (4) |
| 31) ఇంటి ముందు చల్లే పేడ నీరు (4) |
| 33) నిదుర మత్తు పోని ముఖం (4) |
| 35) చిన్న గుడ్డ ముక్క (3) |
| 36) శివుడే (3) |
| 37) పోవనిచ్ఛ గలవాడు (4) |
| 38) పురుగులు తొలిచెడు ధ్వన్యనుకరణము (4) |
| 39) చుంబించాలనిపించే ముఖం (4) |
నిలువు:
| 1) కిసలయము (4) |
| 2) కడుపులో ఒక సంవత్సరం పేరు దాచుకున్న రాత్రి (4) |
| 3) అనుసరించి తీరవలసినది (4) |
| 4) 19 అడ్డమే (4) |
| 5) బహుళ చతుర్దశి తరువాత రోజు (4) |
| 6) యమధర్మరాజు (4) |
| 10) ఆడుగుర్రము (3) |
| 12) నలబైతొమ్మిదో ఏడు (3) |
| 14) భక్తి పాట (3) |
| 15) శివభక్తులు కాని వారిని హింసించాలనే దూకుడు గల పద్దతి (4) |
| 16) భయాదులచే సత్వ హీన మగుస్థితి (4) |
| 17) బొబ్బర్లు – ఒక పప్పు ధాన్యము (4) |
| 18) కొరడా (4) |
| 19) చెడిపోయిన దానిని బాగు చేయడం (4) |
| 20) చేవ్రాలు (4) |
| 24) వంతెన (3) |
| 26) చారు పొడి గింజ (3) |
| 28) మధ్యది – అవలగ్నము (3) |
| 29) ఆవు (4) |
| 30) లవంగము (4) |
| 31) కోపగించుకొను (4) |
| 32)అతి చిన్న దానినుండి – అతిగొప్ప దానిని చెప్పడానికి —- ఆది బ్రహ్మ పర్వంతము అంటారు (4) |
| 33) ఖర్చులూ అవీ పోగా ఖచ్చితంగా మిగిలేది – సముదాయం కూడా (4) |
| 34) నరుక బడినది (4) |
మీరు ఈ ప్రహేళికని పూరించి 2024 ఆగస్ట్ 25వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-10 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 01 సెప్టెంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-9 జవాబులు
అడ్డం:
1) దధిబుస 3) కశేరుక 5) విజ్ఞాపన 7) లహరి 8) ఖద్దరు 9) తిరోధానం 11) లుబ్దకుడు 13) డమరుకం 15) కారయిత 17) విహాయసం 19) కుటిలుడు 21) దెప్పరం 22) శిలువ 23) టంకసాల 25) తిరునాళ 27) కందిరీగ 29) అమెరికా 31) వల్లవుడు 33) అమానుష 35) బుభుక్ష 36) బరక 37) సరాసరి 38) ముదినక్క 39) లజ్జాళువు
నిలువు:
1) దమయంతి 2) సల్లేఖనం 3) కబురులు 4) కలగుండు 5) విరిదండ 6) నలపాకం) 10) ధాత్రేయి 12) కుళ్ళాయ 14) రుమాలు 15) కాలకూటం 16) తక్షశిల 17) విద్యావతి 18) సందెవేళ 19) కురంటకం 20) డుడురుగ 24) సామీరి 26) నాకువు 28) రీజను 29) అడ్డబాస 30) కాదంబరి 31) వల్మీకము 32) డుబుడక్క 33) అక్షమాల 34) షడ్బిందువు
పద శారద-9 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి. రాజు
- రంగావజ్ఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంబర వెంకట రామ జోగారావు
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
















